Courses After Inter mediate : ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేశాయి. మరి, ఆ తర్వాత ఏం చదవాలి? ఎటువైపు వెళ్లాలి? ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఏ వైపు వెళ్తే ఎలాంటి కెరియర్ ఉంటుంది? వంటి డౌట్స్ చాలా మంది విద్యార్థులను వేధిస్తుంటాయి. అలాంటి వారికోసమే ఈ స్టోరీ. ఇంటర్ తర్వాత ఒకటీ రెండు కాదు, ఏకంగా 99 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరి, అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం.
- ఇంటర్మీడియట్లో వారు ఎంచుకున్న గ్రూప్ ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సులను సెలక్ట్ చేసుకోవచ్చు. సివిల్ నుంచి అగ్రికల్చర్ దాకా, ఏరోనాటికల్ నుంచి మైనింగ్ దాకా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- మెడికల్ విషయానికి వస్తే ఎంబీబీఎస్ నుంచి బీడీఎస్ వరకు, బీహెచ్ఎంఎస్ నుంచి బీపీటీ వరకు పలు రకాల కోర్సులు ఉన్నాయి. ఇంకా ఫార్మా, పారామెడికల్ అంటూ ఎన్నో అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.

బిగ్ న్యూస్ - ఇక నుంచి ఆ ఇంటర్ కోర్సు, భాషా సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు!
- ఇంజనీరింగ్, మెడిసిన్ వద్దనుకునే సైన్స్ స్టూడెంట్స్ డిగ్రీ చేసుకోవచ్చు. వీరితోపాటు హెచ్ఈసీ, కామర్స్ విద్యార్థులకు కూడా బోలెడు అవకాశాలా ఉన్నాయి. సోషల్ స్టూడెంట్స్‌కు బీఏ విభాగంలోనే చాలా కోర్సులు ఉన్నాయి. హెచ్ఈపీ నుంచి సోషియాలజీ వరకు తొమ్మిది రకాల గ్రూపులు ఉన్నాయి. సైన్స్ స్టూడెంట్స్‌కు 13 కోర్సులు ఉన్నాయి. కామర్స్ వాళ్లకు కామర్స్ వాళ్లకు నాలుగు రకాలు ఉన్నాయి. ఇంకా డ్యుయల్ డిగ్రీలు, అదర్ డిగ్రీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
- టీచింగ్ వైపు వెళ్లాలనుకునే వారికి కూడా ఛాన్సు ఉంది. D.Ed, UDPED, ECCEd అవకాశాలు ఉన్నాయి. లేదంటే ICWA, CS, CA, CPT వంటి ప్రొఫెషనల్ కోర్సులవైపు కూడా వెళ్లొచ్చు. ఇవేవీ కాకుండా భారత దేశానికి రక్షణ రంగంలో సేవలు అందించాలనే ఉత్సాహం ఉంటే Army, Navy, Air Force వంటి విభాగాల్లోకి కూడా వెళ్లొచ్చు.
- వీటితోపాటుగా Foreign Languages, Journalism, Hotel Management వంటి డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. Fashion, Interior వంటి డిజైనింగ్ వైపు కూడా వెళ్లొచ్చు. ఆసక్తి ఉన్నవారు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టొచ్చు. Direction, Cinematography, Action వంటి పలు విభాగాల్లో కూడా చేరి చదువుకోవచ్చు. మొత్తం ఎన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయో పూర్తిగా తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన చార్ట్‌ను పరిశీలించొచ్చు.
ఒక్క మార్కు 1.85 లక్షల మంది విద్యార్థులను బలిగొంది
ఎగ్జామ్స్ అయిపోయాయని ఖాళీగా ఉంటున్నారా? - హాలిడేస్‌ను ఇలా ఉపయోగించుకోండి