ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Wild Cards: రణరంగం 2.0 లోడింగ్​ - వైల్డ్​కార్డ్స్​ వీళ్లేనట! - బిగ్​బాస్​ ప్లానింగ్​ అదుర్స్​!

-సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోన్న వైల్డ్​కార్డ్​ కంటెస్టెంట్స్​ నేమ్స్​ - లిస్ట్​లో పేర్లు మామూలుగా లేవుగా!

Bigg Boss 9 Telugu Wild Cards
Bigg Boss 9 Telugu Wild Cards (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 10, 2025 at 2:25 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Wild Cards: బిగ్​బాస్​ షో హిట్​ కావాలంటే అందులోకి వచ్చే కంటెస్టెంట్స్​ ఎవరనేది ముఖ్యం​. ఆ తర్వాత వాళ్లు ఆడే టాస్క్​లు, లవ్​ట్రాక్​లు, జెన్యూనిటీ, గొడవలు వగైరా. ఇవన్నీ బేస్​ చేసుకునే షోపై ఒక ఒపీనియన్​కి వస్తుంటారు ఆడియన్స్​. తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. అందుకే ఈ షో సక్సెస్​ఫుల్​గా 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న సీజన్​ మరింత ఆసక్తిగా మార్చడానికి బిగ్​బాస్​ వైల్డ్​ డేసిషన్​ తీసుకున్నారు.

రణరంగం 2.0 పేరుతో మినీ గ్రాండ్​ లాంఛ్​ ద్వారా వైల్డ్​కార్డ్స్​ కంటెస్టెంట్స్​ను హౌజ్​లోకి పంపించబోతున్నారు. ఈ వైల్డ్​కార్డ్స్​ పేరు ఎత్తితే చాలు.. హౌస్​లోకి వెళ్లేది వీళ్లేనంటూ రోజుకో పేరు వైరల్​ అవుతూ ఉంటుంది. తాజాగా సీజన్​ 9 వైల్డ్​కార్డ్స్​కు సంబంధించి కూడా కొద్దిమంది పేర్లు వైరల్​ అవుతున్నాయి. దాదాపు వీళ్లు కన్ఫార్మ్​ అయినట్టు టాక్​. వారిలో సినిమా, సీరియల్​, ఇన్​ఫ్లూయన్సర్​ ఇలా రకరకాల విభాగాలకు చెందిన వారున్నారు. మొత్తం ఆరుగురు హౌస్​లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. అందులో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్టు సోషల్​ మీడియా కబురు.

ఆయేషా జీనత్: వైల్డ్​కార్డ్ కంటెస్టెంట్స్‌గా వెళ్లబోతున్న వాళ్లలో ఆయేషా పేరు బలంగా వినిపిస్తోంది. పలు సీరియళ్లు, షోస్​లలో అలరించిన ఈ బ్యూటీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పైగా ఈమెకు బిగ్​బాస్​ కొత్తేమీ కాదు. గతంలో తమిళ్ బిగ్​బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్. దాదాపు 9 వారాలు పాటు హౌజ్​లో ఉంది. తమిళ బిగ్​బాస్‌లో వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచింది. వాదనలు కూడా బలంగా వినిపించిన ట్రాక్ రికార్డ్ ఈ బ్యూటీ సొంతం. ఇన్​స్టాగ్రామ్​లో ఈ ముద్దుగుమ్మకు ఫాలోవర్లు కూడా ఎక్కువే. ఒకవేళ ఈ పాప వైల్డ్​కార్డ్​గా అడుగుపెడితే ఫైర్​ చూపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని టాక్​. ఎందుకంటే ఐదు వారాల ఆట చూసి వచ్చింది.. పైగా బిగ్​బాస్ ఎక్స్‌పీరియన్స్ ఉండటంతో ఎక్కడ ఎలా ఉండాలో ఆమెకు కంటెంట్​తో పెట్టిన విద్య అని అనుకుంటున్నారు.

గౌరభ్ గుప్త: సీజన్​ 9లో వైల్డ్​కార్డ్​గా ఈ సీరియల్​ నటుడు కూడా అడుగుపెడుతున్నట్లు టాక్​. పలు తెలుగు సీరియల్స్​ చేసిన ఇతని గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. ఫిజికల్​గా కూడా మనిషి ఫిట్​. ఇక ఈ పర్సన్​ హౌజ్​లోకి వెళ్తే డీమాన్​ పవన్​, కల్యాణ్​కు ఫిజికల్​ టాస్క్​లలో మంచి ఫైట్​ ఇస్తాడని భావిస్తున్నారు. అంతేకాకుండా కొత్త ముఖాలు హౌజ్​లోకి వెళితే లవ్​ ట్రాక్​లకు కొదవే ఉండదు.

అలేఖ్య చిట్టి పికెల్స్​ రమ్య మోక్ష: బిగ్​బాస్ సీజన్ 9 మొదలైనప్పటి నుంచి ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. స్టార్టింగ్​లోనే వెళ్తుందని భావించగా.. వైల్డ్​కార్డ్​ రూపంలో హౌజ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఈ బ్యూటీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ అమ్మడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అందంతో పాటు ఫిజికల్​ కూడా ఈ అమ్మడు స్ట్రాంగ్​. సో హౌజ్​లోకి వెళితే కంటెంట్​ ఫుల్​గా ఇస్తుందనడంలో డౌట్​ లేదు.

శ్రీనివాస సాయి: తెలుగు నటుడు శ్రీనివాస సాయి కూడా హౌస్​లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించే శ్రీనివాస సాయి.. 2011లో సుమంత్ హీరోగా వచ్చిన​ "గోల్కొండ హైస్కూల్‌" సినిమాలో సిద్ధాంత్​ క్యారెక్టర్​ చేసి పాపులర్ అయ్యాడు. ఆ తరువాత "శుభలేఖలు", "వినరా సోదర వీరకుమారా" వంటి సినిమాల్లో కనిపించాడు. ఇతను కూడా ఫిజికల్​గా ఫిట్​గానే ఉండటంతో గేమ్​లో పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

మాధురి: ఈ సీజన్​లో మరో వైల్డ్​ కార్డ్ "దివ్వెల మాధురి" అని చెప్పుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్​ కారణంగా పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీతోనే హౌస్​లోకి ఎంట్రీ పాస్ సంపాదించిందని టాక్. నిజానికి షో స్టార్టింగ్​లోనే ఆఫర్​ వచ్చినా రిజెక్ట్​ చేసిందట. ఆ తర్వాత వైల్డ్​ కార్డ్​ ఎంట్రీకి ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

నిఖిల్​ నాయర్​: పలు సీరియల్స్​లో హీరోగా నటించిన నిఖిల్​కు తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ బాగానే ఉంది. కేవలం సీరియల్స్​ మాత్రమే కాకుండా "దిల్ సే" వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటించాడు. ఇతను ఫిజికల్ టాస్క్‌లలో తలపడితే అడ్డుకోవడం కష్టమే. సీజన్​ 7లో ప్రిన్స్ యావర్ ఎలాగైతే స్ట్రాంగ్‌గా కనిపించాడో, ఇప్పుడు ఈ నిఖిల్ నాయర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. గేమ్స్​లో బాగా ఆడితే టాప్​ 5లో కూడా చోటు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ ఆరుగురు బిగ్​బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా కన్ఫామ్ అయినట్టు సోషల్​ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికాస్త టైమ్​ వెయిట్​ చేయాల్సిందే.

వైల్డ్​కార్డ్స్​ ఎంట్రీ ఎప్పుడు: ఈ సీజన్​లో కూడా వైల్డ్​కార్డ్​ ఎంట్రీని గట్టిగానే ప్లాన్​ చేస్తోంది బిగ్​బాస్ టీమ్​. రణరంగం 2.0 పేరుతో మినీ గ్రాండ్​ లాంఛ్​ ఎపిసోడ్​ ప్లాన్​ చేస్తున్నారట. ఈ ఆదివారం అక్టోబర్​ 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు షో స్టార్ట్​ కానుందని సమాచారం.

Bigg Boss 9 Telugu: "ఓవైపు వైల్డ్​కార్డ్స్ - మరోవైపు డబుల్ ఎలిమినేషన్ " - బిగ్​బాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Bigg Boss Hosts Remunerations: బిగ్​బాస్​ హోస్ట్​లుగా స్టార్​ హీరోలు - ఎవరి రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?