Bigg Boss 9 Telugu Today Promo: డ్యాన్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన సుమన్ శెట్టి - ఇంటికి వెళ్లిపోతానంటూ సంజనా ఏడుపు!
-బొక్కలో దూరే టాస్క్ పెట్టిన బిగ్‌బాస్, ఆడలేనంటూ సంజనా క్రై - రేసు నుంచి సంజనా టీమ్ అవుట్!

Published : October 9, 2025 at 5:11 PM IST
Bigg Boss 9 Telugu Today Promo: బిగ్‌బాస్ హౌజ్‌లో ఫిజికల్ టాస్కులు గట్టిగానే జరుగుతున్నాయి. డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు కెప్టెన్ రామూ, ఇమ్మాన్యుయేల్ మినహా మిగిలిన కంటెస్టెంట్లు చాలానే కష్టపడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి లీడర్ బోర్డ్‌లో టాప్ 1లో నిలిచింది రీతూ-డీమాన్ జోడీ. ఆ తర్వాత భరణి-దివ్య, ఫ్లోరా-సంజనా జోడి సేమ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో తనూజ-కల్యాణ్, సుమన్-శ్రీజ ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్‌లో మరో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఏముందో చూద్దాం.
"ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది. అయితే ఎంటర్‌టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్కులో గెలవడం కూడా అంతే ముఖ్యం. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి. ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా బయటికొస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారు" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
ఇక సాంగ్ మొదలవగానే సుమన్ శెట్టి అద్దిరిపోయేలా స్టెప్పులేశాడు. మిగిలిన అమ్మాయిలతో కలిసి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ చూసి అందరూ తెగ నవ్వుకున్నారు. ఇంతలో మ్యూజిక్ స్టాప్ చేసి ఆరెంజ్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అందరికంటే ముందు దివ్య ఆ హోల్లో దూరింది. వెనకాల నుంచి మిగిలిన వాళ్లు లాగినా సరే బయటపడి గెలిచింది.
తనూజ-దివ్య గొడవ: మరో రౌండ్‌లో కల్యాణ్ ముందుగా హోల్‌లోకి దూరి బయటికి వస్తుండగా వెనకాల నుంచి భరణి కాలు పట్టుకొని లాగబోయాడు. దీంతో భరణిపైన అరిచింది తనూజ. ఇది చూసి భరణి పార్టనర్ అయిన దివ్య ఫైర్ అయింది. ఇలా తనూజ-దివ్య మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ప్రోమో చివరిలో సంజన ఎమోషనల్ అయింది. "ఇలా ఉంటే నేను ఇంటికి వెళ్లిపోతాను. నాకు ఇంత ఫిజికల్ టాస్క్ అవ్వదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ కలర్ హోల్ టాస్కులో కల్యాణ్-తనూజ మొదటి స్థానం సాధించినట్లు సమాచారం.
రెండో ప్రోమోలో సంజనా టీమ్ అవుట్: కలర్ హోల్ టాస్క్ జరిగిన తర్వాత లీడర్ బోర్డ్‌లో భరణి-దివ్య టీమ్ 260 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత డీమాన్-రీతూ టీమ్ 250 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తనూజ-కల్యాణ్ టీమ్ 210 పాయింట్లతో మూడో స్థానంలో, సంజన-ఫ్లోరా టీమ్ 180తో నాలుగో స్థానంలో, శ్రీజ-సుమన్ జోడీ 130 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచారు.
దీంతో మొదటి స్థానంలో ఉన్న భరణి-దివ్య జోడీకి బిగ్‌బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు. "మొదటి స్థానంలో ఉన్న భరణి-దివ్యకి నేను ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించి బాటమ్ టూ జంటలైన సంజన ఫ్లోరా, శ్రీజ-సుమన్‌లో నుంచి వారు సాధించిన పాయింట్లతో సంబంధం లేకుండా మీ కారణాలతో ఆ జంటని ఎంపిక చేసి ఈ రేసు నుంచి తొలగించండి" అంటూ చెప్పి షాకిచ్చాడు.
దీంతో దివ్య-భరణి తెలివిగా ఆలోచించి సంజన-ఫ్లోరా టీమ్‌ని రేస్ నుంచి తప్పించారు. "ప్రతి టాస్క్ పెర్ఫామెన్స్ కూడా లెక్కేశాం. జరగబోయే టాస్కుల్లో మా సేఫ్టీ గురించి కూడా మేము ఆలోచించాం. ఇవన్నీ ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది" అంటూ భరణి అన్నాడు. "సంజన-ఫ్లోరా గారి టీమ్‌ని తీసేద్దామనుకుంటున్నాం. కొంచెం కాంపిటేషన్ తగ్గించుకోవాలనే ఒక ఐడియా తప్ప ఇంకేం లేదు. అందుకే మీ టీమ్‌ని తీద్దామనుకుంటున్నాం" అని దివ్య చెప్పింది.
తమని తీసేయడంతో సంజన హర్ట్ అయింది. "ఈ డెసిషన్ చాలా అన్యాయం. ఇలాంటిది మాకు రావాల్సింది కాదు. ఎంత కష్టపడినా ఇక్కడ ఆ కష్టానికి అర్థమే లేదు, సపోర్ట్ కూడా లేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది పైకి పోతుందో అది కిందకి వస్తుంది. కింద ఉన్నది పైకి వస్తుంది. మళ్లీ ఫైట్ చేస్తాను నేను గివప్ ఇవ్వను బిగ్‌బాస్" అంటూ సంజన ఎమోషనల్ అయింది. దీంతో ప్రోమో ఎండ్ అయ్యింది.

