Kushboo About Pawan Kalyan, Mahesh Babu : నటి ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పుడు కూడా ఆమె ఓ వైపు సినిమాలు, మరోవైపు పలు టెలివిజన్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగ ఆమె ఓ చిట్‌చాట్‌లో పాల్గొని, ఆసక్తికర విషయాలను చెప్పారు. తన పేరెప్పుడు మార్చుకున్నారు? టాలీవుడ్ హీరోల్లో ఎవరంటే అభిమానం? మహేశ్, పవన్ సినిమాల్లో అవకాశం వస్తే ఎవరితో కలిసి నటిస్తారు? వంటి విషయాలను చెప్పుకొచ్చారు.
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఈ పేరును మార్చుకోవడంపై మాట్లాడుతూ - "నఖత్, ఖుష్బూ రెండింటికీ అర్థం ఒకటే. అందుకే బాల నటిగా అరంగేట్రం చేసినప్పుడు నా పేరు మార్చారు." అని చెప్పుకొచ్చారు.
ఖుష్బూపై అభిమానంతో తమిళనాడులో ఫ్యాన్స్ ఇడ్లీ, దోశకు ఖుష్బూ ఇడ్లీ, ఖుష్బూ దోశ పేర్లు పెట్టి ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలానే ఆమె కోసం గుడి కూడా కట్టించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ - "ఫ్యాన్స్ గుడి నిర్మించిన సమయంలో నాలుగు షిఫ్టుల్లో పని చేసేదాన్ని. అప్పుడు బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నాను. అప్పుడు తమిళం చదవడం కూడా నాకు రాదు. ఆ తర్వాత దానిపై స్పందించాలనుకున్నా అది కుదరలేదు. ఎందుకంటే అప్పటికే ఆలస్యమైందని వదిలేశాను." అని చెప్పారు.
వెంకటేశ్, నాగార్జునలో వెంకీ అంటే తనకు అభిమానమని, వెంకటేశ్, కమల్ హాసన్, మోహన్ బాబులో కమల్ హాసన్ అంటే అభిమానమని చెప్పిన ఖుష్బూ కమల్ హాసన్, చిరంజీవిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం కష్టమని పేర్కొన్నారు.
'పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఈ ఇద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరికి డేట్స్ ఇస్తారు?' అని అడగగా, ఏ సినిమాలో తన పాత్ర బాగుంటుందో, మంచి రెమ్యునరేషన్ ఇస్తారో అందులో నటిస్తానని చెప్పారు ఖుష్బూ.
చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ - "పవన్ కల్యాణ్ మితభాషి. మంచి వ్యక్తిత్వం. 'అజ్ఞాతవాసి' చిత్రీకరణ సమయంలో తప్ప మరోసారి ఎప్పుడూ కలవలేదు. చిరంజీవితో కలిసి స్టాలిన్‌లో నటించాను. ప్రతి ఏడాది జరిగే రీ యూనియన్ వేడుకలో కలుసుకుంటుంటాం. మెసేజ్‌లు చేసుకుంటుంటాం. కమర్షియల్ తప్ప రొమాంటిక్ చిత్రంలో చిరుతో కలిసి నటించలేదు." అని చెప్పుకొచ్చారు.
దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ - "రాజమౌళి సినిమాలు గ్రాండియర్‌గా ఉంటాయి. త్రివిక్రమ్ సరదాగా ఉంటారు. కమర్షియల్ చిత్రాలు చక్కగా తెరకెక్కిస్తారు." అని తెలిపారు.
చిరు, ఉపాసన కాకుండా రామ్ చరణ్ ఎవరికి భయపడతారంటే? - Game Changer Ram Charan