Bigg Boss 9 Telugu Day 3 Promo: "మీ బాడీ లాంగ్వేజ్, మీ మాట బాలేదు" - నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ మాటల యుద్ధం!
-హీట్‌హీట్‌గా నామినేషన్లు - తనూజను టార్గెట్ చేసిన కామనర్లు - నేటి ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్!

Published : September 10, 2025 at 5:20 PM IST
Bigg Boss 9 Telugu Day 3 Promo: బిగ్‌బాస్‌లో మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. "ఇద్దరు పోటీదారులు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడ ఉన్న సుత్తిని అందుకోవాలి. గెలిచిన వారు ఓడిపోయిన వారి ఫొటోను పగలగొట్టి ఒకరిని నామినేట్ చేయాలి. ఆ సుత్తిని ఓనర్లలో మీకు నచ్చిన వారికి ఇవ్వాలి. ఆ ఓనర్‌కి మీ నామినేషన్ రీజన్ ఓకే అనుకుంటే ఆమోదిస్తారు. లేకపోతే వాళ్లకి నచ్చిన మరొకరిని నామినేట్ చేసుకోవచ్చు. ఇక సుత్తి అందుకున్న ఓనర్ ఆటోమేటిక్‌గా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు" అని అంతకుముందే(Bigg Boss 9 Telugu Day 2 Episode) బిగ్‌బాస్ అనౌన్స్ చేశారు. తాజాగా మిగతా కంటెస్టెంట్ల నామినేషన్స్‌కు సంబంధించిన రెండు ప్రోమోలు బిగ్‌బాస్ టీమ్ రిలీజ్ చేసింది. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.
మొదటి ప్రోమోలో ఏముందంటే: ఈరోజు నామినేషన్స్‌కు సంబంధించిన సుత్తి అందుకోవడానికి భరణి-ఇమ్మాన్యూయేల్ పోటీపడగా ఇందులో భరణి గెలిచాడు. ఇక గెలిచిన తర్వాత తన వైపు నుంచి సంజనని నామినేట్ చేస్తూ ఆ సుత్తి తీసుకెళ్లి దమ్ము శ్రీజ చేతికి ఇచ్చాడు. ఇక శ్రీజ "సంజన గారు మీరు అలా షాంపు బాటిల్ బాత్రూంలో పెట్టడం ప్రాబ్లమ్ అండి. మాకు వద్దు అన్నా కూడా లేదు నేను అట్లనే ఉంటా, ఆ స్టాండ్ మీదే ఉంటా అన్నారు. అది అసలు స్టాండ్‌యే కాదు" అంటూ శ్రీజ ఫైర్ అయింది.
అయితే శ్రీజ కూడా సంజనానే నామినేట్ చేస్తుందని అందరూ అనుకుంటుండగా తనూజని నామినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. "తనూజ గారు ఫస్ట్ డే వచ్చిన దగ్గరి నుంచీ కూడా కామెంట్లు వేయడం మొదలుపెట్టారు. ఇలాంటివి ఫస్ట్ డే నుంచి కూడా జరుగుతున్నాయి మీ దగ్గరి నుంచి" అంటూ శ్రీజ చెప్పింది. దీనికి తనూజ ఏదో సమాధానం చెబుతుండగా "మనుషుల్లా చూడట్లేదు అంటున్నారు. అది వెరీ రాంగ్" అని డీమన్ పవన్ అన్నాడు. ఇక వంటలో కూడా చిరాకు పడుతూ చేస్తున్నట్లు అనిపించింది అని శ్రీజ చెప్పగా, "ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోసారి ఇంకొకటి చెప్తారు. మేమూ మనుషులమే" అంటూ తనూజ వాయిస్ రెయిజ్ చేసింది.
మీ బాడీ లాంగ్వేజ్ బాలేదు: ఇంతలో అగ్నిపరీక్ష అనే ఫార్మాట్ నుంచి అంటూ హరీష్ లేచి మాట్లాడుతుంటే సార్ నేను అక్కడ మాట్లాడుతున్నాను అంటూ తనూజ ఆపింది. దీంతో హరీష్ రెచ్చిపోయాడు. "నీ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నామా ఏంటి. మీ బాడీ లాంగ్వేజ్, మీ మాటే బాలేదు" అని తనూజ గురించి అన్నాడు హరీష్. దీంతో "నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాట గురించి మాట్లాడే రైట్ మీకు లేదు" అంటూ తనూజ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది.
ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమన్ శెట్టికి తన బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తనూజ. "వాళ్లు నామినేషన్ చేసినందుకు నేను హర్ట్ కాలేదు. బిహేవియర్ బాలేదంటే, ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి మాట్లాడితే అది ఎట్లా పోట్రే అవుతుంది బయటికి" అంటూ తనూజ ఏడ్చింది. దీంతో మొదటి ప్రోమో ఎండ్ అయ్యింది.
ఇక రెండో ప్రోమోలో ఫ్లోరా షైనీ - సుమన్ శెట్టి ఇద్దరూ పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి గెలిచి సుత్తి అందుకొని తన వైపు నుంచి సంజనని నామినేట్ చేయాలనుకుంటున్నట్లు చెప్పి దీన్ని ఆమోదించేందుకు ప్రియకి సుత్తి ఇచ్చాడు. అయితే "సంజన గారిని చాలా మంది ఒకటే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారు. కాబట్టి నేను నామినేషన్ ఛేంజ్ చేస్తున్నాను" అంటూ రాము రాథోడ్ ఫొటో పగలగొట్టింది.
"ఫుడ్ విషయంలో మీకోసం చేసినప్పడు మీకు ఓకే, కానీ మా కోసం అంటే మాత్రం రూల్స్ మాట్లాడతారు" అంటూ నామినేట్ చేసింది. ఇక చివరిలో భరణికి నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు బిగ్‌బాస్. "ఇప్పటివరకూ జరిగిన నామినేషన్స్‌లో సుత్తి అందుకోకుండా డేంజర్ జోన్‌లో ఉన్న మనీష్- డీమన్ పవన్లోనుంచి ఒకర్ని నామినేట్ చేయాలి" అని బిగ్‌బాస్ చెప్పాడు.
దీంతో డీమన్ పవన్‌ని నామినేట్ చేస్తూ "పవన్ విషయానికొచ్చే సరికి కాస్త నెగ్లిజెంట్ ఆటిట్యూడ్ కనబడుతుంది" అని భరణి అన్నాడు. అయితే ఈ మాటని పవన్ యాక్సెప్ట్ చేయలేదు. "నేను నెగ్లిజెంట్ అనడం అనేది యాక్సెప్ట్ చేయలేను" అంటూ చెప్పాడు. దీంతో రెండో ప్రోమో ఎండ్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది మంది మొదటి వారంలో నామినేట్ అయినట్లు సమాచారం.
రేసు గుర్రాలు ఇంట్లోకి వెళ్లాయ్ - అందులో గెలుపు గుర్రాలేవీ? - అర్థమైందా రాజా!

