Pushpa 2: The Rule Shooting UPdate : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప 2 : ది రూల్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను మూవీ టీమ్ ప్రకటించింది. పుష్ప 2 ఫస్ట్ హాప్ ఫుల్ ఫైర్‌తో పూర్తైనట్లు పేర్కొంది. దీంతో ఫస్ట్ హాఫ్‌కు సంబంధించి డబ్బింగ్, వీఎఫ్‌క్స్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తైనట్లు సమాచారం. అలానే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుపాను సృష్టించి చరిత్రను లిఖించడానికి పుష్ప వస్తున్నాడు అని మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. భారతీయ సినిమాకు ఇదొక కొత్త అధ్యాయం. డిసెంబరు 6, 2024 పుష్ప: ది రూల్ అంటూ రాసుకొచ్చింది.
కాగా, 'పుష్ప : ది రైజ్' ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగాను జాతీయ అవార్డును అందుకున్నారు. దీంతో పుష్ప 2కు మరిన్ని హంగులు జోడించి సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి.
పార్ట్ -3పై నో క్లారిటీ - తొలి భాగానికి మించి పుష్ప 2 ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెబుతున్నారు. మొదటి భాగంలో మిగిలిపోయిన పసు ప్రశ్నలకు రెండో భాగంతో సమాధానం ఇవ్వనున్నారు. అలానే పుష్ప 2 క్లైమాక్స్‌లో మూడో భాగానికి లీడ్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. పుష్ప 3 ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుకుమార్, అల్లు అర్జున్‌కు వేరే కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల మూడో భాగాన్ని రెండు మూడేళ్ల తర్వాత తెరకెక్కిస్తున్నారట.
ఇకపోతే పుష్పలో రష్మిక కథానాయికగా నటించింది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్‌లో ఆ సాంగ్ రికార్డ్ - విడుదలకు ముందే పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేస్తోంది. కపుల్ పాట్ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి 250+ మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
'గేమ్ ఛేంజర్' టీజర్‌పై తమన్ పోస్ట్ - ఏంటంటే?
పవన్ కల్యాణ్‌పై బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశంసలు - ఏం అన్నారంటే?