ETV Bharat / education-and-career

ఉద్యోగ సాధనలో ఉన్నారా? - మీలో ఈ స్కిల్స్​ ఉంటే జాబ్​ పక్కా మీకే! - LESS TECHNICAL SKILLS IN YOUTH

నైపుణ్య వికాసంతోనే భవితకు బాటలు - టెక్నాలజీ నేర్చుకుంటే విజ్ఞాన నైపుణ్యం పెరుగుతుందంటున్న నిపుణులు - ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడలేకపోవడం కూడా యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణమే

CAMPUS RECRUITMENT
TECHNICAL SKILLS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 28, 2025 at 2:05 PM IST

2 Min Read

Technical Skills in Telangana Youth : యువత కేవలం చదువుకే పరిమితమవుతూ టెక్నికల్ స్కిల్స్‌ కొరవడి ఉద్యోగ సాధనలో తడబడుతున్నారు. నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం లేక రాణించలేకపోతున్నారు. ఆచరణాత్మక అనుభవం అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని టాస్క్‌ శిక్షణ నిర్వాహకులు, ప్రొఫెసర్లు సూచిస్తున్నారు.

కారణాలివే

  • ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడలేకపోవడంతో ఇంటర్వ్యూలో తడబడటం.
  • వ్యక్తిగత సామర్థ్యాలు, టీమ్​ను నడిపించగల నైపుణ్యం, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కొరవడటం.
  • సంస్థ యాజమాన్యాలు ఎలాంటి స్కిల్స్‌ను అభ్యర్థుల నుంచి ఆశిస్తున్నాయో యువత గుర్తించకపోవడం.
  • ఐటీ ఉద్యోగుల పాత్ర, డ్యూటీలు, తదితర అంశాలను వీక్షించేందుకు కాలేజీలు సరైన ప్రోత్సాహకం అందించకపోవడం.

ఇవి కీలకం

  • ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవసరమైన టూల్స్‌, సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుంటేనే విజ్ఞాన నైపుణ్యం పెరుగుతుంది.
  • పరిశ్రమలను క్షేత్ర స్థాయిలో సందర్శిస్తే వాటికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
  • ప్రాంగణ నియామకాల్లో ముఖాముఖిలకు ముందు ఆయా సంస్థల గురించి వివరంగా తెలుసుకోవాలి.
  • ఇంటర్న్‌షిప్, ఇండస్ట్రీ ప్రాజెక్టులకు తగినంత ఆచరణాత్మక అనుభవం పొందాలి.

65 వేల మంది విద్యార్థులు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 85 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ కళాశాలల్లో దాదాపుగా 65 వేల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు తీసుకోవడం తప్ప అడ్వాన్స్‌ సాంకేతిక నైపుణ్యాలను నేర్పించడంలేదనే విమర్శలున్నాయి. దీనికి విద్యార్థుల గైర్హాజరు కూడా ముఖ్య కారణంగా ఉంది. 67 కళాశాలల్లో ఇప్పటివరకు 16,997 మంది విద్యార్థులు మాత్రమే టాస్క్‌ ట్రైనింగ్ సెంటర్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

"ముందుగా విద్యార్థులు ఎన్నుకున్న కోర్సు కాకుండా భవిష్యత్తులో సాధించబోయే ఉద్యోగ అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రాజెక్టుల ద్వారా పని అనుభవాన్ని మంచిగా పెంచుకోవాలి. సిలబస్‌తో పాటు డిమాండ్‌ ఉన్న పరిశ్రమలకు అవసరమైన స్కిల్‌ను నేర్చుకోవాలి. భావ వ్యక్తీకరణను తెలిపే వారికి పెద్ద పెద్ద సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోవద్దు" - శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మంథని జేఎన్టీయూహెచ్

"నేను బీటెక్‌ చదువు పూర్తి చేశా. టాస్క్‌ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నా. ఉద్యోగ నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, మెలకువలపై శిక్షణ ఇచ్చారు. ముఖాముఖిలో ధైర్యంగా ఎదుర్కొన్నా. ఓ సంస్థలో ప్రస్తుతం ఏడాదికి రూ .6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా" - కావ్యశ్రీ, పెద్దపల్లి జిల్లా

ఎక్కువ శాలరీతో ఐటీ జాబ్​ పొందాలా? - ఈ టిప్స్ పాటిస్తే మీరు కోరినంత ఇస్తారు!

IIT - NIT - IIIT వీటి మధ్య తేడా ఏంటి? - అడ్మిషన్ ఎలా పొందాలి? - ఎందులో ఫీజు తక్కువ??

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.