ETV Bharat / entertainment

పాకెట్ మనీ కోసం మోడలింగ్ - తొలి సినిమాతో సూపర్ సక్సెస్​- ఆ ఘటన వల్ల రీ ఎంట్రీలో అదుర్స్ - Actor Survived Major Accident

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 10:44 PM IST

పలు హిట్ సినిమాల్లో నటించి 90వ దశకంలో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు ఓ హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగానూ బాగా పాపులర్ అయ్యారు. కానీ ఆయన లైఫ్​లో అనుకోకుండా జరిగిన ఓ ఘటన వల్ల సినిమాలకు దూరమై మళ్లీ ఇప్పుడు రీఎంట్రీలో అదరగొడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

ACTOR SURVIVED MAJOR ACCIDENT
ACTOR SURVIVED MAJOR ACCIDENT (Getty Images)

Actor Survived Major Accident Runs Business Successfully : 90స్​లో ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. మణిరత్నం సినీ ఇండస్ట్రీకి అందించిన స్టార్ హీరోల్లో ఈయన ఒకరు. కొంతకాలం వరకూ సినిమాల్లో రాణించిన ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్​లో అదరగొడుతున్నారు. కాలేజీ రోజుల్లోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళ్లి కొన్ని ప్రకటనలు చేసిన ఆయన తన కెరీర్​లో ఎన్నో మర్చిపోలేని మైల్​స్టోన్స్ దాటారు. ఆయనే హీరో అరవింద స్వామి.

అరవింద స్వామి అంటే అందరికీ ఠక్కున్న గుర్తురాకపోవచ్చు. కానీ 'రోజా' సినిమా హీరో అంటే ఆ మూవీ చూసిన ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన క్యారెక్టర్​లో నేచురల్​గా నటించి అంతలా పాపులరయ్యారు ఆయన. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తున్న సమయంలో దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దృష్టిలో పడ్డారు. అలా 'దళపతి'తో సినీ తెరంగేట్రం చేసి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన 'రోజా'తో యూత్ ఐకాన్​గా మారిపోయారు. ఎంతో మంది ఆయన స్టైల్​ను ఫాలో అయినవారూ కూడా ఉన్నారు.

ఇండస్ట్రీకి దూరమై, బిజినెస్​లో రాణించి
అయితే ఫేమ్ వచ్చిన కొన్నాళ్లకే అరవింద్ స్వామి ఇండస్ట్రీకి దూరమయ్యారు. తన తండ్రి వ్యాపార బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారించారు. కానీ విధి మరోలా తలచింది. హఠాత్తుగా అరవింద్ స్వామికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆయన పాక్షిక పక్షవాతంతో కొన్నేళ్లు బాధపడ్డారు. ఇంటికి పరిమితమయ్యారు. ఆ తర్వాత కోలుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతకీ అరవింద్ ప్రారంభించిన బిజినెస్ ఏది? ఆయన ఆస్తి ఎంతో తెలుసా?

ప్రమాదం నుంచి కోలుకున్నాక అరవింద్ స్వామి తండ్రి వ్యాపార బాధ్యతలను చూసుకుంటూనే మ్యాక్సిమస్ అనే సంస్థను నెలకొల్పారు. ఆ కంపెనీ ఎవరికి, ఎక్కడ, ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్ చేస్తుంది. ఒక కన్సల్టెన్సీ సంస్థలా పనిచేస్తుంది. దాన్ని ఓ రేంజ్ లో అరవింద్ స్వామి డెవలర్ చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఒక్కదాని విలువే దాదాపు రూ.3500 కోట్లని తెలుస్తోంది. దీంతో అరవింద్ స్వామి సక్సెస్​ఫుల్ హీరోగానే కాకుండా సూపర్ సక్సెస్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మ్యాక్సిమస్ కంపెనీనే కాకుండా మరిన్ని రూ.కోట్ల ఆస్తులు అరవింద్ స్వామికి ఉన్నట్లు తెలుస్తోంది.

రీఎంట్రీలో అదుర్స్
దాదాపు రెండు దశాబ్దాలపాటు సినిమాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వామి మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'ధ్రువ' సినిమాలో విలన్​గా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి పరిచయమయ్యారు. అలాగే 2021లో వచ్చిన 'తలైవి'లో ఎంజీ రామచంద్రన్ పాత్రలో మెరిశారు. ఇలా రీఎంట్రీలో అరవింద్ స్వామి అదరగొడుతున్నారు.

ఫస్ట్ డే '0' టికెట్ సేల్​- మూవీ మాత్రం సూపర్ హిట్- ఏ సినిమానో తెలుసా? - First Day Zero Tickets Sold Movie

ఈ రిచెస్ట్ యాక్టర్​ ఆస్తి రూ.11,000 కోట్లు - షారుక్​, టామ్ క్రూయిస్ మాత్రం కాదు! - Richest Actor In World

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.