Bigg Boss 9 Telugu Day 7 Episode: శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ - సుమన్ శెట్టిపై బిగ్‌బాంబ్!
- మనీష్, ప్రియాకి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున - పర్మనెంట్ హౌజ్ ఓనర్ అతనే!

Published : September 15, 2025 at 9:27 AM IST
Bigg Boss 9 Telugu Day 7 Episode: బిగ్‌బాస్ సీజన్ - 9లో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రకారమే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌజ్ నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే వెళ్తూవెళ్తూ ముగ్గురిని ఫేక్, నలుగురు జెన్యూన్ అంటూ వాళ్లుఎవరో చెప్పింది. అంతేకాకుండా కామనర్లు కాకుండా టెనెంట్స్‌ను నుంచి ఒకరు పర్మినెంట్ ఓనర్ అయ్యారు. వారెవరు? శ్రష్ఠి వర్మ ఎలిమినేషన్లో ఏం జరిగింది? సహా అసలు సండే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం.
మనీష్, ప్రియాకు వార్నింగ్: "నీలాంబరి నీలాంబరి" సాంగ్‌తో ఫుల్ జోష్‌లో ఎంట్రీ ఇచ్చారు నాగ్. శనివారం రోజు కొన్ని బాక్సులు ఓపెన్ చేసి హౌజ్‌మేట్స్‌కు వార్నింగ్‌లు, సలహాలు ఇచ్చిన కింగ్, ఆదివారం రోజు కూడా ఆ ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలోనే తనూజను లేపి ఓ బాక్స్ సెలెక్ట్ చేసుకోమనగా, అది ఎంప్టీ బాక్స్ వచ్చింది. అంటే హౌజ్‌లో ఉన్నవారు ఎవరైనా తమ సమస్యలను ఓపెన్ చెప్పొచ్చు అంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో తనూజ ఏమీ లేవని చెప్పగా, శ్రష్ఠి వర్మ మాత్రం ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి అంటూ చెప్పింది. ఈ క్రమంలోనే " ఓనర్లలో ఈక్వాలిటీ చూపించని వ్యక్తి ఎవరు" అని అడిగితే మనీష్ పేరు చెప్పింది శ్రష్టి. "మనీష్ గారిని ఒక యాపిల్ కావాలని అడిగాను. అందుకు నా మెడికల్ కండీషన్ కూడా వివరించాను. దీంతో డిస్కస్ చేసి చెప్తాను అని అన్నారు. కానీ ఏం రిప్లయ్ ఇవ్వలేదు" అంటూ శ్రష్టి చెప్పింది.
దీంతో ఏంటి మనీష్ విషయం అని నాగార్జున అడిగారు. ఈ క్రమంలోనే ఆరోజు మా రూమ్‌లో డిస్కషన్ ఏమైందంటే ఏ ఫ్రూట్స్ బయటికి వెళ్లవు అని" అంటూ మనీష్ చెప్పగా, "మరి రెండు అరటి పండ్లు బయటికి ఎలా వెళ్లాయి" అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో "ఆ టూ బనానాస్ ఇచ్చింది మేమే. రాముకే ఇచ్చాము" అంటూ ప్రియా లేచి ఆన్సర్ ఇచ్చింది. మరి శ్రష్టికి ఎందుకు ఇవ్వలేదు అని నాగ్ అడిగితే తను నాకు రిమైండ్ చేయలేదో అంటూ ప్రియ చెప్పింది. "మనీష్ మరి డిస్కస్ చేశానని చెప్తున్నాడు. అసలు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఈ రూల్? మతిమరుపునకు ఏమైనా మందు ఉంటే వేసుకో" అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు.
కెప్టెన్ మాట వినాల్సిందే: ఇక హౌజ్ కెప్టెన్ సంజన లేచి తన కంప్లెయింట్స్ చెప్పింది. "నేను మాట్లాడితే జస్ట్ టెంపరెరీ ఓనర్‌ని అంటారు. కాబట్టి నాకు ఈ విషయం తెలియాలి. కెప్టెన్ కంటే మానిటర్స్ ఎక్కువా?" అని అడిగితే, అందరూ కెప్టెన్ మాట వినాల్సిందే అంటూ నాగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇక సండే కావడంతో మిరాయ్ మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితికా నాయక్ ఇద్దరితో కలిసి హౌజ్‌మేట్స్ కాసేపు సరదాగా గేమ్ ఆడారు.
పర్మినెంట్ ఓనర్‌గా భరణి: శనివారం చెప్పినట్లుగానే టెనెంట్స్లోని ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సెలెబ్రిటీలను రెండు టీమ్‌లుగా(బ్లూ, రెడ్) డివైడ్ చేశారు. రెడ్ టీమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్ఠి వర్మ ఉండగా, బ్లూ టీమ్‌లో ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజనా ఉన్నారు. ఇక రెండు గ్రూపులలో లేని ఫ్లోరా సైనీ సంచాలక్‌గా వ్యవహరించారు.
ఈ టాస్కులో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా యాక్టివిటీ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్టు నుంచి వచ్చే పేపర్స్ తీసుకొని వాటిపై స్టాంప్ ప్యాడ్‌తో స్పష్టంగా స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఇక ఈ టాస్క్ మొదలుకాగానే రెండు టీమ్‌లు హోరాహోరీగా పోరాడాయి. ఇక ఈ టాస్కుకి సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్ని స్టేజ్ మీదకి తెప్పించారు నాగార్జున. ఒక్కో బాక్సులో ఒక్కో పేపర్‌ని తీసి కౌంట్ చేశారు. ఇందులో చిరిగిపోయిన పేపర్లని పక్కన పెట్టేశారు. సరిగ్గా స్టాంప్ వేసి చిరగకుండ ఉన్న పేపర్లు మాత్రమే కౌంట్ చేశారు.
అలా బ్లూ టీమ్ బ్యాలెట్ బాక్సులో 7 పేపర్లు, రెడ్ టీమ్ బ్యాలెట్ బాక్సులో 11 పేపర్లు ఉన్నాయి. దీంతో రెడ్ టీమ్ విన్ అయింది. గెలిచిన రెడ్ టీమ్ నుంచి ఓనర్ అయ్యే అవకాశం ఎవరికి ఇవ్వాలనేది మాత్రం తిరిగి సంచాలక్, బ్లూ టీమ్ చేతిలో పెట్టారు నాగార్జున. దీంతో శ్రష్ఠి వర్మకు సంచాలక్‌గా ఉన్న ఫ్లోరా సైనీ ఓటు వేస్తే, బ్లూ టీమ్ మొత్తం భరణికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో భరణి మెయిన్ హౌజ్‌కు ఓనర్ అయ్యాడు. ఈ క్రమంలోనే భరిణికి అసిస్టెంట్‌ను ఎన్నుకునే ఆఫర్ ఇచ్చారు నాగార్జున. దీంతో తన టీమ్‌లోని తనూజను అసిస్టెంట్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు భరణి. అంటే సోమవారం నుంచి భరణి, తనూజ ఇంట్లోకి ఓనర్లుగా అడుగుపెట్టనున్నారు.
ఎలిమినేషన్ ప్రక్రియ: మొదటి వారం తొమ్మిది మంది నామినేట్ కాగా శనివారం ఎపిసోడ్లో తనూజను సేవ చేసిన నాగ్, ఆదివారం రోజు రాము రాథోడ్, సంజనా, ఇమ్మాన్యుయేల్, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టిని సేవ్ చేశారు. చివరిగా మిగిలిన శ్రష్ఠి వర్మ, డీమన్ పవన్ ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. అక్కడ డ్యాన్సర్లు వచ్చింది కొద్దిసేపు డ్యాన్స్ చేసి సేవ్ అయ్యింది ఎవరో అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో డ్యాన్సర్లు తనను బయటికి తీసుకొచ్చారు. ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోని చూపించారు నాగ్. ఇక వెళ్లే ముందు హౌజ్‌లో నలుగురు జెన్యూన్, నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్లెవరో చెప్పాలని నాగ్ అన్నారు.
ముందుగా జెన్యూన్ లిస్ట్‌లో రాము రాథోడ్ పేరు చెప్పింది శ్రష్టి. ఆ తర్వాత మర్యాద మనీష్, హరిత హరీష్ పేర్లు చెప్పింది. చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది, తను చాలా మంచి సోల్ అంటూ చెప్పింది. ఇక కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతూ చౌదరి పేరు చెప్పింది శ్రష్ఠి. తర్వాత తనూజ, భరణి పేరు చెప్పింది. ఈ క్రమంలో శ్రష్టి కాస్త ఎమోషనల్ అయ్యింది.
బిగ్‌బాంబ్ ఆఫర్: ఇక చివరిగా వెళ్లేటప్పుడు శ్రష్ఠికి ఆఫర్ ఇచ్చారు నాగ్. "నువ్వు వెళ్తూ వెళ్తూ హౌజ్‌లో ఒకరిపై బింగ్ బాంబ్ వేయాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పటివరకూ చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాలి" అని నాగ్ అన్నారు. దీంతో టెనెంట్స్‌లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది శ్రష్టి. సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా ఆయన చేస్తారు అంటూ వెల్లడించింది. దీంతో ఎపిసోడ్ పూర్తైంది.
Bigg Boss 9 Telugu: "గుండు అంకుల్ అంటే తప్పు, రెడ్ ఫ్లవర్ తప్పు కాదా?" - ఫుల్ఫైర్లో నాగ్!
Bigg Boss 9 Kalyan Padala: ఆర్మీ నుంచి బిగ్‌బాస్‌కు! - ఈ కంటెస్టెంట్ గురించి తెలుసా?

