ETV Bharat / entertainment

Bigg Boss 9: టీచర్​ కావాల్సిన బ్యూటీ యాక్ట్రెస్​ అయ్యింది! - ఈ బిగ్​బాస్​ కంటెస్టెంట్​ గురించి తెలుసా?

- బిగ్​బాస్​ 9వ సీజన్​లో మొదటి కంటెస్టెంట్​గా తనూజ - ఆమె బ్యాకెండ్​ స్టోరీ ఇదే!

Bigg Boss 9 Contestant Thanuja Details
Bigg Boss 9 Contestant Thanuja Details (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 11, 2025 at 3:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Contestant Thanuja Details:సెప్టెంబర్​ 7వ తేదీ ఆదివారం రోజు బుల్లితెర బిగ్గెస్ట్​ రియాలిటీ షో బిగ్​బాస్​ సీజన్​ 9 ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్​లో 9 మంది సెలెబ్రిటీలు, 6 కామనర్స్​ మొత్తంగా కలిపి 15 మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్​ చేశారు. ఇందులో మొదటి కంటెస్టెంట్​గా బిగ్​బాస్​ హౌజ్​లోకి అడుగుపెట్టింది సీరియల్​ నటి తనూజ. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఫ్యామిలీ, చదువు, సినీ ఎంట్రీ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

బెంగుళూరులో పుట్టి: బిగ్‏బాస్ సీజన్ 9లోకి మొదటి కంటెస్టెంట్​గా తనూజ ఎంట్రీ ఇచ్చింది. ఈమె పూర్తి పేరు తనూజ పుట్టస్వామి. అయితే ఈ పేరుతో కన్నా సినీ ఇండస్ట్రీలో తనూజ గౌడగా సుపరిచితమైంది. తనూజ కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పుట్టి పెరిగింది. బెంగుళూరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. అయితే ఈ అమ్మడుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

సినీ ఎంట్రీ ఇలా: కూతుర్ని టీచర్​గా చేయాలని తనూజ తండ్రి భావించగా, తను మాత్రం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాలేజీలో చదువుతున్న సమయంలోనే హీరోయిన్‌గా అవకాశం రావడంతో కన్నడ హారర్ సినిమా 6-5=2 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాల తర్వాత తెలుగులో "అందాల రాక్షసి" అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత "ముద్ద మందారం" సీరియల్​లో పార్వతి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి మరింత పాపులర్​ అయ్యింది. ఈ సీరియల్ తర్వాత "శివ మనస్సుల శక్తి" అనే సీరియల్ ద్వారా తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో కొన్ని షోలలో పాల్గొంటున్న ఈ భామ తాజాగా బిగ్​బాస్​ సీజన్​ 9లో అడుగుపెట్టింది. అయితే తండ్రికి ఇష్టం లేకపోయినా సినీ ప్రపంచంలోకి రావడంతో, ఆమెతో మూడు సంవత్సరాలు తన తండ్రి మాట్లాడలేదట.

తండ్రికి తెలియదు: బిగ్​బాస్​ స్టేజ్​ మీద అడుగుపెట్టిన సందర్భంగా "నీ గురించి 9 మాటల్లో ప్రేక్షకులకు చెప్పు" అని నాగ్‌ అడగ్గా, నేను "ఫ్యామిలీ గర్ల్‌, ఓవర్‌ థింకర్‌, సెన్సిటివ్‌, మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, బాగా వండుతా, అమాయకురాలిని, అనుకుంటే అస్సలు వదిలి పెట్టనితత్వం"అంటూ చెప్పుకొచ్చింది. తాను బిగ్‌బాస్‌ హౌజ్​లోకి వెళ్తున్నట్లు తన తల్లిదండ్రులకు తెలియదని చెప్పింది. వాళ్లు సంతోషించేలా నడుచుకుంటానని హామీ ఇచ్చింది. ప్రస్తుతం తనూజ మొదటి వీక్​ నామినేషన్స్​లో ఉంది. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం ప్రస్తుతం ఓటింగ్​లో మొదటి స్థానంలో ఉంది.

Bigg Boss 9 Telugu Day 3 Episode: హౌజ్​లో "గుడ్డు" పోయింది - వాళ్ల ముగ్గురిని ఇరికించిన సంజనా!

Bigg Boss 9 Telugu Day 3 Promo: "మీ బాడీ లాంగ్వేజ్​, మీ మాట బాలేదు" - నామినేషన్స్​లో కంటెస్టెంట్స్​ మాటల యుద్ధం!