ETV Bharat / entertainment

'బాహుబలి', 'పుష్ప' హిట్​ సినిమాలు కాదు- ఆడియెన్స్​కు దిక్కు లేక చూశారు!: బాలీవుడ్ డైరెక్టర్ - SOUTH HITS IN BOLLYWOOD

'బాహుబలి', 'పుష్ప' సినిమాలపై బాలీవుడ్ డైరెక్టర్ హాట్ కామెంట్స్

Bahubali Pushpa
Bahubali Pushpa (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2025 at 3:53 PM IST

2 Min Read

Anant Mahadevan On South Hits : భారతీయ సినీ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత టాలీవుడ్ సినిమాలకు హిందీలో బాగా ఆదరణ లభిస్తోంది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' హిందీలో రికార్డు స్థాయి వసూళ్లతో భారీ విజయం దక్కించుకుంది. అయితే బాలీవుడ్​లో సౌత్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ పట్ల నేషనల్ అవార్డ్ విన్నర్ స్టార్ డైరెక్టర్ అనంత్ మహదేవన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో 'బాహుబలి', 'పుష్ప' సినిమాలు భారీ విజయాలు కావని అన్నారు.

ఇటీవల అనంత్ ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సౌత్ సినిమాలకు బాలీవుడ్​లో దక్కుతున్న ఆదరణ గురించి మాట్లాడారు. మరీ ముఖ్యంగా 'బాహుబలి', 'పుష్ప' సినిమాల గురించి కీలక కామెంట్స్ చేశారు. అయితే ప్రేక్షకులకు మరో ఛాయిస్ లేకపోవడం వల్లే ఆ సినిమాలు చూశారని అభిప్రాయపడ్డారు.

'గతంలో బాలీవుడ్​లో మసాలా సినిమా (యాక్షన్, కామెడీ, రొమాన్స్​లాంటి అన్ని జానర్​ల మేళవింపు)లు ఎక్కువగా తీసేవారు. ఇప్పుడు సినిమాలు కాస్త భిన్నంగా ఉంటున్నాయి. దీంతో ప్రేక్షకులకు మరో ఛాయిస్ లేక 'బాహుబలి', 'పుష్ప' వంటి సినిమాలు చూస్తున్నారు. అందువల్లే అవి విజయవంతం అయ్యాయి. అయితే పుష్పకు మంచి వసూళ్లు వచ్చినంత మాత్రనా అది మంచి సినిమా కాదు' అని అనంత్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కాగా, గతేడాది రిలీజైన 'పుష్ప 2' వసూళ్లలో ప్రభంజనం సృష్టించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు నార్త్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.1800 (గ్రాస్) వసూళ్లు సాధించింది. ఒక్క హిందీలోనే రూ.600+ కోట్ల నెట్ కలెక్షన్లు వసూల్ చేసింది. ఇక 2017లో విడుదలైన ప్రభాస్- రాజమౌళి బాహుబలి కూడా మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమా కూడా వరల్డ్​వైడ్​గా రూ.1300 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే ఇంతటి భారీ విజయాలు దక్కించుకున్న ఇలాంటి సినిమాల పట్ల అనంత్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

గ్లోబల్ లెవెల్​లో 'పుష్ప' క్రేజ్- ఆ మ్యాచ్​ మధ్యలో 'పీలింగ్స్' పెర్ఫార్మెన్స్

నెట్​ఫ్లిక్స్​లో నయా రికార్డు - ఏడు దేశాల్లో టాప్‌ మూవీగా! - గ్లోబల్​గానూ 'పుష్ప 2' తగ్గేదే లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.