ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu Day 11 Episode: కెప్టెన్​గా "టిల్లు-1" - సంచాలక్​గా ఫేవర్​ చేసి రాధిక! - భరణికి అన్యాయం!

- బిగ్​బాస్​ హౌజ్​కు రెండో వారం కెప్టెన్​గా డీమన్​ పవన్​ - సంచాలక్​గా గెలిపించిన రీతూ చౌదరి - పోరాడి ఓడిన ఇమ్మాన్యుయేల్​!

Bigg Boss 9 Telugu Day 11 Episode
Bigg Boss 9 Telugu Day 11 Episode (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 19, 2025 at 10:33 AM IST

5 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu Day 11 Episode: బిగ్​బాస్​ సీజన్​ 9 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే మొదటి కెప్టెన్​గా సంజనా నిలవగా, రెండో కెప్టెన్సీ కోసం జరిగిన టాస్కుల్లో కామనర్స్​ వర్సెస్​ సెలెబ్రిటీల మధ్య ఓ యుద్ధమే జరిగింది. మరీ ముఖ్యంగా రంగు పడుద్ది టాస్క్​లో కెప్టెన్సీ కంటెండర్లు ఓ రేంజ్​లో ఆటాడారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్​లో సంచాలక్​గా వ్యవహరించిన రీతూ చౌదరిని సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు నెటిజన్లు. తన ఫేవరెట్​ కంటెస్టెంట్​ను గెలిపిచేందుకు రూల్స్​ బ్రేక్​ చేసిందని కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇంతకీ నిన్నటి ఎపిసోడ్​లో ఏం జరిగింది? కెప్టెన్​గా ఎవరు సెలెక్ట్​ అయ్యారు సహా తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బిగ్‌బాస్ హౌజ్​లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్లు-టెనెంట్ల మధ్య టాస్కులు మొదలైన సంగతి తెలిసిందే. చక్రవ్యూహం, బజర్​ ఆర్​ నో బజర్​ అంటూ నిర్వహించిన టాస్కుల్లో ఒకదాంట్లో కామనర్లు గెలవగా, రెండోది ఎవరూ గెలవలేదు. దీంతో ఒక టాస్క్​ గెలిచిన ఓనర్ల నుంచే కెప్టెన్సీ కంటెండర్లని సెలెక్ట్ చేయాలని అనౌన్స్​ చేశాడు బిగ్​బాస్​. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. "మొత్తం ఓనర్లుగా ఉన్న ఏడుగురిలో ఏ నలుగురైతే కెప్టెన్సీకి అనర్హులని భావిస్తారో వాళ్ల పేర్లు చెప్పి రేసు నుంచి తప్పించాలి" అని టెనెంట్లకి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అందరూ చర్చించుకుని ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే టెనెంట్లలో చాలా మంది డీమన్​ను కెప్టెన్​గా వద్దని చెప్పగా, రీతూ మాత్రం అతడే కావాలని పట్టుబట్టింది. ఎవరు ఎన్ని చెప్పినా అతడు ఉండాల్సిందే అని, మిగిలిన వారితో పోలిస్తే డీమన్​ బెటర్​ అంటూ వాదించింది.

రేసులో నలుగురు: ఇక టెనెంట్ల మధ్య జరిగిన డిస్కషన్ ప్రకారం దమ్ము శ్రీజ, ప్రియా, కల్యాణ్​, హరీష్​ను అనర్హులుగా భావించి రేసు నుంచి తప్పిస్తున్నట్టు సంజనా చెప్పింది. అలాగే కెప్టెన్సీ పోటీదారులుగా భరణి, మర్యాద మనీష్​, డీమన్​ పవన్​ను సెలెక్ట్​ చేశారు. ఇక కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన వారికి బిగ్‌బాస్ ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు. "మీరు ముగ్గురూ కలిసి టెనెంట్స్ టీమ్ నుంచి మీరనుకుంటున్న బెస్ట్ ప్లేయర్‌ ఒకరికి కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ పడే ఛాన్స్ ఇవ్వొచ్చు. ఆ నిర్ణయాన్ని వెంటనే చెప్పండి" అని బిగ్‌బాస్ అడిగాడు. ఇక ఈ ముగ్గురూ పెద్ద చర్చలేం లేకుండా ఏకాభిప్రాయంతో ఇమ్మానుయేల్ పేరు చెప్పారు. దీంతో కెప్టెన్సీ కోసం మర్యాద, డీమాన్, భరణి, ఇమ్మానుయేల్ కంటెండర్స్ అయ్యారు. ఇక వీరికి 'రంగు పడుద్ది' అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్.

సంచాలక్​గా రీతూ: "రంగు పడుద్ది టాస్క్‌లో భాగంగా ప్రతి ప్లేయర్ తన టీ ష్టర్ట్‌ని రంగు పడకుండా కాపాడుకోవాలి. అలానే ఇతర ప్లేయర్ల మీద రంగు పూయాలి. ఈ టాస్క్ వివిధ రౌండ్స్‌లో జరుగుతుంది. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి టీ షర్ట్ మీద ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లు గేమ్ నుంచి, కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారు. ఇక సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం. ఈ టాస్కుకి రీతూ సంచాలకులు" అంటూ బిగ్‌బాస్ రూల్ బుక్ పంపించాడు. ఇక రీతూ సంచాలక్ అనగానే డీమాన్ ఫేస్ వెలిగిపోయింది. అలాగే కంటెస్టెంట్లు అందరూ డీమన్​ కెప్టెన్​ అవుతాడని ఫిక్స్​ అయ్యారు. ఎందుకంటే తనని ఈ వారం కెప్టెన్ కావాలంటూ రీతూనే చాలా సార్లు అడిగింది.

అనుకున్నట్లుగానే: ఇక తొలి రౌండ్ మొదలుకాగానే మర్యాద మనీష్​ తెలివిగా పక్క వాళ్ల రంగు పళ్లెం ఉన్న స్టాండ్‌ని తన్నేశాడు. దీంతో అవతలి వాళ్లు కూడా ఇదే చేశారు. ఇక ఆ తర్వాత మర్యాద మనీష్.. భరణిని టార్గెట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ భరణి మీదకి వెళ్తున్నప్పుడు ఇమ్మూ కూడా తోడై మనీష్‌ టీషర్ట్‌కి రంగులు పూసేశారు. దీంతో ఎక్కువ రంగు అంటుకోవడంతో ఈ రౌండ్‌లో మనీష్ ఔట్ అయ్యాడు.

ఇక రెండో రౌండ్​ మొదలైంది. ఈసారి భరణి-ఇమ్మూ కలిసి డీమాన్‌ని టార్గెట్ చేశారు. అయితే ఇద్దరినీ బానే హ్యాండిల్ చేస్తూ కాసేపు ఫైట్ చేశాడు పవన్. కానీ ఇది చూసిన కామనర్లు "ఇక్కడ కామనర్లు Vs సెలెబ్రిటీలు అన్నట్లే టాస్క్ జరుగుతుంది. ఒక్కడ్ని చేసి ఇద్దరూ టార్గెట్ చేస్తున్నారు" అంటూ ప్రియ, దమ్ము శ్రీజ గొడవ పడ్డారు. అయితే బజర్ మోగే ముందు వరకూ డీమాన్ టీ షర్ట్ మీదే ఎక్కువ రంగు ఉంది. కానీ ఇక్కడే రీతూ చౌదరి మళ్లీ చక్రం తిప్పింది. "నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత కూడా భరణి అన్న మూడు సార్లు రంగులు పూశారు. సో ఈ రౌండ్ నుంచి భరణి ఔట్" అంటూ రీతూ అనౌన్స్ చేసింది. ఇక భరణి ఔట్ కాగానే సంచాలక్ సూపర్ అంటూ కామనర్లు గట్టిగానే ఎగిరారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్టాప్​ అన్న తర్వాత భరణి ఎలా అయితే డీమాన్​కు రంగు పూశాడో, డీమన్​కు భరణికి అలాగే రంగు అద్దాడు. అప్పటికీ పక్కన ఉన్నవాళ్లు పరిస్థితి చెబుతున్నా భరణి అవుట్​ అని డిసైడ్​ చేసింది.

పోరాడిన ఇమ్మాన్యుయేల్​: ఇక చివరిగా ఇమ్మానుయేల్-డీమాన్ గేమ్‌లో మిగిలారు. తరువాతి రౌండ్ మొదలుకాగానే ఇమ్మూ-డీమాన్ గట్టిగానే తలపడ్డారు. అయితే "టీ షర్ట్ లాగకూడదు, రంగు మీదకి విసరకూడదు. దగ్గరికెళ్లి పూయాలి" అంటూ రీతూ చౌదరి మొదట్లో రూల్స్ చెప్పింది. కానీ ఈ రౌండ్‌లో క్లియర్‌గా ఇమ్మూ టీ షర్ట్‌ని పైకి లాగుతూ డీమాన్ ఆడాడు. దీంతో "ఇదేంటి ఇప్పుడు టీ షర్ట్ లాగాడు కదా, ఔట్ చేయవేంటి" అని రీతూ చౌదరిని అడిగాడు ఇమ్మానుయేల్. దీనికి రీతూ ఊగిపోతూ రివర్స్‌లో ఇమ్మూ మీద సీరియస్ అయింది. ఇక చివరికి బజర్ మోగే సమయనికి ఇద్దరి టీ షర్ట్‌లు చూస్తే కొద్ది తేడాలో పవన్ పై చేయి సాధించాడు. దీంతో ఈ గేమ్‌లో విజేతగా డీమాన్ పవన్ నిలిచాడంటూ రీతూ చౌదరి అనౌన్స్ చేసింది. అయితే చూసే జనాలను డీమాన్‌ని కెప్టెన్ చేయాలనే రీతూ చౌదరిని సంచాలక్‌‍గా పెట్టినట్లుగా అనిపించింది. మరి సంచాలక్​గా రీతూ చౌదరి చేసిన దాని గురించి వీకెండ్​లో నాగార్జున మాట్లాడుతాడో లేదో చూడాలి.

Bigg Boss 9 Mask Man: డిప్రెషన్​ నుంచి బిగ్​బాస్​ దాకా - మాస్క్​మ్యాన్​ బ్యాక్​ డ్రాప్​ ఇదే!

Love Track in Bigg Boss 9 Telugu: బిగ్​బాస్​లో ఇద్దరు టిల్లూస్, ఒక రాధిక! - పులిహోర మాడిపోతోందిగా!