Bigg Boss 3rd Week Elimination: ఎలిమినేషన్ బటన్ నొక్కేసిన ఆడియెన్స్ - ఆమె బ్యాగ్ సర్దేయడం పక్కా?
- బిగ్‌బాస్ మూడో వారం నామినేషన్స్‌లో ఆరుగురు - డేంజర్ జోన్లో ముగ్గురు కంటెస్టెంట్లు!

Published : September 27, 2025 at 5:15 PM IST
Bigg Boss 9 Telugu 3rd Week Elimination: బిగ్‌బాస్ సీజన్ 9లో మూడో వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. ఇప్పటికే మొదటి వారం శ్రష్ఠి వర్మ, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కావడంతో మూడు వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేది ఎవరు అని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారో అని ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరి ఈ వారం అసలు నామినేషన్స్‌లో ఎవరు ఉన్నారు? అనధికార లెక్కల ప్రకారం ఎవరు సేఫ్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
నామినేషన్లో ఉన్నది వీళ్లే: బిగ్‌బాస్ సీజన్ 9లో మూడో వారం నామినేషన్స్ మొదటి రెండు వారాలతో పోలిస్తే కాస్త హాటుహాటుగానే సాగాయి. టెనెంట్స్ అయిన కామనర్లకి నామినేషన్ చేసే ఛాన్స్ కల్పించాడు బిగ్బాగ్. టెనెంట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఐదుగురిని నామినేట్ చేసి మ్యాగ్నెటిక్ బోర్డ్‌లో వారి ఫొటోలను ఉంచి, తగిన కారణాలను చెప్పాలన్నారు. అలాగే, మీరు నామినేట్ చేసిన ఐదుగురిలో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు. ఈ క్రమంలో టెనెంట్స్ అందరూ కలిసి సంజనా, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, హరిత హరీష్‌ను నామినేట్ చేశారు.
టెనెంట్స్ నామినేషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఓనర్స్ అయిన సెలబ్రెటీలకి ఒక పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. టెనెంట్స్(కామనర్స్) నామినేట్ చేసిన వారిలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫొటోలు తీసేసి కొత్తగా రెండు నామినేషన్స్ చేయమని చెప్పాడు. అలాగే, మరొక కండిషన్ పెట్టాడు. నామినేషన్స్ పూర్తయ్యే సరికి లిస్ట్‌లో ముగ్గురు టెనెంట్స్ తప్పనిసరిగా ఉండాలన్నాడు బిగ్‌బాస్. దీంతో సెలిబ్రిటీలు కలిసి సంజనా, సుమన్ శెట్టి ఫొటోలు తీసేసి రీతూ, రాము, కల్యాణ్, ప్రియా, శ్రీజను నామినేట్ చేశారు. ఇలా రెండు టీమ్‌ల నామినేషన్ ప్రక్రియ పూర్తయే సమయానికి మొత్తం 7 (పవన్ కల్యాణ్, ప్రియాశెట్టి, శ్రీజ, హరిత హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్) మంది ఉన్నారు. కెప్టెన్ డీమన్కు లభించిన స్పెషల్ పవర్ కారణంగా శ్రీజను నామినేషన్స్ నుంచి తప్పించాడు. దీంతో మొత్తంగా 6గురు నామినేట్ అయ్యారు.
ఓటింగ్స్ ఏం చెబుతున్నాయి: మొదటి వారం, రెండో వారంతో పోలిస్తే మూడో వారం నామినేషన్స్ ఒక్కరోజులోనే పూర్తి అయ్యాయి. దీంతో సోమవారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఐదు రోజుల పాటు జరిగిన ఓటింగ్స్ ప్రక్రియలో టాప్‌లో యూట్యూబ్ సెన్సేషన్ రాము రాథోడ్ ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఆ తర్వాత స్థానంలో లక్స్ పాపా ఉందని తెలుస్తోంది. పాస్ మార్క్‌లతో కల్యాణ్ పడాల సేఫ్ జోన్లో ఉన్నట్టు సోషల్ మీడియా టాక్.
డేంజర్ జోన్లో ముగ్గురు: ఇక అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో వరసగా మాస్క్‌మ్యాన్ హరీష్, రీతూ చౌదరి, ప్రియా ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ప్రియాకే ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక జనాలు కూడా ఈమె ఎప్పుడు ఎలిమినేట్ అయ్యిద్దా అని ఎదురుచూస్తున్నారు. రెండో వారంలోనే బయటికి పోవాల్సి వచ్చినా త్రుటిలో ప్రమాదం తప్పించుకుని సేఫ్ అయ్యింది. కానీ ఈవారం అలా జరిగే అవకాశాలు లేవంటున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి..
డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురిలో హరీష్ సేవ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కామనర్స్‌లో హరిత హరీష్ ఒక్కడే కాస్త గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. నోటి దూల ఉన్నా జనాలు ఇతను ఉండాలనే కోరుకుంటున్నారు. ఇక రీతూ చౌదరి విషయానికి వస్తే గేమ్స్ బాగానే ఆడుతుంది. అంతేకాకుండా హౌజ్‌లో లవ్‌ట్రాక్ కూడా పట్టాలెక్కింది. ఈ సమయంలో రీతూను ఎలిమినేట్ చేస్తే ట్రాక్ విడిపోతుంది. దీంతో ఈ లవ్‌ట్రాక్ గురించే చూసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో రీతూ విషయంలో బిగ్‌బాస్ రిస్క్ తీసుకోరని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలో మిగిలినది ప్రియా ఒక్కతే. సో ప్రియా ఎలిమినేషన్ పక్కా అని సమాచారం. మరి ఈ విషయంలో బిగ్‌బాస్ ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడో ఎవరూ చెప్పలేరు. సో అఫిషీయల్‌గా తెలియాలంటే మరికొంచెం సమయం పడుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Bigg Boss 9 Telugu: మిడ్ వీక్ ఎవిక్షన్ - సంజనాను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ - ప్రోమో అదుర్స్!

