ETV Bharat / entertainment

పాకిస్థాన్​ స్టార్ హీరోయిన్ శ్రీదేవి మూడో కూతురు- ఎవరామె? - SRIDEVI THIRD DAUGHTER

పాపులర్​ పాకిస్థాన్​ హీరోయిన్​- శ్రీదేవీకి మూడో కూతురు!

Sridevi Third Daughter
Sridevi Third Daughter (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 23, 2025 at 6:51 AM IST

2 Min Read

Sridevi Third Daughter : ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన నటి శ్రీదేవి. ఆమె జీవితంలో చాలా అందమైన మలుపులు ఉన్నా, కొన్ని భావోద్వేగ క్షణాలు ఇప్పటికీ అభిమానులను కదిలిస్తూనే ఉంటాయి. అందులో ఒకటి ఆమె నటించిన చివరి సినిమా మామ్ సమయంలో ఏర్పడ్డ అనుబంధం. ఇందులో శ్రీదేవి కూతురిగా నటించిన పాకిస్థాన్​ నటి సజల్ అలీతో ఆమె ఏర్పరుచుకున్న బంధం చాలా స్పెషల్. ఈ క్రమంలో శ్రీదేవి ఆమెను "మూడో కూతురు"గా సంబోధించడమే కాదు, మీడియాకు కూడా అదే తరహాలో పరిచయం చేశారు.

శ్రీదేవి-సజల్ బంధం: 2017లో వచ్చిన మామ్ చిత్రం శ్రీదేవి 300వ సినిమా కావడమే కాకుండా, ఆమె జీవితంలోని చివరి ప్రాజెక్ట్ కూడా. ఇందులో పాకిస్థాన్​ నటి సజల్ అలీ శ్రీదేవి కూతురిగా నటించారు. అయితే సినిమా పూర్తయ్యేలోపు, ఈ ఇద్దరి మధ్య అభిమానం స్నేహంగా మారి చివరికి ఒక తల్లీ కూతుళ్ల బంధంగా మారింది. గతంలోనే మిడియాతో శ్రీదేవి ఈ విధంగా వివరణ ఇచ్చింద. "సజల్ నా మూడో కూతురు నాకు ఇంకో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తోంది" అని చెప్పారు. ఇది పరోక్షంగా జాన్వీ, ఖుషి కపూర్‌లకు మరో సోదరిగా ఆమెను అంగీకరించినట్లు.

శ్రీదేవి ఆఖరి మెసేజ్: ఓ ఇంటర్వ్యూలో సజల్ అలీ మాట్లాడుతూ, శ్రీదేవి చివరిసారిగా తాను మిస్ చేసిన సందేశాన్ని వివరించారు. దుబాయ్‌లో జరిగిన మసాలా అవార్డ్స్‌కి వెళ్లలేకపోయిన సమయంలో శ్రీదేవి సజల్‌కు “ఐ మిస్ యూ బెటా” అనే మెసేజ్ పంపారు. అదే ఆమె చివరిసారి పంపిన సందేశమని సజల్ చెప్పారు. తర్వాత ఇద్దరూ మరో రెండు నెలల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నప్పటికీ, శ్రీదేవి చివరిసారి ఫోన్ చేసినప్పుడు తాను షూటింగ్‌లో ఉండడం వల్ల కాల్ తీసుకోలేకపోయానని, అది తాను జీవితాంతం మరిచిపోలేనంటూ భావోద్వేగంతో చెప్పారు.

పాకిస్తాన్ స్టార్ హీరోయిన్​: సజల్ అలీ 1994లో లాహోర్‌లో జన్మించారు. ఆమె కెరీర్‌ను 15ఏళ్ల వయసులో నాదానియన్ అనే టీవీ షోతో ప్రారంభించారు. మామ్ ఆమె మొదటి హిందీ చిత్రం. ఇది ఇండియాలో ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. సినిమా విజయంతోపాటు, శ్రీదేవి వంటి లెజెండ్‌తో పని చేయడం ఆమె జీవితానికే గొప్ప సందర్భంగా మారింది. ప్రస్తుతం సజల్ పాకిస్తాన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్‌హీరోయిన్‌లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

శ్రీదేవి మరణం తర్వాత: 2018లో శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆ సమయంలో సజల్ మాట్లాడుతూ, "నన్ను నమ్మి ప్రేమించిన రెండో అమ్మను కోల్పోయినట్టుంది. ఇది నా జీవితంలో తల్లిని రెండోసారి కోల్పోయిన భావన" అంటూ తెలిపింది. ఆమె చెప్పిన ఈ మాటలు వారి బంధం ఎంత లోతుగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఈ మాటలు భారత అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. మామ్ సినిమా తెలుగులోనూ మంచి స్పందన పొందింది. ఈ సినిమాను చూసినవారికి శ్రీదేవి - సజల్ మధ్య నటన మాత్రమే కాదు, తెరపై కనిపించిన ఆ హ్యూమన్ బాండింగ్ కూడా గుర్తుండిపోతుంది. తల్లిగా, కూతురుగా వారి మధ్య తలెత్తిన భావాలు నిజ జీవితంలోనూ మారిపోవడం ఆ అనుబంధానికి జీవం పోసింది.

మూడేళ్లకే తెరంగేట్రం- గ్లామర్ కోసం తిండి మానేసిన నటి- కట్​ చేస్తే దేశంలోనే పాపులర్ హీరోయిన్!

లవ్ ప్రపోజల్​కు శ్రీదేవి ఇంటికెళ్లిన రజనీకాంత్- ఆ తర్వాత ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.