ETV Bharat / entertainment

Bigg boss 9 Day 16 : రాధిక చేతిని వదిలేసిన టిల్లూ! - అదే నిజమైతే పవన్ గేమ్​కు ఫిదా అవ్వాల్సిందే!

- స్ట్రాటజీ మామూలుగా లేదుగా! - బిగ్ బాస్​ లో అసలైన బ్యూటీ ఇదే అంటున్న ఎక్స్​పర్ట్స్​!!

Demon Pavan and Reethu chowdary Love Story
Demon Pavan and Reethu chowdary Love Story (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 24, 2025 at 11:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

Demon Pavan and Reethu chowdary Love Story : మెగాస్టార్ అంజి మూవీలో క్లైమాక్స్​లో ఒక సీన్. అమృతం తేవడానికి బయల్దేరిన హీరోకి ప్రమాదకరమైన వింత ప్రదేశం ఎదురవుతుంది. పైకి మామూలుగా కనిపించిన ఆ ప్రాంతంలో అడుగు ముందుకు వేయగానే లోయ తెరుచుకుంటుంది. అప్పుడు అతని మదిలో "పెద్దయ్య" చెప్పిన మాట ప్రతిధ్వనిస్తుంది. "కంటికి కనిపించేదంతా నిజం కాదు. మనో నేత్రంతో చూస్తేనే అసలైన దారి కనిపిస్తుంది" అని!!

బిగ్ బాస్​ షోకు ఈ మాట అక్షరాలా అప్లై అవుతుంది. నూటికి నూరుకాదు.. నూటొక్క పాలూ వర్తిస్తుంది. అవును.. బిగ్ బాస్​ ఒక మైండ్ గేమ్. ఇందులో అడుగు పెట్టిన కంటిస్టెంట్లు ఎవరి స్ట్రాటజీతో వారు గేమ్ ప్లే చేస్తుంటారు. "కిక్​"లో హల్వా చెప్పినట్టు ఇక్కడ ఎవరికి వారు గేమ్ స్టార్ట్ చేశామని అనుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరూ అవతలి వారి గేమ్​లో ప్లేయర్సే! ఎవరికి వారు తానే రింగ్ మాస్టర్ అనుకుంటారు. కానీ, బెత్తం ఎవరి చేతులోంచి ఎప్పుడు జారిపోతుందో.. ఎవరికి చేరుతుందో అర్థం కాదు. రీతూ చౌదరి, డీమన్ పవన్​ గేమ్​కు ఈ ఈక్వేషన్​ అప్లై చేస్తే మరింత క్లారిటీగా అర్థమవుతుంది.

"బటర్ ఫ్లై ఎఫెక్ట్" అంటే ఏంటి? - బిగ్​ బాస్​కూ, NTR సినిమాకు లింకేంటి?

"ఒక రాధిక - ఇద్దరు టిల్లూస్" అన్నట్టుగా బిగ్​ బాస్ హౌస్​లో ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ - రీతూ - పడాల - డీమన్ పవన్ మధ్య లవ్ ట్రాక్ నడమవడమే కాదు, పరిగెడుతోందనే గుసగుసలు "కనిపిస్తున్నాయి". డీమన్ పవన్​ కు కెప్టెన్సీ అప్పగించడం కోసం రీతూ దాటిన బారీకేడ్స్ అన్నీ ఈ విషయాన్ని ఓపెన్​ గా మాట్లాడుకునేలా చేశాయి. దీంతో రీతూపై ట్రోలింగ్​ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. సంచాలక్‌గా ఫెయిల్​ అంటూ, ఫేవరిజం చూపించిందంటూ ఎటాక్ జరిగింది.

ఇక్కడే ట్విస్టు :

పవన్ విషయంలో రీతూ వన్​ సైడ్​ తీసుకున్నందుకు శిక్షగా ఆమె నామినేషన్స్​లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, నామినేట్ అయిన వాళ్లలో ఒకరిని సేవ్​ చేసే అవకాశం కెప్టెన్​గా ఉన్న పవన్​కు ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో.. అతను రీతూ రుణం తీర్చేసుకుంటాడని, రెండు చేతులతో సేవ్​ చేసి పక్కన నిలబెట్టుకుంటాడని మాగ్జిమమ్ అందరూ అనుకున్నారు. కానీ, పవన్ మాత్రం ఆమెను అక్కడే వదిలేసి శ్రీజ చేయి అందుకున్నాడు!

Bigg Boss 9 Telugu : ముగిసిన 'థర్డ్ వీక్' నామినేషన్స్ - ఈ వారం 'ఎలిమినేషన్'​ లిస్ట్​లో ఉన్నది వీళ్లే!

హార్ట్ బ్రేక్ :

దీంతో చాలా మంది షాక్ అయిపోగా, గుండెలు బాదుకోవడం రీతూ పని అయ్యింది! "హార్ట్ బ్రేక్ అయ్యింది" అనేసింది. పవన్ ఇలా ఎందుకు చేశాడు? అంటే.. రీతూకు అంటుకున్న "ఫేవరిజం" బురద తనమీద చిల్లకుండా జాగ్రత్త పడ్డాడు అన్నదే వాస్తవం(?) ఇది కాకుండా రీతూను సేవ్​ చేయకపోవడానికి పవన్​ కు పెద్ద కారణాలేవీ కనిపించట్లేదన్నది నెటిజన్ల మాట. బిగ్​ బాస్​ షో మైండ్​ గేమ్​ అనేది ఇందుకే అని, చాలా రోజుల తర్వాత పవన్​ సూపర్​ గేమ్​ ఆడాడు అని "స్మార్ట్​ పీపుల్​" అంటున్నారు.

రీతూ కూడా మొదలు పెట్టిందా?

అయితే, ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి పోయిన తీరు మరింత ఇంట్రస్టింగ్​ గా తయారైంది. ఈ వారం ఎవరు వెళ్లిపోతారని పవన్ అన్నప్పుడు.. "నేనే" అన్నది రాధిక. "లేదు లేదు నువ్వు స్ట్రాంగ్ కంటిస్టెంట్​" అంటూ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు టిల్లూ. తర్వాత ఇద్దరూ హగ్స్​ చేసుకున్నారు, తిండి తినిపించుకున్నారు. ఇదంతా చూసిన వాళ్లు.. రీతూ కూడా రివర్స్ గేమ్​ స్టార్ట్ చేసిందని అంటున్నారు. ఇది నిజంగా వీళ్లిద్దరు ఆడుతున్న ఆటేనా? లేకపోతే బిగ్​ బాస్​ నిర్వాహకుల స్ట్రాటజీనా?? అని అనుమానించే వాళ్లు కూడా ఉన్నప్పటికీ, ఈ షోలో అసలైన బ్యూటీ మాత్రం ఈ మైండ్​ గేమే అన్నది ఎక్స్​ పర్ట్స్ మాట!

Bigg Boss 9 Telugu Wild Cards: 'వైల్డ్​కార్డ్స్'​ లోడింగ్​ - ఆరోజే డోర్స్​ ఓపెన్​!