Which Course Is Better To Do After Graduation : టీచింగ్, లాయర్ వృత్తుల్లో మీకేది ఇష్టం? ఏ రంగంలో మీరు సంతోషంగా ఉంటారు? బోధన నైపుణ్యాలున్నాయా(టీచింగ్ స్కిల్స్)? న్యాయవాద వృత్తిలో రాణించడానికి అవసరమైన సూక్ష్మ పరిశీలన, వాదనా పటిమ, తార్కికంగా ఆలోచించగలిగే సామర్థ్యాలు మీలో ఉన్నాయా? ప్రభుత్వ కొలువులు రాకపోతే జీవితకాలం ప్రైవేటుగా పనిచేయగలరా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేయడం ఉత్తమం.
ఎల్‌ఎల్‌బీ చేస్తే న్యాయవాద వృత్తిలో స్థిరపడే అవకాశం : ఎల్‌ఎల్‌బీ చేస్తే జ్యుడీషియల్ సర్వీసెస్, నోటరీ, లీగల్ అడ్వైజర్, ప్రభుత్వ రంగ/ ప్రైవేటు సంస్థల్లో పనిచేయవచ్చు. ప్రభుత్వ కొలువు పొందలేనట్లయితే లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేసుకొనే వెసులుబాటుంది. భావప్రకటన సామర్థ్యం, ఓపిక, వినగలిగే నైపుణ్యాలతో పాటు విశ్లేషణ, రాత నైపుణ్యం, న్యాయ చట్టాలపై సమగ్ర అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే సామర్థ్యం, నైతికత, నిబద్ధత, నెట్‌వర్కింగ్, సమయ నిర్వహణ లాంటి స్కిల్స్‌ను పెంచుకోవాలి. న్యాయవాదిగా రాణించాలంటే చాలా పోటీని తట్టుకోవాలి. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు ఎల్‌ఎల్‌బీ కోర్సును అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.
బోధనారంగంలోకి వెళ్లాలంటే? : టీచింగ్ స్కిల్స్, సృజనాత్మకత, కమ్యూనికేషన్, ప్రేరణతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైతికత, సహనం లాంటి లక్షణాలుంటే బోధన రంగంలో మీరు రాణించవచ్చు. బీఈడీ విద్యార్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో, జవహర్ నవోదయ, ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాకపోతే ప్రైవేటు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా బోధనావకాశాలు పొందవచ్చు. ప్రతిఏటా నిర్వహించే ఎడ్‌సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి బీఈడీలో అడ్మిషన్ పొందవచ్చు.
ఆసక్తి, నైపుణ్యాలు ఉన్న రంగంలో : మీరు ఒక వేల పీజీ చేసి ఉంటే ఆ సబ్జెక్టులో పీహెచ్డీ చేసి సంబంధిత విభాగంలో ప్రొఫెసర్‌గా స్థిరపడొచ్చు. ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేసి లా కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో చేరొచ్చు. జర్నలిజం, ఎల్‌ఎల్‌బీతో పాటు బీఎడ్ ఈ కోర్సులు అన్నీ ఉపాధికి అవకాశం ఉన్నవే. ఆసక్తి, నైపుణ్యాలు ఉన్న రంగంలో స్థిరపడటానికి అవసరమైన కోర్సును చదివే ప్రయత్నం చేయండి.
టెన్త్ తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నారా? - ఈ కోర్సు చేస్తే మంచి ఫ్యూచర్
డిప్లొమా చేసిన ఇంజినీరింగ్ ఉద్యోగులకు గొప్ప అవకాశం - ఏప్రిల్ 15 వరకే ఛాన్స్ - త్వరపడండి