Bigg Boss 9 Double Elimination: ఓటింగ్‌తో ఫ్లోరా - వైల్డ్‌కార్డ్స్ తో శ్రీజ ఔట్ - సోషల్ మీడియాలో ట్రోలింగ్!
-బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ విశేషాలు - అన్‌ఫెయిర్‌గా శ్రీజ దమ్ము ఎలిమినేషన్ - జర్నీ వీడియో కూడా లేకుండా!

Published : October 13, 2025 at 12:05 PM IST
Bigg Boss 9 Double Elimination: బిగ్‌బాస్ సీజన్ 9లో ఐదో వారం ఆట రసవత్తంగా సాగింది. అంతకుమించి డబుల్ ఎలిమినేషన్‌తో ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అయితే గత వారం నుంచి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నప్పటికీ.. అనుకోని కంటెస్టెంట్ బయటికి వెళ్లడంతో హౌజ్‌మేట్స్ మాత్రమే కాకుండా, ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అందుకు కారణం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కు స్పెషల్ పవర్స్ ఇవ్వడం! ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఫ్లోరా సైనీ కాగా, వైల్డ్ కార్డ్స్ నిర్ణయంతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. అసలు ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఫ్లోరా సైనీ ఎలిమినేట్: శ్రీజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సంజనా గల్రానీ డేంజర్ జోన్లో ఉండగా.. ఫ్లోరా, రీతూ ఎవిక్షన్ దగ్గరలో ఉన్నట్టు శనివారం ఎపిసోడ్‌లోనే నాగార్జున స్పష్టం చేశారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ స్టార్టింగే ఎలిమినేషన్‌తో మొదలైంది. ఇందులో భాగంగా ఎవిక్షన్ పొజిషన్లో ఫ్లోరాను, రీతూను యాక్టివిటీ ఏరియాకు పిలిపించారు. ఇక ఆ తర్వాత సంజనాను మిస్ అవుతానని కన్నీరు పెట్టుకుంది ఫ్లోరా. పవన్‌ను మిస్ అవుతాను అంటూ రీతూ కుళాయి తిప్పేసింది. ఇక ఎవరి డిస్ప్లేలో అయితే లైన్ వస్తుందో వారి లైఫ్ ఆగిపోతుందని నాగార్జున చెప్పారు. అలా చివరగా ఫ్లోరా ఎలిమినేట్ అయ్యింది.
ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన ఫ్లోరా సైనీ జర్నీ వీడియో ప్లే చేశారు. అనంతరం ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. అందులో భాగంగా సంజనా, దివ్య, ఇమ్మాన్యుయేల్, శ్రీజ దమ్ముకి థంబ్స్ అప్ సింబల్ ఇవ్వగా, భరణి, తనూజలకు థంబ్డౌన్ సింబల్ ఇచ్చింది. ఇక ఫ్లోరా ఎలిమినేషన్‌తో డేంజర్ జోన్లో ఐదుగురు మిగిలారు.
ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ: ఫ్లోరా ఎలిమినేషన్ తర్వాత వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ మొదలైంది. ముందుగా రమ్య మోక్ష, శ్రీనివాస సాయి హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని సంచాలకులుగా పెట్టి డేంజర్‌జోన్‌లో ఉన్నవారికి స్టిక్ ఇట్ విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో సంజనా గెలిచి సేవ్ అయ్యింది. దీంతో డేంజర్లో మరో నలుగురు ఉన్నారు.
మూడు, నాలుగో వైల్డ్‌కార్డ్స్‌గా హౌజ్‌లోకి దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా వీళ్లిద్దరిని సంచాలకులుగా పెట్టి డేంజర్‌జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు క్యాచ్ ది స్టిక్ టాస్క్ నిర్వహించారు. ఇందులో రీతూ గెలిచి సేవ్ అయ్యింది.
ఇక ఐదు, చివరి కంటెస్టెంట్స్‌గా ఆయేషా, గౌరవ్ గుప్తా ఎంటర్ అయ్యారు. వీళ్లను సంచాలకులుగా పెట్టి డేంజర్ జోన్లో ఉన్న డీమాన్ పవన్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజకు రెండు లెవల్స్‌లో గేమ్స్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో డీమన్ సేవ్ కాగా, దమ్ము, సుమన్ మిగిలారు.
వైల్డ్‌కార్డ్స్ చేతిలో ఎలిమినేషన్: ఇక చివరగా మిగిలిన సుమన్ శెట్టి, దమ్ము శ్రీజలో ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్‌ను వైల్డ్‌కార్డ్స్ చేతిలో పెట్టారు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే వాళ్ల ఇద్దరిలో ఎవరు ఉండకూడదనుకుంటారో వారి ముందు ఉన్న హీలియం బెలూన్స్లో ఒకటి కట్ చేయాలని చెప్పారు. ఇలా ప్రక్రియ పూర్తయ్యే సరికి నలుగురు వైల్డ్‌కార్డ్స్ శ్రీజ ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు. దీంతో శ్రీజ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో హౌజ్‌మేట్స్ మొత్తం షాక్ అయ్యారు.
జర్నీ వీడియో లేకుండానే: సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ జర్నీ వీడియోను ప్లే చేస్తుంటుంది బిగ్‌బాస్ టీమ్. కానీ శ్రీజ దమ్మును అప్పటికప్పుడు ఎలిమినేట్ చేయడంతో ఆమె వీడియో లేకుండా పోయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన శ్రీజ.. డిమోన్ ఫ్రెండ్, భరణి ఎనిమీ, కళ్యాణ్ ట్రస్ట్, సంజన రియల్, సుమన్ శెట్టి వీక్, దివ్య ఫేక్, ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్, రీతూ - తనూజ - రామూ గుడ్ అని చెప్పింది.
సోషల్ మీడియాలో ట్రోల్స్: ఇక శ్రీజ ఎలిమినేషన్ విషయంలో బిగ్‌బాస్ టీమ్‌పై ఆడియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్‌కార్డ్స్ ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మా ఓట్స్‌కు వ్యాల్యూ లేదా?" అని కామెంట్లు పెడుతున్నారు.

