ETV Bharat / entertainment

Bigg Boss 9 Ritu Chowdhary: "యాంకర్​ టూ బిగ్​బాస్​" - ఈ ముద్దుగుమ్మ వివరాలు తెలుసా?

- బిగ్​బాస్​ సీజన్​ 9లో కంటెస్టెంట్​గా రీతూ చౌదరి - ఆమె గురించి ఈ వివరాలు తెలుసా?

Bigg Boss 9 Ritu Chowdhary
Bigg Boss 9 Ritu Chowdhary (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 24, 2025 at 5:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bigg Boss 9 Ritu Chowdhary: బిగ్​బాస్​ సీజన్​ 9 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో మొదలై మూడు వారాలు కాగా నామినేషన్లు, ఎలిమినేషన్లు, టాస్కులు, గొడవలతో ప్రేక్షకుల్లో రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ సీజన్​లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్​లో రీతూ చౌదరి ఒకరు. సోషల్​ మీడియాలో ఈ భామకు ఫాలోయింగ్​ కూడా ఎక్కువే. ఈ క్రమంలోనే అసలు ఈమె సినీ జర్నీ ఎలా మొదలైంది? ఎలా సినిమాల్లోకి వచ్చింది? సహా తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణ ఖమ్మం జిల్లాలో జన్మించారు రీతూ చౌదరి. ఈమె అసలు పేరు దివ్య. కానీ రీతూ చౌదరిగా మార్చుకున్నట్లు తానే చెప్పింది. అందుకు కారణం చదువుకునే సమయంలో క్లాస్‌లో పది మంది దివ్యలు ఉండేవారట. ఎవరిని పిలిచినా అందరూ నిలబడేవారని, దాని నుంచి తప్పించుకునేందుకు, అలాగే కాస్త స్పెషల్​గా, యూనిక్​గా ఉండేందుకు ఈ పేరు పెట్టుకున్నట్లు చెప్పింది.

యాంకర్​గా కెరీరీ ప్రారంభం: చదువు తర్వాత గ్లామర్​ ప్రపంచంపై ఆసక్తితో అటువైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే లోకల్ ఛానల్స్‌లో చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించేవారు. ఆ తర్వాత ఓ ఛానల్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే హోస్ట్‌గానూ వ్యవహరించేవారు. ఇక 2018లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లిచూపులు' షోలో కంటెస్టెంట్‌గా ఉండి టీవీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.

సీరియల్​ ఎంట్రీ ఇలా: యాంకర్‌గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సీరియల్స్‌లోనూ అడుగుపెట్టారు రీతూ చౌదరి. అలా ఫస్ట్ టైం ఈటీవీలో ప్రసారమైన 'ఆడదే ఆధారం' సీరియల్ ద్వారా టీవీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గోరింటాకు, గిరిజా కల్యాణం, రామసక్కని సీత, సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సీరియల్స్‌తో పాటే తమిళ మూవీస్‌లోనూ నటించారు. అలా తెలుగులో 'మౌనమే ఇష్టం' మూవీలో నటించిన రీతూ, 'ఉప్పెన' మూవీలో సైతం ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించారు. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో ఎంట్రీ ఇచ్చారు రీతూ చౌదరి. వీటి ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఆమె, పలు షోలకు యాంకర్‌గానూ వ్యవహరించారు.

పెళ్లి నుంచి విడాకులు: ఇక రీతూ పర్సనల్​ వివరాలకు వస్తే.. చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహజీవనం చేసిన రీతూ, ఆ తరువాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం విడాకులకు అప్లై చేశారు. ఓ టీవీ షోలో ఈ విషయాలను రీతూనే వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే.. "శ్రీకాంత్ నేనూ భార్యాభర్తలమే. అది ఒకప్పుడు. అతనితో పెళ్లైంది. 2022లో రిలేషన్​షిప్‌లో ఉన్నాం. ఆరు నెలలు కాపురం చేసిన తరువాత మేం విడిపోయాం. అప్పటి నుంచి రిలేషన్​షిప్ కట్ అయ్యింది. దాని గురించి ఎక్కువ మాట్లాడటానికి కూడా లేదు. ఎందుకంటే మా ఇష్యూ కోర్టులో ఉంది. ఇద్దరం కలిసి కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నాం. విడాకులు అప్లై చేసి దాదాపు ఏడాదిన్నర అయ్యింది. పరస్పర అంగీకారంతో విడాకులు జరగాలి కాబట్టి, అది ఇంకా కాలేదు. ప్రస్తుతం కోర్టులో ఇష్యూ నడుస్తుంది. విడాకులు తీసుకోవడానికి నేను ఒప్పుకున్నాను కానీ, అతను ఒప్పుకోలేదు. మాటలు జరుగుతున్నాయి. అతను విడాకులు కావాలన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను విడాకులు కావాలంటే అతను ఒప్పుకోవడం లేదు. అందరి భార్యాభర్తల మధ్య ఉన్నట్టే మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. వాటి వల్ల ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. ఏడాదిన్నర నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా లేవు. అతన్ని కలిసింది లేదు. చూసింది లేదు" అంటూ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.

ఆ కేసులో విచారణ: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ షోస్, యాంకర్, హీరోయిన్ ఇలా అంచెలంచెలుగా సెలబ్రిటీ ఫేం సంపాదించుకున్న రీతు చౌదరి కొన్ని వివాదాల్లో కూడా ఇరుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో పోలీస్ విచారణను ఎదుర్కొన్నారు.

Bigg boss 9 Day 16 : రాధిక చేతిని వదిలేసిన టిల్లూ! - అదే నిజమైతే పవన్ గేమ్​కు ఫిదా అవ్వాల్సిందే!

Bigg Boss 9 Telugu Wild Cards: 'వైల్డ్​కార్డ్స్'​ లోడింగ్​ - ఆరోజే డోర్స్​ ఓపెన్​!