ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Day 3 Episode: హౌజ్​లో "గుడ్డు" పోయింది - వాళ్ల ముగ్గురిని ఇరికించిన సంజనా!

- గుడ్డు దొబ్బేసి కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన సంజనా - మూడో రోజు హౌజ్​లో జరిగిందిదే!

Bigg Boss 9 Telugu Day 3 Episode
Bigg Boss 9 Telugu Day 3 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 11, 2025 at 11:37 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Day 3 Episode: బిగ్​బాస్​ సీజన్​ 9 మొదలయ్యి నాలుగు రోజులు అయినా ప్రేక్షకులకు కిక్క్​ ఇచ్చేలా మూడో రోజు ఎపిసోడ్​ ఉంది. తొలివారం నామినేషన్స్​లో కూడా పెద్దగా ఫైర్​ లేకపోయినా సంజనా చేసిన రచ్చ అంతా ఇంతా కాదయో. రెండో రోజు షాంపూ బాటిల్​ గురించి రచ్చ చేసిన సంజనా, మూడో రోజు డోస్​ మరింత పెంచి గుడ్డు దొబ్బేసింది. మీలో మీరు తన్నుకు చావండి. నన్ను మాత్రం ఎంటర్​టైన్​ చేయండి అన్న రీతిలో తనలోని కళను బయటికి తీసింది. ఇంతకీ ఆ గుడ్డు గోల ఏంది? మూడో రోజు హౌజ్​లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

నామినేషన్​ ప్రక్రియ పూర్తైన తర్వాత అత్తారింటికి దారేదిలోని పాటతో మూడో రోజు ఆటను ప్రారంభించాడు బిగ్​బాస్​. ఇక ఈ పాటకు కంటెస్టెంట్లు అందరూ డ్యాన్స్​ చేసిన తర్వాత నామినేషన్స్(Bigg Boss 9 Telugu Nominations)​ గురించి డిస్కషన్​ మొదలుపెట్టారు. అనంతరం కామనర్ల దగ్గరికొచ్చి ఓ కప్పు ఛాయ్ కావాలని సంజనా అడగగా, దీనికి "లేదు. అది మా లగ్జరీ మేము ఇవ్వలేము" అంటూ మర్యాద మనీష్ చెప్పాడు. "అంటే నాకు రోజుకి 6 టీలు తాగే అలవాటు ఉంది" అంటూ సంజనా చెప్పినా, ఇచ్చేది లేదంటూ మనీష్ తెగేసి చెప్పాడు. కాసేపటికి బాయిల్ చేసిన ఎగ్స్‌లో ఒక గుడ్డు పోయింది అంటూ కామనర్లు చూసుకున్నారు. వెంటనే డౌట్​ సంజనా మీద రావడంతో వెళ్లి అడగగా నో అంటూ నవ్వుతూ చెప్పింది.

గుడ్డు పోయింది: ఇక గుడ్డు ఎవరు తీశారో తెలీక కాసేపు జుట్టు పీక్కున్న కామనర్లు చివరికి ఓ డెసిషన్ తీసుకుంటారు. "టెనెంట్స్‌ లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే గుడ్డు పోయిందని, ఇక సెలబ్రెటీలు ఎవరికీ తమ ఇంట్లోకి వచ్చేందుకు పర్మిషన్ లేదు" అంటూ కామనర్లు అనౌన్స్ చేశారు. దీంతో టెనెంట్లు అంతా కలిసి "గుడ్డు ఎవరు తీశారో చెప్పండి. ఒకరి వల్ల అందరికీ ప్రాబ్లమ్ అవుతుంది" అంటూ రిక్వెస్ట్​ చేశారు. ఇమ్మాన్యుయేల్​ అయితే "మీరే తిన్నారా మేడమ్ చెప్పండి" అంటూ సంజనాని అడిగాడు. దీనికి "నేను చాలా గుడ్డు. నాకు గుడ్డెందుకు" అంటూ నవ్వుతూ చెప్పింది. "నేను అయితే తీసుకోలేదు. ఎవరడిగినా ఇలానే నవ్వుతూ చెప్తా ఏమైనా కానీ" అంటూ సంజనా తనలోని నటన మొత్తం బయటపెట్టి కంటెస్టెంట్స్​తో ఆడుకుంది.

హరీష్​ వర్సెస్​ భరణి: కాసేపటికి ఎలాగైనా సంజనాయే గుడ్డు తీసిందని ఒప్పిద్దామని మాస్క్‌మ్యాన్ హరీష్ అనుకుంటాడు. దీంతో సంజనా దగ్గరికెళ్లి " మీరు గుడ్డు తింటే తిన్నానని చెప్పేయండి ఫర్లేదు. అది నా గుడ్డే. నేను చూసుకుంటాను. నేను ఈరోజు తినకుండా ఉంటాను" అంటూ హరీష్ అన్నాడు. దీనికి కూడా సంజనా నేను తీయలేదండి అంటూ సమాధానమిచ్చింది. ఇక ఓవైపు నుంచి మీ వల్లే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ సంజనా మీద ఫైర్ అయ్యాడు భరణి. "అయినా గుడ్డు ఎవరిదో ఆయనే ఓకే అన్నాడు కదా మీ అందరికీ ఏంటి ప్రాబ్లమ్" అంటూ సంజనా రివర్స్ అయింది. దీంతో భరణి కూడా "చూడండి, హరీష్ తనకి ఫేవర్‌గా ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లమ్ ఏంటి" అంటూ అన్నాడు.

దీంతో హరీష్‌కి కోపం వచ్చింది. "భరణి గారు మీరు మధ్యలో ఓవర్ స్మార్ట్‌గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నా దగ్గర అది వద్దు. నేను మీకంటే ఓవర్ స్మార్ట్‌గా మాట్లాడగలను" అంటూ ఫైర్ అయ్యాడు హరీష్. దీంతో అప్పటివరకూ కాస్త సైలెంట్‌గా ఉన్న భరణి కూడా రెయిజ్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

వాళ్లని ఇరికించి హ్యాపీ: అయితే గుడ్డు తీసింది ఎవరో తెలియక హౌజ్​ మొత్తం తన్నుకు చస్తుంటే తాపీగా అసలు మేటర్ చెప్పింది సంజనా. "నాకు ఆకలేసి నేనే గుడ్డు తిన్నాను. ఎగ్ అడిగితే ఎవరూ ఇవ్వరని ఫీలై అలా చేశాను. నాకు భోజనం సరిపోక తిన్నాను. టెంప్ట్ అయ్యా ఎగ్‌యే కదా ఏమైంది ఇప్పుడు" అని సంజనా అంది. దీంతో ఓనర్లంతా సంజనా మీద ఫైర్ అయ్యారు. ఇక సంజనా దానికి సారీ చెప్పకుండా "అయినా నేను ఎగ్ తింటున్నప్పుడు కిచెన్‌లో ఉన్న భరణి-తనూజ కూడా చూశారు. అలానే రాముకి కూడా తెలుసు" అంటూ ముగ్గుర్నీ ఇరికించేసింది సంజనా.

ఇక ఈ విషయం తెలియగానే శ్రష్ఠి ఫైర్​ అయ్యింది. సంజనా మీదకెళ్లి సిగ్గులేదా గుడ్డు తినడానికి అంటూ తిట్టింది. దీంతో ఏయ్ మైండ్ యూ ఆర్ టంగ్, సిగ్గు లేదా అంటున్నావేంటి అంటూ సంజనా ఫైర్ అయింది. ఇంతలో రీతూ చౌదరి వచ్చి భరణిని కార్నర్ చేసింది. "మీ అందరికీ తెలిసే మీరు నోరు విప్పలేదన్నమాట. అంటే మీ ముగ్గురూ కలిసి ఈ గేమ్ ఆడారు" అంటూ రీతూ ఫైర్ అయింది. "ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నేను గేమ్ ఆడటం ఏంటి" అంటూ భరణి కూడా రివర్స్ అయ్యాడు. నిజం చెప్తున్నా జరిగిందిదే అంటూ భరణి అసలు మేటర్ చెప్పాడు. "మేము కిచెన్‌లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజని అడిగిందట. 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను. ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పిందంట. అందుకే నేను కూడా సైలెంట్‌గా ఉన్నా" అంటూ భరణి చెప్పాడు.

ఇక ఈ మాటలు విని నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అంటూ సంజనా ఫైర్ అయింది. ఇక ఇది చూసిన ఫ్లోరా "ఫ్యామిలీ మేటర్ తీసుకుంటే బాధేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా. మరి నన్ను ఫ్రీ బర్డ్ అంటూ మొన్న అన్నావ్ కదా నాకు కూడా ఇలానే బాధేసింది" అంటూ ఫ్లోరా చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇలా ఒక్క గుడ్డు వల్ల అటు మాస్క్​మ్యాస్​ - భరిణి, ఇట్టు రీతూ చాదరి - భరణి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఏది అయితేనేమి ఆడియన్స్​కు కావాల్సినంత ఎంటర్​టైన్​మెంట్​ దొరికింది.

Bigg Boss 9 Telugu: ఆ ఇద్దరి మెడపైనే ఎలిమినేషన్ కత్తి?!

Bigg Boss 9 Telugu Day 3 Promo: "మీ బాడీ లాంగ్వేజ్​, మీ మాట బాలేదు" - నామినేషన్స్​లో కంటెస్టెంట్స్​ మాటల యుద్ధం!