Bigg Boss 9 Telugu: ఆ ఇద్దరి మెడపైనే ఎలిమినేషన్ కత్తి?!
- పూరైన తొలి వారం నామినేషన్ల ప్రక్రియ - నామినేషన్స్‌లో మొత్తం 9 మంది - ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో మొదలైన చర్చ!

Published : September 11, 2025 at 10:22 AM IST
Bigg Boss 9 Telugu First Week Nominations: బిగ్‌బాస్ సీజన్ 9 లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. రెండు రోజుల పాటు సాగిన ఈ ప్రాసెస్‌లో మొత్తంగా 9 మంది నామినేట్ అయ్యారు. సెలబ్రిటీల నుంచి ఒకరు మినహాయించి మొత్తం 8 మంది నామినేట్ కాగా, కామన్ మ్యాన్‌ను నుంచి ఒక్కరు ఓటింగ్ ప్రాసెస్‌లోకి వచ్చారు. మరి అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంది? ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఈ నామినేషన్స్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
నామినేషన్ ప్రాసెస్ ఇదే: "నామినేషన్స్ గురించి మీకు నిన్న చూపించింది ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు సినిమా చూపిస్తా. ఓనర్లకి వెసులుబాటు ఇస్తున్నాను. ఈ నామినేషన్ ప్రక్రియలో కేవలం టెనెంట్స్ మాత్రమే పాల్గొంటారు. ఓనర్లు దీన్ని పర్యవేక్షించాలి. ఇద్దరు పోటీదారులు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడ ఉన్న సుత్తిని అందుకోవాలి. గెలిచిన వారు ఓడిపోయిన వారి ఫొటోని పగలగొట్టి ఒకరిని నామినేట్ చేయాలి. ఆ సుత్తిని ఓనర్లలో మీకు నచ్చిన వారికి ఇవ్వాలి. ఆ ఓనర్‌కి మీ నామినేషన్ రీజన్ ఓకే అనుకుంటే ఆమోదిస్తారు. లేకపోతే వాళ్లకి నచ్చిన మరొకరిని నామినేట్ చేసుకోవచ్చు. ఇక సుత్తి అందుకున్న ఓనర్ ఆటోమేటిక్‌గా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. అందుకోని ఓనర్ డేంజర్ జోన్‌కి వెళ్తారు" అంటూ నామినేషన్ ప్రక్రియ గురించి వివరణ ఇచ్చాడు బిగ్‌బాస్.
నామినేట్ అయిన వాళ్లు వీళ్లే: మొత్తం రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్‌లో సెలెబ్రిటీల నుంచి సంజనా గల్రానీ, రీతూ చౌదరి, శ్రష్ఠి వర్మ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, తనూజ, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్ ఉండగా, కామనర్స్ నుంచి డీమాన్ పవన్ నామినేట్ అయ్యారు. అంటే మొత్తంగా 15 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో మొదటి వారానికి సెలబ్రెటీలు, కామనర్లు కలిపి 9 మంది ఉండగా మిగిలిన ఆరుగురు(మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కల్యాణ్, సెలెబ్రిటీల నుంచి భరణి) సేఫ్ అయ్యారు.

ఓటింగ్ ప్రాసెస్ ఇదే: రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్ ముగియడంతో తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ను కాపాడుకునేందుకు ఆడియన్స్‌కు అవకాశం ఇస్తూ బిగ్‌బాస్ టీమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ వేసుకోవచ్చు. మీరు ఎవరికి అయితే ఓటు వేయాలనుకుంటున్నారో వారి ఫొటోపై క్లిక్ చేసి Done ఆప్షన్‌పై క్లిక్ చేసే మీ ఓటు కన్ఫార్మ్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా జియో హాట్‌స్టార్‌లోనే చేయాలి.
మొదలైన డిస్కషన్: ఇక నామినేషన్స్ ఇట్లా పూర్తి అయ్యాయో లేదో సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. నామినేట్ అయిన తొమ్మిది మందిలో ఎవరు ఉంటారు? ఎవరు బ్యాగ్ సర్దుకుని పోతారో అని తెగ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి నుంచి మొదలైన ఓటింగ్ ప్రకారం సీరియల్ నటి తనూజ గౌడ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మిగిలిన కంటెస్టెంట్లు ఉన్నారు.
డేంజర్లో ఇద్దరు: నార్మల్‌గా సీజన్ 9లో రెండో రోజు ఎపిసోడ్ చూసిన ఎవరికైనా నామినేషన్స్‌లోకి సంజనా వస్తే ఎలిమినేట్ అవుతుందని తెలుసు. ఎందుకంటే ఆరోజు షాంపూ గురించి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ అనుహ్యాంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి సంజనా సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం. నిజానికి బిగ్‌బాస్ అంటే కంటెంట్, గొడవలు. ప్రస్తుతానికి ఈ రెండింటిని సంజనా బ్యాలెన్స్ చేస్తుండటంతో ఆడియన్స్ కూడా ఆమె ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఇద్దరు లేడి కంటెస్టెంట్లు ఉన్నట్లు సమాచారం. వారు ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మ. అయితే ఓటింగ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో వీళ్ల ఆట ఏమైనా మెరుగుపడితే సేఫ్ అవుతారు. లేదంటే బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే.
Bigg Boss 9 Telugu Day 2 Episode: నామినేషన్స్‌లో "సుత్తి" - షాంపూ గురించి సంజనా రచ్చరచ్చ!

