ETV Bharat / entertainment

Bigg Boss 9 Weekend Episode : ఇమ్మూకు 'పవర్ అస్త్ర' - తనూజ కళ్లు తెరిపించిన నాగ్ - డబుల్ ఎలిమినేషన్​లో వీరు ఔట్!

- వీకెండ్ ఎపిసోడ్​లో కంటెస్టెంట్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ - ఈ వారం ఎలిమినేషన్​లో వారిద్దరే!

Bigg Boss 9 Telugu Weekend Episode Review
Bigg Boss 9 Telugu Weekend Episode Review (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2025 at 11:05 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Weekend Episode Review : బిగ్ బాస్ 9 సీజన్​ ఐదో వారం వీకెండ్ ఎపిసోడ్​లో కింగ్ నాగార్జున న్యూ మాస్ లుక్​లో అదరగొట్టారు. శనివారం నాటి డే 34 ఎపిసోడ్​లో కంటెస్టెంట్స్​లో జోష్ పెంచుతూనే వారం మొత్తంలో జరిగిన టాస్కులు, గేమ్స్​లో తప్పులు చేసిన వారికి క్లాస్ తీసుకున్నారు. అలాగే, గత వారం మాదిరిగానే ఒక్కొక్కరికి స్టార్స్ ఇప్పిచారు హోస్ట్ నాగార్జున. ముఖ్యంగా డిమోన్, రీతూ చౌదరి, భరణిలకు టాస్క్​లలో వ్యవహరించిన తీరును వివరిస్తూ గట్టిగానే చురకలు అంటించారు. ఇక పవరస్త్ర టాస్క్​లో ఇమ్మానుయేల్ విన్ అయ్యారు. ఇలా ఈ వీకెండ్ ఎపిసోడ్​లో చోటు చేసుకున్న మరిన్ని విశేషాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఐదో వారం ఎండింగ్​కు చేరుకుంది. ప్రతి వారం మాదిరిగానే ఈ వీకెండ్ కూడా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరును వివరిస్తూ హిత బోధ చేశారు. డే 34 ఎపిసోడ్​లో ముందుగా స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఈ పూరీ ఛాలెంజ్ టాస్క్​లో తనూజ టీం విన్ అయింది. అనంతరం హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడారు. మొదటగా కొత్త కెప్టెన్ పవన్​ కల్యాణ్​ను అభినందించారు. "అసలు ఉంటావో లేవో అనుకున్న పరిస్థితి నుంచి కెప్టెన్ అయ్యావు.. ఇమ్యూనిటీ కూడా వచ్చింది" అంటూ కల్యాణ్​ను ప్రశంసించారు. తర్వాత కల్యాణ్​కు తనూజ చేత గోల్డెన్ స్టార్ ఇప్పించాడు నాగ్.

తనూజ ఎవరు ఏంటో మర్చిపోకు..

అనంతరం తనూజని కన్ఫెషన్ రూంకి పిలిచి కెప్టెన్సీ టాస్క్​కు సంబంధించిన ఒక వీడియోను చూపించారు నాగార్జున. అది మనిద్దరి మధ్యనే ఉండాలంటూ డిమోన్ పవన్ చేసిన ఒక మిస్టేక్​ను చూపించారు. డిమోన్ హెల్ప్​తో కల్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయినట్లు అంటూ క్లారిటీ ఇచ్చారు. "తనూజా.. గెలవడం ముఖ్యమే. ఎలా గెలిచాం అనేది ఇంపార్టెంట్. నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో. ఎవరు ఏంటో మర్చిపోకు. నీ ఆటని దీన్ని బట్టి మార్చుకో" అని చెబుతూ ఆమె కళ్లు తెరిపించారు హోస్ట్ కింగ్ నాగార్జున. తర్వాత తనూజకు గోల్డెన్ స్టార్ ఇస్తూ.. "బెడ్ టాస్క్​లో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా? కల్యాణ్, భరణి, ఇమ్మాన్యుయేల్ నిన్ను గేమ్​ నుంచి సేవ్ చేస్తారని అనుకున్నావా?" అంటూ కింగ్ నాగ్ ప్రశ్నించారు. ఫ్యూచర్​లో రిగ్రెట్ కాకుండా ఆడేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

భరణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్..

ఆ తర్వాత భరణికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగ్. అనంతరం భరణిని టాస్క్​లలో చేసిన తప్పులను వివరిస్తూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. బెడ్ టాస్క్‌లో శ్రీజాని తోసేయడం కరెక్టా? డిమాన్ పవన్‌తో జరిగిన తోపులాటలో ఎవరు కాలు ముందుకు పెట్టారు? అని క్వశ్చన్స్ అడిగారు. ఈ రెండు విషయాల్లో తనదే మిస్టేక్ అనీ, స్వార్ధంగా ఆలోచించాననీ ఒప్పుకున్నాడు భరణి. "ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మీద నుంచే కాదు, మా దృష్టిలో కూడా కింద పడ్డావ్" అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నాగ్. తర్వాత దివ్య ఆటతీరును అభినందిస్తూ గోల్డెన్ స్టార్ ఇచ్చారు.

Bigg Boss 9 Telugu Wild Cards: రణరంగం 2.0 లోడింగ్​ - వైల్డ్​కార్డ్స్​ వీళ్లేనట! - బిగ్​బాస్​ ప్లానింగ్​ అదుర్స్​!

వీరికి బ్లాక్ స్టార్స్..

నెక్ట్స్ ఫ్లోరాని నిలబెట్టి.. బెడ్​ టాస్క్​లో సాంచలక్​గా వ్యవహరించినప్పుడు చేసిన తప్పులు ఎత్తి చూపారు. ఆ తర్వాత రాము కెప్టెన్సీని అభినందించారు. రాము, ఇమ్మాన్యుయేల్​కు గోల్డెన్ స్టార్ ఇచ్చారు. అనంతరం బెలూన్ టాస్క్, స్విమ్మింగ్ పూల్ టాస్కులకు సంబంధించి సుమన్ శెట్టి, రాముకు క్లాస్ తీసుకున్నారు కింగ్ నాగ్. అలాగే, బెలూన్ టాస్కులో రీతూ బ్రిలియంట్ స్ట్రాటజీ ప్లే చేశారని, ఆమె తప్పులను ఎత్తిచూపుతూ గట్టిగానే క్లాస్ పీకారు. వీరి తర్వాత డేంజర్​ జోన్​లో సంజన, ఫ్లోరా, రీతూ చౌదరి, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజలకు బ్లాక్ స్టార్‌ ఇచ్చారు.

ఇమ్మాన్యుయేల్​కు పవర్ అస్త్ర..

గోల్డెన్ స్టార్స్ తీసుకున్న తనూజ, భరణి, దివ్య, ఇమ్మూ, కల్యాణ్​, రాము రాథోడ్ ఈ ఆరుగురికి ఒక టాస్క్ నిర్వహించారు. అదే, "పవర్ అస్త్ర". ఈ టాస్క్​లో ఒక్కొక్కరూ వెళ్లి ఎవరికి ఆ పవర్ దక్కకూడదు అనుకుంటున్నారో వాళ్లు వారి పేరు దగ్గర ఉన్న కీని తీసుకుని విరిచేసి కారణం చెప్పాలన్నారు. ఈ టాస్క్​ ఇమ్మానుయేల్ విన్ అయి పవర్ అస్త్రను దక్కించుకున్నాడు. అది ఎక్కడ వాడాలో టైమ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ చెబుతారని నాగ్ చెప్పాడు. ఇక ఎపిసోడ్ చివర్లో డేంజర్​ జోన్​లో ఉన్న శ్రీజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరి, డిమోన్ పవన్, సంజన వీరందరికీ "నేమ్ బోర్డ్" టాస్క్ పెట్టారు. అందులో రీతూ, ఫ్లోరా ఎవిక్షన్​కు దగ్గరలో ఉండగా, మిగిలిన నలుగురు డేంజర్​ జోన్​లోనే ఉన్నారని చెప్పారు. దాంతో శనివారం ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఇక సండే ఎపిసోడ్​లో ఎలిమినేషన్ ప్రాసెస్​ ఉండనుంది.

Bigg Boss 9 Telugu: ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్​​ - ఆ ఇద్దరే ఔట్?

వీరిద్దరూ ఎలిమినేట్!

సండే ఎపిసోడ్​లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో పాటు డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, డేంజర్​ జోన్​లో ఉన్న కంటెస్టెంట్స్​లో ఇద్దరు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. వారిలో ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ ఉన్నట్టు సోషల్ మీడియాలో అన్​ అఫీషియల్ న్యూస్ వైరల్ అవుతోంది. అధికారికంగా తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే!

Bigg Boss 9 Telugu Day 33 Episode: దివ్యకు తనూజ వెన్నుపోటు - హౌజ్​లో హై డ్రామా - ఐదో కెప్టెన్​గా కల్యాణ్​!