ETV Bharat / entertainment

Bigg Boss 9 Telugu: "ఓవైపు వైల్డ్​కార్డ్స్ - మరోవైపు డబుల్ ఎలిమినేషన్ " - బిగ్​బాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

-గేమ్​ను మార్చిన బిగ్​బాస్​ టీమ్​ - వైల్డ్​కార్స్​ ఎంట్రీతో మారనున్న సమీకరణాలు - డబుల్​ ఎలిమినేషన్​తో బిగ్​ ట్విస్ట్​!

Bigg Boss 9 Telugu
Bigg Boss 9 Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 9, 2025 at 1:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Telugu: బిగ్​బాస్​ సీజన్​ 9 రసవత్తరంగా సాగుతోంది. చదరంగం కాదు రణరంగం అంటూ షో ప్రారంభానికి ముందే హైప్​ ఇచ్చిన బిగ్​బాస్ టీమ్​​.. దాన్ని నిలబెట్టుకోవడంలో కాస్త సక్సెస్​ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి మూడు వారాలు పెద్దగా టాస్క్​లు లేకపోయినా.. కామనర్స్​ వర్సెస్​ సెలిబ్రిటీలు అనే కాన్సెప్ట్​తో ప్రేక్షకులను ఎంటర్​టైన్​ చేశారు. కానీ నాలుగో వారం నుంచి బిగ్​బాస్​ ఆట స్వరూపమే మారిపోయింది. ఇమ్యూనిటీ, కెప్టెన్సీ టాస్క్​లతో కంటెస్టెంట్స్​కు చుక్కలు చూపించారు. ఇక ఐదో వారం ఏకంగా వైల్డ్​ కార్డ్స్​ పేరుతో తుపాన్​ రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో తమ స్థానాన్ని కన్ఫార్మ్​ చేసుకునేందుకు హౌజ్​మేట్స్​ కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలోనే షోపై మరింత క్యూరియాసిటీ పెంచేందుకు ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఓవైపు డబుల్​ ఎలిమినేషన్​.. మరోవైపు వైల్డ్​ కార్డ్స్​తో బిగ్​బాస్​ టీమ్​ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మరి ఈ లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

డబుల్​ ఎలిమినేషన్​: ప్రస్తుత సీజన్​లో 9 మంది సెలిబ్రిటీలు, 6 కామనర్లు కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎంటర్​ అయ్యారు. అయితే మొదటి వారంలో శ్రష్ఠి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్​ ఎలిమినేషన్​ అనంతరం మూడో వారం మిడ్​ వీక్​లో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ పేరుతో అగ్నిపరీక్షలో సత్తా చూపిన దివ్య నిఖితను హౌజ్​లోకి పంపించారు. ఇక ఆ తర్వాత మూడో వారంలో ప్రియా శెట్టి, నాలుగో వారంలో మాస్క్​మ్యాన్​ హరీష్​ ఇలా మొత్తంగా నలుగురు ఎలిమినేట్​ అయ్యారు. ప్రస్తుతానికి మొత్తం 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక ఐదో వారం నామినేషన్స్​లో కెప్టెన్​ రామూ రాథోడ్​, ఇమ్యూనిటీ గెలుచుకున్న ఇమ్మాన్యుయేల్​ మినహా మిగిలిన భరణి, దివ్య, రీతూ చౌదరి, డీమాన్​ పవన్​, తనూజ, కల్యాణ్​, సుమన్​ శెట్టి, శ్రీజ, సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ ఇలా అందరూ నామినేట్​ అయ్యారు.

రూట్​ మార్చిన బిగ్​బాస్​: సాధారణంగా నామినేషన్స్​ అంటే ఒక్కో కంటెస్టెంట్స్​ పలు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్​ చేయాలి. ఇలా ప్రక్రియ మొత్తం పూర్తయ్యే సరికి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు నామినేట్​ అవుతారు. గత సీజన్లు, ఈ సీజన్​లో మొదటి నాలుగు వారాలు చాలా వరకు అలానే జరిగింది. కానీ ఐదో వారంలో మాత్రం బిగ్​బాస్​ చక్రం తిప్పాడు. కెప్టెన్​ మినహా మిగిలిన 11 మందిని నామినేట్​ చేశాడు. ఆ తర్వాత ఇమ్యూనిటీ గెలుచుకునేందుకు టాస్క్​లు పెట్టగా అందులో ఇమ్మాన్యుయేల్​ సేఫ్​ అయ్యాడు. దీంతో మొత్తం 10 మంది నామినేట్​ అయ్యారు. సో ఇక్కడే అర్థం అవుతుంది ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని!. ఎందుకంటే కంటెస్టెంట్స్​ నామినేట్​ చేస్తే ఎక్కవ మంది లిస్ట్​లో ఉండరు. అదే బిగ్​బాస్​ చేస్తే కౌంట్​ పెరుగుతుంది. దీంతో డబుల్​ ఎలిమినేషన్​కు లెక్క పక్కగా ఉంటుంది. సో ఈ బేసిస్​ మీదనే బిగ్​బాస్​ అందరినీ నామినేట్​ చేసినట్లు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. కాబట్టి ఈ వారం ఇంటి నుంచి ఇద్దరు బయటికి వెళ్లడం ఫిక్స్ అంటూ మాట్లాడుకుంటున్నారు​!.

వైల్డ్​కార్డ్స్ ఎంట్రీ​: ఇక సీజన్​ 9ను మరింత పీక్స్​కు తీసుకెళ్లేందుకు బిగ్​బాస్​ టీమ్​ మరో అస్త్రాన్ని బయటికి తీయనుంది. అదే వైల్డ్​కార్డ్స్​(బిగ్​బాస్​ 2.0). ఇప్పటికే దీని గురించి బిగ్​బాస్​ అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. అయితే ఎంతమంది? ఎప్పుడు వస్తారు? అనే దాని గురించి మాత్రం ఎటువంటి అనౌన్స్​ చేయలేదు. దీంతో ఈ విషయం గురించి సోషల్​ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.

మారనున్న గేమ్​: అయితే వైల్డ్​కార్డ్స్​ ఎంట్రీతో ఆట స్వరూపమే మారిపోతుందని బిగ్​బాస్​ లవర్స్​ ఫీల్​ అవుతున్నారు. ఎందుకంటే వైల్డ్​ కార్డ్​గా ఎంట్రీ ఇచ్చేవారు ముందునుంచే గేమ్​ను ఫాలో అవుతుంటారు. ఎవరు ఎలా ఆడుతున్నారు? వాళ్ల పద్ధతి ఎలా ఉంది? ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్​ ఉంది? అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుని దానికి తగినట్లుగా హౌజ్​లో పావులు కదుపుతుంటారు. అంతేకాకుండా అప్పటివరకు కామనర్స్​ వర్సెస్​ సెలిబ్రిటీలుగా ఉన్న కంటెస్టెంట్స్​ అందరూ కలిసి ఓ వైపు ఉంటే.. వైల్డ్​కార్డ్స్​గా ఎంట్రీ ఇచ్చిన వారందరూ మరోటీమ్​గా ఉంటారు. సో ఆట మారుతుంది.. ఆపై నామినేషన్స్​, ఎలిమినేషన్స్​ లెక్కలు మారతాయి. ఈ లెక్కన సీజన్​ 9ను మరింత హిట్​ చేయడానికి బిగ్​బాస్ టీమ్​​ గట్టిగానే ప్లాన్​ చేస్తోందని ఆడియన్స్​ భావిస్తున్నారు.

Bigg Boss Hosts Remunerations: బిగ్​బాస్​ హోస్ట్​లుగా స్టార్​ హీరోలు - ఎవరి రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?

Bigg Boss 9 Telugu Day 30 Episode: "ఎంతకు తెగించార్రా - బిగ్​ బాస్​నే మోసం చేస్తారా?" - అందరికీ శిక్ష!