ETV Bharat / entertainment

Bigg Boss 9 Suman Shetty: "అధ్యక్షా.." మొదటి సినిమాకే "నంది" - సుమన్​ శెట్టి బ్యాగ్రౌండ్ ఇదే!

- 300 పైగా సినిమాలు - బిగ్​బాస్​తో సెకండ్​ ఇన్నింగ్​ మొదలు!

Bigg Boss 9 Suman Shetty
Bigg Boss 9 Suman Shetty (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 7, 2025 at 4:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Suman Shetty: "జయం" సినిమాలో "అధ్యక్షా", 7/G బృందావన్​ కాలనీలో "రామ్మ అప్సరస రా"అనే డైలాగ్స్​తో పాపులర్ అయిన కమెడియన్‌ సుమన్‌ శెట్టి. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతను ఈ మధ్యకాలంలో సైలెంట్‌ అయ్యారు. అయితే చాలా కాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు బిగ్​బాస్​ సీజన్​ 9లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అతని సినీ కెరియర్​ సహా ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదటి సినిమాకే నంది అవార్డ్​: సుమన్​శెట్టిది ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఉన్న పిచ్చితో ఇంటర్‌ కంప్లీట్​ అయిన తర్వాత అవకాశాల కోసం హైదరాబాద్​ వెళ్లారు. అక్కడ ఆడిషన్స్​లో సెలెక్ట్​ అయిన తర్వాత తన జీవితమే మారిపోయింది. అలా తేజ డైరెక్షన్​లో నితిన్​ - సదా జంటగా నటించిన జయం సినిమాలో హీరో ఫ్రెండ్​గా నటించాడు. ఆ సినిమాలో "అధ్యక్షా" డైలాగ్​తో తెగ పాపులర్​ అయ్యారు. అలా "జయం" మూవీతో కెరీర్​ మొదలు కాగా, మొదటి సినిమాకే నంది అవార్డ్​ వచ్చింది!

300 పైగా సినిమాలు: ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా బిజీ అయ్యారు సుమన్​. ఈ క్రమంలోనే జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం, బెండు అప్పారావ్ ఆర్ఎంపీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యజ్ఞం, రణం, సంక్రాంతి, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, 7/జి బృందావన్ కాలనీ, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ తదితర సినిమాల్లో నటించాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో కూడా నటించారు. ఇలా అన్ని భాషలూ కలిపి సుమారు 300పైనే సినిమాలు చేశారు.

తండ్రి మరణం తర్వాత ఒంటరితనం: సినిమాలు చేస్తుండగానే పెళ్లి చేసుకున్నారు. కూతురు, కొడుకు ఉన్నారు. 2019లో సుమన్​ తండ్రి చనిపోయారు. నాన్న దూరం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన సుమన్​కు వాళ్ల అమ్మ తోడుగా నిలిచింది. తండ్రి దూరమైన బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. అయితే సుమన్​ శెట్టి హౌజ్​లో అడుగుపెట్టినప్పుడు చాలా మంది మొదటి వారమే ఎలిమినేట్​ అవుతాడని భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా తన జెన్యూన్​ నేచర్​తో సేవ్​ అయ్యారు. అంతే కాకుండా సుమన్​ శెట్టి ఎప్పుడు నామినేషన్స్​లోకి వచ్చినా మొదటి, రెండు స్థానాల్లోనే కంటిన్యూ అవుతున్నారు.

డైరెక్టర్​ తేజ కోసం ప్రత్యేక గది: తనకు జయం సినిమాతో గుర్తింపు ఇచ్చి ఎన్నో సినిమాల్లో అవకాశాలు కల్పించిన డైరెక్టర్​ తేజ.. తనకు గాడ్​ఫాదర్​తో సమానం అని ఎన్నోసార్లు సుమన్​ శెట్టి చెప్పారు. అందుకే ఆయనకు కృతజ్ఞతగా తన ఇంట్లో ఓ గదిని తేజ కోసం నిర్మించి అందులో ఆయన ఫొటో ఉంచి రోజూ క్లీన్​ చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్​ తేజ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Bigg Boss Telugu Dammu Srija: లక్షల జీతం వదిలి బిగ్​బాస్​కు - ఎవరీ "దమ్ము శ్రీజ"!

Bigg Boss 9 Sanjana Galrani: "డ్రగ్స్​ కేసులో అరెస్ట్​ - లిమ్కా బుక్​లో చోటు" - సంజనా గల్రానీ గురించి తెలుసా?