Ajith Dubai Racing video : తమిళ్ సూపర్ స్టార్, పద్మ భూషణ్ అజిత్ కుమార్ దుబాయ్ రేసింగ్‌కు చెందిన ఓ థ్రిల్లింగ్ వీడియో తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. అభిమానులు ముద్దుగా ఏకే అని పిలుచుకునే అజిత్ కుమార్ నటుడిగానే కాదు, రేసర్‌గానూ అదరగొడతారు. రైఫిల్ షూటింగ్‌లోనూ ఆయన ఆసక్తి ఎక్కువ. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన '24హెచ్ దుబాయ్ కారు రేసింగ్'లో పాల్గొన్న ఆయన టీమ్ విజయాన్ని సాధించింది. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ రేసింగ్‌కు ముందు సాధన చేస్తున్న సమయంలో అజిత్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే అజిత్ మాత్రం వెనక్కు తగ్గలేదు. అసలైన రేస్‌లో తన సత్తా చాటి, శభాష్ అనిపించుకున్నారు. తాజాగా ఈ రేసుకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇందులో అజిత్, ఆయన టీమ్ దుబాయ్ రేస్‌కు సిద్ధమవడం, అజిత్ కారుకు ప్రమాదం, ఆ తర్వాత ఆయన టీమ్ విజయం సాధించడం లాంటి పలు ఆసక్తికర విజువల్స్‌ను పొందుపరిచారు. ఇంకెందుకు ఆలస్యం ఆ థ్రిల్లింగ్ ఈవెంట్స్‌ను మీరూ చూసేయండి. ఇక అభిమానులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న అజిత్ నటించిన 'పట్టుదల' మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అజిత్ దుబాయ్ కార్ రేసింగ్ వీడియో రిలీజ్- సూపర్ థ్రిల్లింగ్‌గా విన్నింగ్ మూమెంట్స్! - AJITH DUBAI RACING VIDEO
అజిత్ దుబాయ్ 24హెచ్ రేసింగ్ వీడియో రిలీజ్- సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది బాస్!

By ETV Bharat Entertainment Team
Published : January 28, 2025 at 10:47 PM IST