Bigg Boss 9 Emmanuel: "స్టాండప్ కామెడీ నుంచి బిగ్‌బాస్ దాకా" - ఇమ్మాన్యుయేల్ గురించి తెలుసా?
- చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి - అవకాశాల కోసం మూడు సంవత్సరాలు ఎదురుచూపు - "జబర్దస్త్"తో వెలుగులోకి

Published : September 15, 2025 at 1:53 PM IST
Jabardasth Emmanuel Background: తన మాటలు, పంచ్‌లు, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయిస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తనదైన టాలెంట్‌తోనే ఎదిగి తెలుగు ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అందంగా లేవంటూ ఎన్నో సార్లు బాడీ షేమింగ్‌కు గురైన అన్నింటినీ తట్టుకుని వాటినే అస్త్రాలుగా చేసుకుని కామెడీ షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతను మరెవరో కాదు గుంటూరు మిర్చి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్9లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. అక్కడ కూడా తనదైన శైలిలో పంచులు విసురుతూ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తున్నాడు. అయితే కనిపించే ఆ నవ్వు వెనక ఎంతో ఆవేదన ఉంది. ఈ క్రమంలోనే అతడి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
గుంటూరు మిర్చి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ పేద కుటుంబంలో జన్మించారు ఇమ్మాన్యుయేల్. ఊళ్లోనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే దగ్గరికి వెళ్లాడు. అయితే ఓవైపు చదువుతూనే నటన పై ఆసక్తి కలిగింది. రీల్స్ చేస్తూ అప్పుడప్పుడూ తనలో టాలెంట్‌ను చూపించుకునే వారు. అయితే తాను చదివినా చదువుకు జాబ్ రాదని ఫిక్స్ అయ్యి సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని హైదరాబాద్ వచ్చాడు. అలా మూడు సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎదురుచూసినా ఫలితం లేదు. దీంతో ఒకరి కోసం ఎదురుచూడటం ఎందుకని సొంతంగా స్కిట్లు రాయడం ప్రారంభించాడు.
పటాస్ To జబర్దస్త్: 2018లో కొన్ని స్టాండప్ కామెడీ షోలు చేస్తున్న ఇమ్మాన్యుయేల్‌కు పటాస్ షోలో అవకాశం దక్కింది. దీంతో తొలి స్కిట్లోనే తనదైన కామెడీ పంచులతో అదరగొట్టారు. ఈ ఫేమ్‌తోనే పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చారు. వెంకీ మంకీస్, కెవ్వు కార్తీక్, బుల్లెట్ భాస్కర్ టీమ్‌లు సహా ఇతర టీమ్‌లలో కూడా అవకాశం దొరికినప్పుడల్లా తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఎక్ట్స్రా జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నాడు.
వర్షతో మరింత పాపులర్: కేవలం సింగిల్‌గా మాత్రమే కాకుండా లేడీ కమెడియన్ వర్షతో ఎన్నో స్కిట్స్ చేశాడు. వాటిల్లో తనదైన పంచులతో ఆడియన్స్‌ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. మరీముఖ్యంగా వీరిద్దరి కెమెస్ట్రీ బుల్లితెరపై బాగా వర్కౌట్ అయ్యింది. ఇక తన తోటి సెలబ్రిటీలంతా ఆయన్ను ఇమ్మూ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. కేవలం జబర్దస్త్, ఎక్ట్సా జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలలో కూడా పార్టిసిపేట్ చేసి కామెడీ టైమింగ్‌తో తనదైన ముద్ర వేసుకున్నాడు.
జబర్దస్త్ To మూవీస్: ఇమ్మాన్యుయేల్ కామెడీ ప్రయాణం కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాలేదు. వెండితెరపై కూడా మెరిశాడు. 'విరూపాక్ష' సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. అలాగే రీసెంట్‌గా మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర'లోనూ చిన్న రోల్ చేస్తున్నారని సమాచారం. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా "ప్రేమ వాలంటీర్" అంటూ ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేశాడు. ఇందులో తన నటన, కామెడీకి మంచి మార్కులే పడ్డాయి.
బిగ్‌బాస్ హౌజ్‌లోకి: ఓవైపు కామెడీ షోలలో పాల్గొంటూనే బిగ్‌బాస్ ఆఫర్ అందుకున్నాడు. తాజాగా మొదలైన ఈ షోలో నాలుగో కంటెస్టెంట్‌గా సెలిబ్రిటీ కోటాలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే హౌజ్‌లో కూడా తన టైమింగ్, పంచ్‌లతో అటు కంటెస్టెంట్లను, ఇటు సెలిబ్రిటీలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్నా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయ్యాడు.
Bigg Boss 9 Telugu Day 7 Episode: శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ - సుమన్ శెట్టిపై బిగ్‌బాంబ్!
Bigg Boss 9 Sunday Promo: "మతిమరుపునకు మందు ఉంటే వేసుకో" - కంటెస్టెంట్స్‌కు నాగ్ వార్నింగ్!

