Actor Sriram Arrested : తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్ కేసులో ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్‌ను చెన్నై నుంగంబాక్కం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం, సేలంలోని సంగకిరికి చెందిన ప్రదీప్ కుమార్ (38), ఆఫ్రికాలోని ఘనాకు చెందిన జాన్ (38)లను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రదీప్ కుమార్ బెంగళూరులో నివసిస్తున్న నైజీరియన్ జెరిక్, ఘనాకు చెందిన జాన్ నుంచి కొకైన్ కొనుగోలు చేసి చెన్నైలోని అతడి స్నేహితుడు, రాజకీయ నేత ప్రసాద్‌తో సహా అనేక మందికి విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ప్రదీప్ స్నేహితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం పోలీసులు అతడిని విచారించగా, పలువురు నటులు, నటీమణులకు డ్రగ్స్ అమ్మినట్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ప్రసాద్ సెల్ ఫోన్‌ను పరిశీలించగా, నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ తో అతనికి పరిచయాలు ఉన్నాయని తేలింది. దీంతో చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ పోలీసులు శ్రీరామ్ ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అతను డ్రగ్స్ వినియోగించారో? లేదో? నిర్ధారించడానికి రక్త నమూనాలను తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు సమాచారం.
ఫోర్జరీ కేసులో సినీ నటుడు అరెస్ట్
'పూరీ తీసిన ఆ సూపర్ హిట్ సినిమాలో హీరో నేనే అన్నారు.. కానీ...'