Bigg Boss 9 Telugu Wild Cards: 'వైల్డ్‌కార్డ్స్' లోడింగ్ - ఆరోజే డోర్స్ ఓపెన్!
-హోజ్‌లోకి వైల్డ్కార్డ్లను పంపించేందుకు బిగ్‌బాస్ టీమ్ కసరత్తు - అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయినవారిలో ఒకరికి ఛాన్స్!

Published : September 23, 2025 at 7:57 PM IST
Bigg Boss 9 Telugu Wild Cards Updates: బిగ్‌బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఇక ఈ షో మొదలై రెండు వారాలు పూర్తి అయ్యి మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటికే కామనర్స్ వర్సెస్ సెలిబ్రిటీల మధ్య నామినేషన్లు, టాస్కుల విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి సమయంలో షో పై మరింత హైప్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్‌కు బిగ్‌బాస్ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుంది. అదే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు. మీరు విన్నది నిజమే. హౌజ్‌లోకి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేందుకు రంగం సిద్ధమైంది. గత సీజన్ మాదిరి కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చేది ఎవరో ఇప్పుడు చూద్దాం.
హౌజ్‌లో 13 మంది: సెప్టెంబర్ 7వ తేదీన మొదలైన తొమ్మిదో సీజన్లో 9 మంది సెలిబ్రిటీలు, ఆరుగురు కామనర్లు కలిపి మొత్తం 15 మంది ఎంటర్ అయ్యారు. షో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీక్‌లో సెలిబ్రిటీల నుంచి కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, రెండో వీక్‌లో కామనర్ల నుంచి మర్యాద మనీష్ బయటికి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతానికి హౌజ్‌లో 13 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఆటను మరింత ఆసక్తిగా మార్చడానికి వైల్డ్‌కార్డ్స్ రాబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందరూ అనుకున్నట్లు సెలిబ్రిటీలను కాకుండా ముందుగా అగ్నిపరీక్షలో పలు పరీక్షలు ఎదుర్కొని టాప్ 13లో చోటు సంపాదించుకున్న వారిని ఇంట్లోకి పంపిస్తున్నట్లు సమాచారం.
ఇంట్లోకి వెళ్లేదెవరు: కామనర్లకు అవకాశం కల్పిస్తూ నిర్వహించిన అగ్నిపరీక్షలో ప్రతిభ చూపిన వాళ్లని హౌజ్‌లోకి పంపించబోతున్నారట. అలా ఈ వారంలో నాగ ప్రశాంత్, దివ్య నిఖిత, షాకీబ్, అనూష మొత్తంగా ఈ నలుగురు కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లోకి పంపించబోతున్నారనేది సోషల్ మీడియా ప్రకారం లేటెస్ట్ అప్డేట్. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే, ఇప్పటి వరకూ వైల్డ్ కార్డ్స్ అంటే నేరుగా హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. వైల్డ్ కార్డ్స్ ద్వారా వెళ్తున్న ఈ నలుగురు డైరెక్ట్‌గా కంటెస్టెంట్స్ కాలేరు. హౌజ్‌లోకి వెళ్లి వాళ్లని వాళ్లు నిరూపించుకుంటేనే కంటెస్టెంట్స్ అవుతారు. అప్పటి వరకూ వాళ్లు పోటీదారులు మాత్రమేనట.
Bigg Boss 9 : సంజనా గల్రానీ చెల్లి టాలీవుడ్ హీరో భార్య! - ఈ విషయాలు తెలుసా?
కంటెస్టెంట్ కావాలంటే: హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన వాళ్లలో ఒక్కరు మాత్రమే హౌజ్‌లో ఉండటానికి అర్హత సాధిస్తారట. ఈ సెలక్షన్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చని టాక్. ఒకటి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో ప్రతిభ ఆధారంగా నేరుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అర్హత. రెండోది హౌజ్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎంపిక. అలా ఈ నలుగురులో నుంచి ఒకరు మాత్రమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అర్హత సాధిస్తారు. మిగిలిన ముగ్గురికి ఇది చివరి అవకాశమన్నట్టే. అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం ఆల్రెడీ ఈ నలుగురికి టాస్క్‌లు మొదలైనట్లు తెలుస్తోంది.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఎప్పుడు: సాధారణంగా బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ అంటే పెద్ద హంగామా ఉంటుంది. 2.0 పేరుతో గ్రాండ్‌గా లాంఛ్ చేసి వైల్డ్‌కార్డ్స్‌ను ఇంట్లోకి పంపిస్తుంటారు. అయితే ప్రస్తుతం అగ్నిపరీక్ష నుంచి వెళ్లేవారికి ఇదేమి లేకుండా నేరుగా హౌజ్‌లోకి వెళ్లనున్నారు. అది కూడా మిడ్ వీక్‌లో. అయితే నార్మల్‌గా డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఒకరిని మీడ్ వీక్‌లో ఎలిమినేట్ చేసేవారు. కానీ ఈ సీజన్ భిన్నం కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ బదులు మిడ్ వీక్ వైల్డ్‌కార్డ్‌కు ప్లాన్ చేశారట. ఈ బుధవారం లేదా గురువారం నాటి ఎపిసోడ్లో హౌజ్‌లోకి ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఐదు లేదా ఆరో వారంలో మరికొందరు: ఇక వైల్డ్‌కార్డ్స్ పేరిట మరికొందరు హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్షలో వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన కామనర్తో కలిపి మొత్తంగా 9 మంది ఉంటారని సమాచారం. ఇక వీళ్లందరిలో కొందరు బిగ్‌బాస్ గత సీజన్లలో పాల్గొన్నవారిగా తెలుస్తోంది. వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చేవాళ్లలో లేడీ కమెడియన్ రోహిణి, సీజన్ 4 రన్నర్ అఖిల్, సీరియల్ నటి కావ్య ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వైల్డ్ కార్డ్‌గా వెళ్లేవారు ఐదు లేదా ఆరో వారంలో ఎంట్రీ ఇస్తారట. అలా కాకుండా ఇంక ముందుగానే అంటే దసరా లేదా దీపావళి వేళ ఇంట్లోకి పంపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Bigg Boss 9 Today Promo : ముద్దులతో మత్తెక్కించిన 'నాగ్' - తనూజ లవ్ సీక్రెట్ పై గురిపెట్టిన కింగ్!

