Bigg Boss 9 Demon Pavan: 'ఉద్యోగం వదిలి అథ్లెటిక్స్ ఆపై బిగ్‌బాస్‌లోకి' - ఈ కామనర్ గురించి తెలుసా?
- మూడో కామనర్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ - డీమన్ పవన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Published : September 25, 2025 at 1:50 PM IST
Bigg Boss 9 Demon Pavan: బిగ్‌బాస్ సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. టాస్కులు, గొడవలు సహా ఇతర విషయాల్లో కామనర్లు, సెలిబ్రిటీల మధ్య ఓ యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ గొడవలు ఉంటే మరోవైపు రీతూ చౌదరి, డిమోన్ పవన్ మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తోంది. హగ్గులు, ఏడిస్తే ఓదార్చడం, ముచ్చట్లు, చాక్లెట్లు షేర్ చేసుకోవడం సహా ఇతర పనులతో ఈ జోడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీతూ గురించి చాలా మందికి తెలిసినా, కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన డిమోన్ పవన్ గురించి తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా బిగ్‌బాస్‌కు సెలెక్ట్ అయ్యాడు సహా ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగు కుర్రాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పవన్ జన్మించాడు. బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ వైపు వెళ్లాడు. చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం సంపాదించాడు. అయితే అది చేసే ఇంట్రస్ట్ లేక అథ్లెటిక్స్‌లో ప్రయత్నించాడు. కానీ, మెరిట్ లేకపోవడంతో ఆ అవకాశం రాలేదు. దీంతో ఓవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాడు.
అగ్నిపరీక్షకు సెలెక్ట్: కెరీర్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే బిగ్‌బాస్ షోలో కామన్ మ్యాన్‌కు అవకాశం అన్న ప్రకటనతో అప్లై చేశాడు. అగ్నిపరీక్షలో ఎదురైనా అన్ని ఫిజికల్ టాస్క్‌ల్లోనూ దుమ్మురేపాడు. అలా టాప్ 13లో చోటు సంపాదించుకున్నాడు. అయితే జ్యూరీ ద్వారా కాకుండా ఓటింగ్‌లో ప్రేక్షకుల నుంచి సపోర్ట్ రావడంతో విజేతగా నిలిచి హౌజ్‌లో మూడో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
పేరుకి వెనుక ఉన్న కథ: బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ రోజున పవన్ ఎంట్రీ కాగానే ఓ టాస్క్ ఇచ్చేశారు కింగ్ నాగ్. దీంతో స్టేజ్ మీదే సీరియల్ యాక్టర్ భరణితో కలిసి పుషప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత పేరుకి వెనుక ఉన్న కథ ఏంటీ అని కింగ్ నాగ్ ప్రశ్నించగా? తనకు జపనీస్ నవలలు చదివే అలవాటు ఉందని, వాటిల్లో పాత్రలు మొదట వీక్‌గా ఉండి తర్వాత బలంగా ఎదిగేలా ఉంటాయని, తాను కూడా జీవితంలో అలాగే ఎదగాలని 'డిమోన్ పవన్' అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. జపనీస్ కామిక్స్‌లో సూపర్ పవర్ సన్ గోకు తన ఫేవరెట్ క్యారెక్టర్ అని వెల్లడించారు.
రెండో వారంలోనే కెప్టెన్‌గా ఛాన్స్: ప్రేక్షకుల ఆదరణతో కామన్‌మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయిన పవన్ మొదటి వారంలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. కానీ రెండో వారం నుంచి ఆటను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ విషయంలో గెలిచి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ ఆటలో గెలిచిన తీరు కరెక్ట్‌గా లేదని, సంచాలక్‌గా ఉన్న రీతూ ఫేవరిజం చూపించిందని బయట ఆడియన్స్‌తో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఫీల్ అయ్యారు. దీంతో కుండ బద్ధలు కొట్టినట్టు విషయాన్ని స్పష్టంగా చెప్పి కెప్టెన్సీ రద్దు చేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ కెప్టెన్సీ రేసులో ఉన్న నలుగురి మధ్య పోటీ నిర్వహించగా ఈసారి పక్కాగా గెలిచి కెప్టెన్సీ సొంతం చేసుకున్నాడు. ఇక కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ఓవైపు బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు రీతూతో ప్రేమాయణం నడుపుతున్నాడు.
Bigg Boss 9 Ritu Chowdhary: "యాంకర్ టూ బిగ్‌బాస్" - ఈ ముద్దుగుమ్మ వివరాలు తెలుసా?

