Women Head Constables Jobs in CISF : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో (హాకీ విభాగం) 30 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను ప్రకటించింది. కేవలం మహిళలు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ, శాశ్వత విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.
- ఇంటర్ పాసై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ హాకీ పోటీలకు ప్రాతినిథ్యం వహించాలి. 01-01-2023 నుంచి 30-05-2025 వరకు జరిగిన క్రీడలు, ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న వారు అప్లై చేసుకోవచ్చు.
- యువజన క్రీడల మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- స్పోర్ట్స్ సర్టిఫికెట్‌తో పాటుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌ను కూడా జత చేయాలి.
వయసు : 01.08.2025 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్ జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 45 సంవత్సరాలు.
వేతన శ్రేణి : నెలకు రూ.25,500-81,100.
ఎంపిక విధానం : రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- రెండో దశలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
- బయో మెట్రిక్ రిజిస్ట్రేషన్ తరువాత ట్రయల్/ ఫిజికల్ స్టాండర్డ్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు అంగీకారాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలి.
- ఆ తరువాత హాకీలో ట్రయల్ టెస్ట్‌ను ఇరవై మార్కులకు నిర్వహిస్తారు. దీంట్లో పది కనీసార్హత మార్కులు సాధించాలి.
- దీంట్లో అర్హత సాధించిన వారిని ప్రొఫిషియెన్సీ టెస్టుకు ఎంపిక చేస్తారు. దీనికి నలభై మార్కులు. కనీసార్హత మార్కులు ఇరవై.
- ఇవి సాధించినవారిని ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎత్తు 153 సెం.మీ. ఉండాలి.
- చివరిగా వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
- గమనించాల్సినవి : గడువు తేదీ నాటికి తగిన విద్యార్హతలు, సంబంధిత ధ్రువపత్రాలు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి.
- ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను మాత్రమే దరఖాస్తులో రాయాలి.
- అర్హులైన అభ్యర్థులకు ప్రొఫిషియన్సీ టెస్ట్, ట్రయల్‌టెస్ట్, పీఎస్‌టీ, ధ్రువపత్రాల పరిశీలనకు అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. వీటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పోస్టు ద్వారా పంపరు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఈ నెల 30
పూర్తి వివరాలకు https://cisfrectt.cisf.gov.in/ వెబ్‌సైట్ సంప్రదించగరు.
ఆర్మీ నోటిఫికేషన్ - మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం - నెలాఖరు వరకే ఛాన్స్
నిరుద్యోగులకు శుభవార్త - ఐడీబీఐలో జాబ్ నోటిఫికేషన్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?