ETV Bharat / entertainment

Bigg Boss 9 Weekend Episode : ఇమ్మాన్యుయేల్​కు గోల్డెన్ - ఇద్దరికి బ్లాక్ స్టార్ - చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్!

- వీకెండ్ ఎపిసోడ్​లో కంటెస్టెంట్స్​కు ప్రోగ్రెస్ రిపోర్ట్ - రెండు వారాలకు "ఆమె" నేరుగా నామినేట్!

Bigg Boss 9 Telugu Weekend Episode
Bigg Boss 9 Telugu Weekend Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 5, 2025 at 11:05 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Weekend Episode : బిగ్ బాస్ - 9 నాలుగో వారం వీకెండ్​ ఎపిసోడ్​లో కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అదుర్స్ అనిపించారు. హౌస్​లో ఉన్న కంటెస్టెంట్స్​లో బాగా ఆడే వాళ్లని ఎంకరేజ్ చేస్తూ.. ఆడలేకపోతున్న వాళ్లు ఏ విషయంలో వెనుకపడుతున్నారో చెప్పుకొస్తూ వాళ్లని సరిచేస్తూ ముందుకు సాగారు కింగ్. అలాగే, హౌస్​మేట్స్ ఒక్కొక్కరికీ వారి ఆట తీరు ఆధారంగా స్టార్స్ ఇచ్చారు. ఈ క్రమంలో మంచి ఆట తీరు కనబరిచిన ఇమ్మాన్యుయేల్​కు గోల్డ్ స్టార్ ఇవ్వగా.. పూర్ పెర్ఫామెన్స్ కారణంగా ఇద్దరికి బ్లాక్ స్టార్ ఇచ్చారు. లాస్ట్ మినిట్​ బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ఒకరిని రెండు వారాలకు నేరుగా నామినేట్ చేశారు నాగార్జున. మరి, వీకెండ్​ ఎపిసోడ్​లో చోటుచేసుకున్న ఆ విశేషాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ - 9 సీజన్ నాలుగో వారం డే 27 శనివారం ఎపిసోడ్​లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను సూటి ప్రశ్నలతో ఇరుకున పెడుతూ.. వారం రోజులుగా హౌస్​లో జరిగిన సంఘటనలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముందుగా శనివారం ఎపిసోడ్​లో సంజనా చోరీ గేమ్స్.. దానికి సంబంధించి పనిష్‌మెంట్‌పై చర్చ నడిచింది. ఆపై హౌస్​కి కొత్త కెప్టెన్ అయిన రాము రాథోడ్​ను అభినందించారు కింగ్ నాగ్. అనంతరం కంటెస్టెంట్స్​ను రెండు టీమ్స్​గా విడగొట్టి బిర్యానీ టాస్క్ ఇచ్చారు. ఇందులో డిమోన్ పవన్ టీమ్ విన్ అయ్యింది.

ఇమ్మాన్యుయేల్​కు గోల్డెన్.. వారిద్దరికి బ్లాక్ స్టార్..

వీకెండ్ ఎపిసోడ్​లో భాగంగా హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి పెర్ఫామెన్స్ ఆధారంగా గోల్డ్, సిల్వర్, బ్లాక్ స్టార్లు ఇచ్చారు. గడిచిన నాలుగు వారాల్లో గేమ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్లకి గోల్డెన్ స్టార్, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయని కంటెస్టెంట్స్​కు బ్లాక్ స్టార్ వస్తుందని చెప్పారు నాగ్. అలాగే, ఆటలో ఇంఫ్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్లక సిల్వర్ స్టార్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా మొదటగా ఉన్న ఒకే ఒక్క గోల్డెన్ స్టార్​ను ఇమ్మాన్యుయేల్​కు ఇచ్చారు హోస్ట్ నాగార్జున. నువ్వు అన్ని రకాలుగా గేమ్​లో అదరగొడుతూ మంచి పెర్ఫామెన్స్ ఇస్తున్నావంటూ ఇమ్మూను ప్రశంసించారు. నువ్వు ఇలాగే ముందుకు వెళ్లాలంటే మీ మమ్మీ నుంచి కాస్త దూరంగా ఉండాలి అంటూ ఒక సలహా కూడా ఇచ్చారు నాగ్.

తర్వాత శ్రీజతో మాట్లాడుతూ.. "నువ్వు ఏ స్టార్‌కి అర్హురాలివి?" అని అడిగారు హోస్ట్ నాగార్జున. దాంతో ఆమె.. ‘సిల్వర్ స్టార్’ అని అన్నది. ఇదే క్రమంలో కెప్టెన్సీ టాస్క్​ విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని క్లియర్ చేస్తూ శ్రీజకు సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఆపై సుమన్ శెట్టిని లేపిన కింగ్.. "నువ్వు గోల్డెన్ స్టార్​కి దగ్గరగా ఉన్నావ్.. హనుమంతుడికి తన శక్తి తెలియదన్నట్టు నీ బలం నీకు అర్థం కావడం లేదు" అంటూ సిల్వర్ స్టార్ ఇచ్చారు. అనంతరం తనూజకు కూడా సిల్వర్ ఇచ్చారు. "బంధాల వల్ల వీక్ అవుతున్నావు", ఫుడ్ మానిటర్ మార్పు విషయాలను గుర్తు చేశారు. అలాగే, పోపు గొడవలో తనూజాదే తప్పని తేల్చి చెప్పారు. ఆపై రాంగ్ పర్సన్​కు ఫుడ్ మానిటర్ ఇచ్చారంటూ డిమోన్ పవన్​కు కౌంటర్ ఇచ్చారు నాగ్.

Bigg Boss 4th Week Voting: ఎలిమినేషన్​లో బిగ్​ ట్విస్ట్​ - ఒక్కరోజులో మారిన​ లెక్కలు - డేంజర్​లో ఉన్నదెవరంటే!

ఇక "స్ట్రాటజీ మిస్ అవుతోంది" అంటూ రీతూ చౌదరికి, దివ్యకి, డిమోన్ పవన్​కి సిల్వర్ స్టార్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. నెక్ట్స్ రాము రాథోడ్​కు "నువ్వు వస్తుంటే అవతలి వారి గుండెల్లో దడదడ" అంటూ సిల్వర్ ఇచ్చారు. అదేవిధంగా, సంజనను టెనెంట్​గా మార్చి.. "ఎక్కడి నుంచి వచ్చావో చూపించు" అంటూ రామూతో సంజనకు పనిష్మెంట్ ఇప్పించారు నాగ్. ఆ తర్వాత నాలుగో వారం మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన కల్యాణ్​ను అభినందిస్తూ అతనికి సిల్వర్ ఇచ్చారు. ఆపై "భుజాలపై ఎక్కువ బాండింగ్ బరువు వేసుకుంటున్నావు. ఒరిజినల్ భరణి కావాలి" అంటూ భరణికి కూడా సిల్వర్ ఇచ్చారు కింగ్ నాగ్.

సంజనకు తగిన పనిష్మెంట్..

నాలుగో వారం ఎగ్స్ దొంగతనం, తన నోటి దురుసుతనంతో రెచ్చిపోయిన సంజనకు తగిన పనిష్మెంటే ఇచ్చారు నాగ్. "నోటి దగ్గరున్న ఫుడ్ ను లాక్కుంటోంది, శాడిజం, సైకోయిజం" చూపిస్తున్న కారణాలను ఎత్తిచూపుతూ.. సంజన మెడలో "దొంగలున్నారు జాగ్రత్త" అనే బోర్డును వేయించి, సిల్వర్ స్టార్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున.

లాస్ట్ మినిట్​లో సడన్ ట్విస్ట్..

ఇక మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు హరిత హరీష్, ఫ్లోరా సైనీలకు బ్లాక్స్ స్టార్స్ ఇచ్చారు. "షాడో" అవుతున్నావు అంటూ ఫ్లోరాకు తన పెర్ఫామెన్స్ గురించి కొన్ని సూచనలు చేశారు. "వచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లేదు.. అంచనాలకు రీచ్ అవ్వలేదు" అంటూ మాస్క్ మెన్ హరీష్​కు తన ఆటతీరును గుర్తు చేశారు హోస్ట్ నాగార్జున. అనంతరం బ్లాక్ స్టార్ వచ్చిన హరీష్ - ఫ్లోరా సైనీలలో హౌస్​లో అవసరం లేని వ్యక్తి ఎవరో చెప్పాలంటూ హౌస్ మేట్స్ చేతిలోనే డెసిషన్​ను పెట్టారు. అప్పుడు వీళ్లిద్దరిలో ఎవరు పూర్ అంటే ఇంటి సభ్యుల్లో మెజార్టీ మెంబర్స్ ఫ్లోరా వైపు మొగ్గు చూపించారు. దాంతో ఫ్లోరాని వచ్చే రెండు వారాలకు నేరుగా నామినేట్ చేశారు హోస్ట్ నాగార్జున. దాంతో ఎపిసోడ్ ముగిసింది.

Bigg Boss Telugu Dammu Srija: లక్షల జీతం వదిలి బిగ్​బాస్​కు - ఎవరీ "దమ్ము శ్రీజ"!

Bigg Boss Telugu 9 Day 26 Episode : కల్యాణ్ ప్రభాస్, డీమన్ కట్టప్ప! - నాలుగో కెప్టెన్​గా రాము - ఇమ్మూ ఎమోషనల్​!