ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: మిడ్​ వీక్​ ఎవిక్షన్​​ - సంజనాను ఎలిమినేట్​ చేసిన బిగ్​బాస్​ - ప్రోమో అదుర్స్​!

-బిగ్‌బాస్ 9లో అదిరిపోయే ట్విస్ట్ -మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిన బిగ్‌బాస్

Bigg Boss 9 Telugu Mid Week Eviction
Bigg Boss 9 Telugu Mid Week Eviction (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 26, 2025 at 4:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Mid Week Eviction : బిగ్​బాస్​ సీజన్​ 9 రంజుగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్​కు సంబంధించి రెండు ఎవిక్షన్​లు జరిగాయి. మూడో వారం ఎలిమినేషన్​కు సమయం దగ్గరపడింది. అయితే మూడో వారం నామినేషన్స్​ తర్వాత సోషల్​ మీడియాలో డబుల్​ ఎలిమినేషన్​ అంటూ వైరల్​ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్​ రిలీజ్​ చేశారు బిగ్​బాస్​ టీమ్​. ఇందులో భాగంగానే హౌజ్​మేట్స్​ నిర్ణయం ఆధారంగా సంజనాను ఎలిమినేట్​ చేశారు. అసలు ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

అనుకున్నట్లే జరిగింది: బిగ్​బాస్​ ప్రతి సీజన్​లో డబుల్​ ఎలిమినేషన్​ అనేది కామన్​. ఒకరిని శనివారం, ఒకరిని ఆదివారం ఎలిమినేట్​ చేస్తుంటారు. లేదంటే మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ ఉంటుంది. తాజాగా సీజన్​9లో కూడా మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ ప్లాన్​ చేశారు బిగ్​బాస్​. హౌజ్​మేట్స్​ అందరూ నిద్రలో ఉన్నప్పుడు సైరన్​ మోగించిన బిగ్​బాస్​ దిమ్మతిరిగే ట్విస్ట్​ ఇచ్చాడు. అదేంటంటే ఇటీవల ఎపిసోడ్స్​లో కంటెస్టెంట్లకు యాపిల్​ పండ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో బ్లూ, బ్లాక్​, రెడ్​ ఇలా మూడు కలర్ల సీడ్స్​ వచ్చాయి. ఇప్పటికే బ్లూ కలర్​ సీడ్​ వచ్చిన వారికి ఫ్యామిలీ నుంచి వచ్చిన గిఫ్ట్​లు, లెటర్స్​ అందించగా, బ్లాక్​ సీడ్​ వచ్చిన వారికి ఓ టాస్క్​ పెట్టి ఇమ్యూనిటీ అందించారు. తాజాగా నేటి ఎపిసోడ్​లో "రెడ్ సీడ్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపే అధికారాన్ని నేను ఇస్తున్నాను" అంటూ చెప్పి బిగ్‌బాస్ షాకిచ్చాడు.

ఈ మాట చెప్పగానే హౌజ్​మేట్స్ ముఖాలు మాడిపోయాయి. ఇక రెడ్ సీడ్ పొందిన హరీష్, భరణి, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, రాము రాథోడ్ లోపలికి వెళ్లి ఎవరిని బయటికి పంపాలా అనే చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీష్ మాట్లాడుతూ.." నాకు సంజన గారు. ఈ షో దొంగల షో. దొంగతనాల షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సైకో ఆనందమా అది ఏం సాధించడానికి. దాని నుంచి ఔట్‌పుట్ ఏమి వస్తుంది. ఒక్కసారి కాదు ఎప్పుడూ అదే రిపీట్ చేస్తున్నారు" అంటూ హరీష్ చెప్పాడు.

ఇక "ఆవిడ రాంగ్​ లేదా ఆవిడ ఇది అని ఎవరైనా రివర్స్‌లో మాట్లాడితే ఆవిడ పర్సనల్‌గా వెళ్తారు. అది నాకు నచ్చదు" అంటు డీమాన్ కూడా సంజన పేరే చెప్పాడు. "ఆవిడకి ఎవరైతే ఫేవర్‌గా ఉంటారో వాళ్ల గురించే ఆలోచిస్తుంటారు. వాళ్ల సైడై మాట్లాడుతుంటారు. వాళ్ల గురించే ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు చేస్తారు" అంటూ రాము రాథోడ్ కూడా సంజననే సెలక్ట్ చేశాడు. దీంతో ఆ ఐదుగురు కలిసి డిసైడ్​ అయ్యి లివింగ్​ ఏరియాకు రాగానే "అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమేంటో చెప్పండి" అని బిగ్‌బాస్ అనగానే.. 'సంజన గారు' అంటూ హరీష్ చెప్పాడు.

ఈ మాటకి అందరూ స్టన్ అయిపోయారు. "క్లియర్‌గా నన్ను కార్నర్ చేస్తున్నారు. ఏదైతే అది మీ ఫైనల్ డెసిషన్ బిగ్‌బాస్" అంటూ సంజన చెప్పింది. దీంతో "సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్లండి" అంటూ బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. భరణి వెనకాల లగేజి తీసుకెళ్లగా మెయిన్ డోర్ నుంచి సంజనని పంపించేశారు. ఇక సంజన వెళ్లగానే ఇమ్మాన్యుయేల్ వెక్కివెక్కి ఏడ్చాడు. తనూజ, ఫ్లోరా కూడా బాధపడ్డారు. దీంతో ప్రోమో ఎండ్​ అయ్యింది.

సీక్రెట్​ రూమ్​కు!: అయితే నిజానికి సంజనా ఎలిమినేషన్​ ఫేక్​ అని సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఎందుకంటే ఈవారం నామినేషన్స్​లో సంజనా లేదు. అంతేకాకుండా ఫస్ట్​ వీక్​లో గుడ్డు దొంగతనం, ఆ తర్వాత కెప్టెన్సీ, ఇమ్మాన్యుయేల్​తో కలిసి కామెడీ చేయడం సహా మూడు వారాల్లో చాలానే ఎంటర్​టైన్​ చేశారు. హౌజ్​లో ఉన్న వారితో పోలిస్తే సంజనా బెటర్​ అని ఆడియన్స్​ ఫీల్​ అయ్యారు. అందుకే ఫస్ట్​ వీక్​ నామినేషన్స్​లో ఉన్నా సేవ్​ చేశారు. కాబట్టి అలాంటి సంజనాను ఎలిమినేట్​ చేయరని, సీక్రెట్​ రూమ్​కు పంపించి ఉంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే నేటి రాత్రి వరకు వెయిట్​ చేయాల్సిందే.

Bigg Boss 9 Telugu Day 18 Episode: చక్రం తిప్పిన బిగ్​బాస్​ - కంటెస్టెంట్స్​కు​ షాక్​ ఇస్తూ 'వైల్డ్​కార్డ్'​ ఎంట్రీ!

Bigg Boss 9 Demon Pavan: 'ఉద్యోగం వదిలి అథ్లెటిక్స్‌ ఆపై బిగ్​బాస్​లోకి' - ఈ కామనర్​ గురించి తెలుసా?