Allu Arjun-Atlee Poster : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు మంగళవారం సస్పెన్స్ వీడింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా మూవీ కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు అదే పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ పోస్టర్ హాలీవుడ్ సినిమా పోస్టర్ కాపీలా ఉందని, అట్లీ కాపీ చేశారని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2021లో వచ్చిన హాలీవుడ్ 'డూన్' మూవీ పోస్టర్, బన్నీ- అట్లీ మూవీ పోస్టర్‌కు చాలా పోలికలు ఉన్నాయని అంటున్నారు.
#AA22xA6 MEETS Dune 🥶
— Pan India Review (@PanIndiaReview) April 8, 2025
The International Standards so High that it is already giving competition 🤯🫡#AlluArjun #AA22 pic.twitter.com/Y962XCy0zi
దీనిపై ఇంకా మేకర్స్ రెస్పాండ్ అవ్వలేదు. అయితే గతంలో కూడా అట్లీపై ఇలాంటి విమర్శలు వచ్చాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలను వేరే చిత్రాల నుంచి కాపీ చేశారని వార్తలు వచ్చాయి. అయితే వేరే సినిమాల నుంచి కాపీ చేయనని, కానీ వాటి నుంచి ప్రేరణ పొందొచ్చని గతంలో ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాత్రం చెప్పారు.
హాలీవుడ్ తరహాలో విజువల్స్
కాగా, 'AA 22 x A6' వర్కింగ్ టైటిల్‌తో బన్నీ- అట్లీ సినిమా తెరకెక్కనుంది. బన్నీకి హీరోగా ఇది 22వ సినిమా కాగా, అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఆరో చిత్రం. సినిమాలో నటించనున్న నటినటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ వివరాలు షేర్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చూపించారు. అభిమానుల ఊహకు అందని రీతిల సినిమా ఉండనుందని తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడనున్నారు.
అందుకోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను సంప్రదించారు. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉండనున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్‌కు స్క్రీన్ టెస్ట్ చేసిన విజువల్స్ ఇందులో చూపించారు. వీడియో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని సన్ పిక్చర్స్ ప్రకటించింది.