ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Wild Cards: బిగ్​బాస్​లో "వైల్డ్ కార్డ్స్​" తుపాను! - కంటెస్టెంట్స్​కు ఒకే ఒక్క ఛాన్స్​!

-వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారని బిగ్‌బాస్ ప్రకటన - వారిని ఆపేందుకు టాస్క్​లు - కంటెస్టెంట్స్​ను జంటలుగా సెట్​ చేసిన బిగ్​బాస్​!

Bigg Boss 9 Telugu Wild Cards
Bigg Boss 9 Telugu Wild Cards (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 7, 2025 at 5:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Wild Cards: బిగ్​బాస్​ సీజన్​ 9 మొదలై నాలుగు వారాలు పూర్తయి.. ఐదో వారంలోకి ఎంటర్​ అయ్యింది. ఇప్పటికే సెలిబ్రిటీలు వర్సెస్​ కామనర్స్​గా సాగుతోన్న ఈ షోకు మరింత హైప్​ తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్లాన్​ చేసింది బిగ్​బాస్​ టీమ్​. ఎందుకంటే హౌజ్​లోకి వైల్డ్​కార్డ్​ ఎంట్రీలు రాబోతున్నాయి. బిగ్​బాసే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే ఎప్పుడు వస్తున్నారో చెప్పలేదు కానీ, గత సీజన్​ మాదిరే వాళ్లు రాకుండా ఉండటానికి కంటెస్టెంట్స్​ మధ్య కొన్ని టాస్కులు నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్​ చేశారు. మరి, ఈ టాస్క్​లు ఎలా జరిగాయి? టీమ్స్​గా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

జంటలుగా కంటెస్టెంట్స్​: "రణరంగం మీ ఊహలకి అందని ప్రదేశం. ఈ వారం డేంజర్‌లో ఉన్న వారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్‌లో ఉన్నవారిని కుదిపేస్తుంది. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో మీకు తెలుసా? వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ తుపాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్​ చేశాడు. ఇక వైల్డ్​కార్డ్స్ అనగానే హౌజ్​మేట్స్ షాక్​ అయ్యారు.

ఇక గత సీజన్​ మాదిరే ఈ సీజన్​లో కూడా వైల్డ్ కార్డ్స్‌ని వీలైనంతవరకు ఆపే ఛాన్స్​ను కంటెస్టెంట్స్​కు ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. ఇందుకోసం సభ్యులందరినీ జంటలుగా డివైడ్ చేశారు. ఇందులో వీలైనన్నీ టాస్కులు గెలవాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే.. దానిని బట్టి వైల్డ్ కార్డ్స్‌ ఎంట్రీ ఉంటుంది. మరి, బిగ్‌బాస్ డివైడ్ చేసిన జంటలు ఎలా ఉన్నాయంటే.. భరణి-దివ్య, రీతూ చౌదరి-డీమన్ పవన్, సంజనా - ఫ్లోరా సైనీ, సుమన్​ శెట్టి-శ్రీజ, కళ్యాణ్-తనూజ. కెప్టెన్ రాముని, ఇమ్యూనిటీ పొందిన ఇమ్మాన్యుయేల్​ని మాత్రం ఈ టాస్కుల్లో భాగం చేయలేదు. ఎందుకంటే వీళ్లిద్దరూ నామినేషన్స్‌లో లేరు. ఇక ఒక టాస్కుకి సంచాలక్‌గా ఇమ్మాన్యుయేల్​ను పెట్టాడు బిగ్​బాస్​.

ఫస్ట్​ టాస్క్​ ఇదే: వైల్డ్​కార్డ్స్​ ఎంట్రీలను ఆపేందుకు నిర్వహించిన ఫస్ట్​ గేమ్​ ఇసుక. ఇసుక టాస్క్‌లో జంటలన్నీ పోటీపడ్డాయి. "ఏ జంట అయితే తమ సీసాని చివరివరకూ ప్లాట్‌ఫామ్‌కి టచ్ కాకుండా చూసుకుంటారో ఆ జంట ఈ టాస్కు విజేతలు అవుతారు" అని బిగ్‌బాస్ అనౌన్స్​ చేశాడు. ముందుగా సుమన్, సంజనా జంటలు ఈ టాస్కు నుంచి ఔట్ అయ్యారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్​, సంచాలక్​ మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక అనంతరం కల్యాణ్​ టీమ్​ ఓడిపోయింది. దీంతో చివరికి ఈ టాస్కులో భరణి-డీమాన్ మిగిలారు. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం మొదటి టాస్క్​ రీతూ చౌదరి - డీమన్​ పవన్​ గెలిచినట్లు సమాచారం.

రెండో ప్రోమోలో ఫుల్​ ఫన్​: ఇక తాజాగా రిలీజ్​ చేసిన సెకండ్​ ప్రోమోలో తనూజ, ఇమ్మాన్యుయేల్​ మధ్య ఫన్​ జనరేట్​ అయ్యింది. "బయటికి వెళ్లాక మీరు చూడాలనుకున్న ఫస్ట్​ పర్సన్​ ఎవరు" అని దివ్య అడగ్గా.. "నేను ఫస్ట్​ కలిసేది నాన్న విత్​ సమ్​ వన్​ పర్సన్​" అని తనూజ ఆన్సర్​ ఇచ్చింది. ఇంతలో "నాన్న, అల్లుడు, కూతురు కలుస్తారంటవు అయితే. మరి అల్లుడు నేనే కదా" అని ఇమ్మూ ఆన్సర్​ ఇచ్చాడు. దీంతో హౌజ్​ మొత్తం ఎంజాయ్​ చేశారు. ఇలా ప్రోమో మొత్తం ఎంటర్​టైన్​గా సాగగా, లాస్ట్​లో​ హౌజ్​మేట్స్​ తమ ఫ్యామిలీ మెంబర్స్​ను గుర్తుచేసుకుని ఎమోషనల్​ అయ్యారు. అలా సెకండ్​ ప్రోమో కూడా ఎండ్​ అయ్యింది.

Bigg Boss 9 Telugu Day 29 Episode: ఐదో వారం నామినేషన్స్​లో "పది మంది" - డేంజర్​ జోన్​లో "ఆ ఇద్దరు"!

Bigg Boss 9 Today Promo : నవ్వులు పూయించిన 'నడుము' గొడవ - ఆ ఇద్దరిలో 'ఒకరు' ఔట్!