Aishwarya Rai Cannes 2025 : ఫ్రాన్స్‌లో 78వ కేన్స్ ఫెస్టివల్ సందడిగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యారాయ్ తొలి రోజు శారీలో భారతీయత ఉట్టిపడేలా కనిపించిన ఆమె, రెండో రోజూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె మోడ్రన్ ఔట్ఫిట్లో కనిపించి భారతీయ సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చారు. భగవద్గీత శ్లోకంతో ఉన్న తన డ్రెస్ ధరించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మనసుల్ని దోచుకున్నారు
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. ఐశ్వర్య ధరించిన డ్రెస్‌కు ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు. ఆ బనారసీ కేప్‌పై భగవద్గీతలోని ‘'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అనే శ్లోకాన్ని చేతితో సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేశారు' అని చెప్పారు. దీంతో ఈరోజు ఐశ్వర్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, భగవంతుడు అందించిన అమూల్య సంపద భగవద్గీత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఐశ్వర్య రెండో రోజు లుక్స్‌పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే భగవద్గీత ఇటీవల యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కించకుంది. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం కోసమే ఐశ్వర్య ఈ డ్రెస్ ధరించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సిందూరంతో మెరిశారు
మొదటి రోజు కూడా ఈ కేన్స్ క్వీన్ తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్నేళ్లుగా కేన్స్‌లో మెరుస్తున్న ఈ భామ ఈసారి భారతీయత ఉట్టిపడేలా, చీరకట్టుతో నుదుటిన సిందూరం పెట్టుకొని సినీప్రియులనే కాదు భారతీయులందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. మరో వైపు హీరో సిద్దార్థ్ సతీమణి అదితిరావు హైదరీ కూడా నుదుట సిందూరం ధరించి అందరినీ దృష్టినీ ఆకర్షించారు. ఈ ఫొటోలను సిద్ధార్థ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కేన్స్‌లో 'సిందూరం'తో ఐశ్వర్య రాయ్ సందడి- పవర్ఫుల్ లుక్స్‌తో ఆ రూమర్స్‌కు చెక్!