ETV Bharat / entertainment

Bigg Boss 9 Sunday Promos : వెక్కివెక్కి ఏడ్చిన "ప్రేమ పక్షులు" - ఎంట్రీతో అదరగొట్టిన వైల్డ్​కార్డ్స్​ - ఆ "ఇద్దరూ" ఔట్!

- సండే ఎపిసోడ్​లో ఆడియన్స్​కు కిక్కిచ్చే జోష్ - వైల్డ్​కార్డ్స్ ఎంట్రీ, డబుల్ ఎలిమినేషన్​తో హీటెక్కిన 'బిగ్​బాస్'!

Bigg Boss 9 Sunday Promos
Bigg Boss 9 Sunday Promos (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2025 at 4:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Sunday Promos : బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో వారం సండే ఎపిసోడ్ ఆడియన్స్​కు మంచి మజాను పంచనుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీలతో మోత మోగిపోనుంది. ఈ క్రమంలోనే సండే ఎపిసోడ్​ డే-35కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. మొదటి ప్రోమోలో రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ మధ్య ఎలిమినేషన్ రౌండ్ చూపించారు. ఈ క్రమంలోనే రీతూ, డిమోన్ పవన్​ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. సెకండ్ ప్రోమోలో వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీని చూపించారు. మరి, ఆ ప్రోమోల్లో ఏముందో ఇప్పుడు చూసేద్దాం.

ఫస్ట్ ప్రోమో ఇలా :

ప్రోమో స్టార్టింగ్​లో బిగ్​బాస్ సీజన్ -9లో కొత్త ఛాప్టర్ మొదలుకాబోతోంది అంటూ కింగ్ నాగార్జున తనదైన లుక్​తో అదరగొట్టేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సభ్యులందరికీ లవ్ సింబల్ చూపిస్తూ హాయ్ చెప్పిన హోస్ట్ నాగార్జున.. ఎవిక్షన్ జోన్​లో ఉన్న రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ ఇద్దరూ యాక్టివిటీ రూమ్​కి వచ్చేయండని చెప్పారు. తర్వాత డియర్ హౌస్​మేట్స్​ ఆ ఇద్దరిలో ఎవరు వెళ్తున్నారో మీ అంచనా ఏంటి? అంటూ అందరి అభిప్రాయమూ చెప్పమన్నారు నాగ్.

అప్పుడు ఇమ్మాన్యుయేల్ లేచి గత​ ఐదు వారాల నుంచి వాళ్లిద్దరిలో కాలిక్యులేట్ చేస్తే ఫ్లోరా సైనీ వెళ్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. తర్వాత దివ్య లేచి టాస్క్​లో దేంట్లో అయినా కూడా ఓవరాల్ గేమ్​లో ఈ ఇద్దరిలో రీతూ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టిందని చెప్పింది. వీరి తర్వాత కల్యాణ్ వారిద్దరిలో కంపేర్ చేస్తే రీతూయే స్ట్రాంగ్ సార్ అంటూ తన అభిప్రాయం తెలియజేశారు. అంటే ఫ్లోరా వెళ్లిపోవాలంటావ్ అని నాగార్జున అడిగితే అవును సార్ అంటూ తలాడించాడు కల్యాణ్.

ఏడ్చేసిన ఫ్లోరా..

హౌస్​మేట్స్ అభిప్రాయం తెలుసుకున్నాక హోస్ట్ నాగార్జున.. యాక్టివిటీ రూమ్​లో ఉన్న రీతూ, ఫ్లోరాతో ఇలా అన్నారు. మీరు ఈ హౌస్​లో ఎవరిని బాగా మిస్ చేస్తారో వాళ్లకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ వారిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ముందుగా ఫ్లోరా సైనీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "ముఖ్యంగా నేను సంజన గారికి థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే నేను ఎప్పుడూ ఏడ్చినా హౌస్ మొత్తంలో ముందుగా సంజన గారికే తెలుస్తుందన్నారు. తను మాత్రమే నన్ను ఓదార్చడానికి వస్తారంటూ.. ఏడుస్తూ ఫ్లోరా చాలా ఎమోషనల్ అయింది.

Bigg Boss 9 Weekend Episode : ఇమ్మూకు 'పవర్ అస్త్ర' - తనూజ కళ్లు తెరిపించిన నాగ్ - డబుల్ ఎలిమినేషన్​లో వీరు ఔట్!

కన్నీళ్లు పెట్టిన ప్రేమ పక్షులు..

రీతూ ఏడుపుతోనే స్టార్ట్ చేసింది. "పవన్ ఐ మిస్​ యూ సో మచ్.. ఒకవేళ బయటకు వెళ్తే నిన్ను చాలా అంటే చాలా మిస్ అవుతాను. నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు.. ఐ మిస్ యూ.. అని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక రీతూ మాటలు వింటూ ఉన్న డిమోన్ పవన్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. ఇలా బిగ్​ బాస్​ హౌస్ లో​ ప్రేమ పక్షుకులుగా ఉన్న ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

ఆడియన్స్ డిసైడ్ చేస్తారు..

ఇక మీ ఉద్దేశం ఎలా ఉన్నా.. ఆడియన్స్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం అని నాగార్జున అన్నారు. బిగ్ బాస్ ఎవిక్షన్ టైమ్ స్టార్ అన్నడంతో ఇద్దరి బోర్డ్స్​పై గ్రీన్ కలర్​లో లైఫ్​లైన్ ​రన్ అవుతుంది. ఇందులో ఎవరి లైఫ్‌లైన్ పోతుందో బిగ్‌బాస్ నిర్ణయిస్తారు.. కేవలం ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగానే ఈ ఎలిమినేషన్ జరుగుతుంది.. అంటూ నాగార్జున చెప్పారు. అయితే, ఇందులో ఫ్లోరా లైఫ్ లైన్ ఆగిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అంతటితో ఈ ప్రోమో ఎండ్ అయింది.

సెకండ్ ప్రోమోలో ఏం ఉందంటే?

వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ చాలా వైల్డ్​గా ఉంటుందని అని కింగ్ నాగార్జున చెబుతారు. దానికి తగ్గట్లుగానే హౌస్​లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో సాంగ్​కి స్టెప్పులేస్తూ అద్దిరిపోయే ఎంట్రీ ఇస్తారు. అలాగే, కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చ సుదీప్, మలయాళీ బిగ్ బాస్ హోస్ట్ మోహన్ లాల్, తమిళ్ బిగ్ బాస్​ హోస్ట్ విజయ్ సేతుపతి వీడియో కాన్ఫరెన్స్​లో జాయిన్ అయ్యి కాసేపు ఆడియన్స్​ను అలరించారు.

డబుల్ ఎలిమినేషన్?

ముందు నుంచీ ప్రచారంలో ఉన్నట్టుగానే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ దాదాపుగా కన్ఫామ్​ అనే మాట వినిపిస్తోంది. ఓటింగ్ ఆధారంగా ఫస్ట్ ఎలిమినేటర్​గా ఫ్లోరా వెళ్లిపోనుండగా.. వైల్డ్ కార్డ్స్ కారణంగా దమ్ము శ్రీజ రెండో ఎలిమినేటర్​ కానున్నట్టు సమాచారం. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

Bigg Boss 9 Telugu: ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్​​ - ఆ ఇద్దరే ఔట్?

Bigg Boss 9 Telugu Wild Cards: రణరంగం 2.0 లోడింగ్​ - వైల్డ్​కార్డ్స్​ వీళ్లేనట! - బిగ్​బాస్​ ప్లానింగ్​ అదుర్స్​!