ETV Bharat / entertainment

NTR లైనప్- 'దేవర 2' ఎప్పుడో చెప్పేసిన కల్యాణ్ రామ్​ - KALYAN RAM ON DEVARA

ఎన్టీఆర్ లైనప్​పై కల్యాణ్ రామ్ క్లారిటీ- ఏయే సినిమా ఎప్పుడు వస్తుందంటే?

Devara 2
Devara 2 (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 15, 2025 at 11:02 AM IST

2 Min Read

Kalyan Ram On Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆడియెన్స్​ స్వీక్వెల్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే దీని సీక్వెల్​ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. రీసెంట్​గా ఎన్టీఆర్ ఓ ఈవెంట్లో 'దేవర 2' ఉంటుందని అన్నారు. కానీ ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు ఎన్టీఆర్ లైనప్​ కూడా ఫుల్ బిజీగా ఉంది. ఆయన చేతిలో ప్రస్తుతం 'వార్ 2', 'NTRNeel', 'దేవర 2' ఉన్నాయి. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్​ దిలీప్​తోనూ ఓ సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్​ భారీ బడ్జెట్​తో తెరకెక్కనుంది. అయితే ఇందులో అన్నింటికంటే ముందు 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏ సినిమా విడుదల అవుతుందో? ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.

అయితే ప్రశాంత్​ నీల్ ప్రాజెక్ట్​ తర్వాత, ఎన్టీఆర్- నెల్సన్​ సినిమా ప్రారంభం అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో 'దేవర 2' ఎప్పుడు సెట్స్​ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లైనప్​పై నటుడు కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ సినిమా కంటే ముందే 'దేవర 2' వస్తుందని కల్యాణ్ రాణ్ అన్నారు. ప్రశాంత్ మూవీ పూర్తవ్వగానే 'దేవర 2' సెట్ మీదకు వెళ్తుందని స్పష్టం చేశారు.

ఈ లెక్కన 2026లోనే దేవర 2 సెట్స్​ మీదకు వెళ్తుందన్న మాట. ఈ సినిమా సీక్వెల్​కు సంబంధించి కూడా కొన్ని సీన్స్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాదే ఇది కంప్లీట్ అయ్యి, 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే నెల్సన్ మూవీ పట్టాలెక్కనుందన్న మాట!

కాగా, 'వార్ 2' దాదాపు పూర్తవ్వడంతో, మరో వారంలోనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్​లో తారక్ అడుగుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్​ రెగ్యులర్ షూటింగ్​లో తారక్ పాల్గొననున్నారు. 2026 జనవరిలో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.

'అన్నా, నీ కోసమే తెలుగు నేర్చుకున్నా'- తారక్​తో జపాన్​ ఫ్యాన్​ క్రేజీ మూమెంట్

జపాన్​లో 'దేవర' మేనియా- షురూ అయ్యేది ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.