Job Opportunities in Solar Energy : గలగల పారే సెలయేళ్లు వడివడిగా సాగే నదులు, చల్లగా వీచే పవనాలు, ప్రకృతి సోయగాలకు సంకేతాలు మాత్రమే కాదు, అపార సంపద సృష్టికివి నిలయాలు, సరికొత్త ఉద్యోగా మార్గాలు కూడా.
పునరుత్పాదక ఇంధన వనరులైన జల, గాలి, సౌర విద్యుత్ పరిశ్రమల ద్వారా ప్రస్తుతం పది లక్షల మందికి ఉపాధి కలుగుతోంది. ఒక్క సౌర విద్యుత్ పరిశ్రమతో 90 గిగా వాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా మూడు లక్షల మందికి ఉపాధి లభించనుంది. మరో ఐదేళ్లకు దీన్ని 500 గిగా వాట్లకు పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా మరో నాలుగింతల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
- జలవిద్యుత్ పరిశ్రమ ద్వారా 4 లక్షల 50 వేల కొలువులు వచ్చాయి.
- పవన విద్యుత్ పరిశ్రమ 52 వేల ఉద్యోగాలు కల్పించింది. వీటిలో ఎక్కువ నిర్వహణ పరమైనవే.
- సెమీ కండక్టర్‌ను వినియోగించి సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడాన్నే సోలార్ ఫొటో వోల్టాయిక్ (పి.వి.) ఎనర్జీగా పరిగణిస్తారు. మనదేశంలో ఎక్కువగా ఈ సాంకేతికతను ఉపయోగించే సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.
- సూర్యరశ్మి నేరుగా వచ్చి సౌర పలకలపై పడినప్పుడు ఫొటోవోల్టాయిక్ ప్రభావం వల్ల డైరెక్ట్ కరెంట్ (డి.సి.) ఉత్పత్తి అవుతుంది. కన్వర్టర్‌ను ఉపయోగించి దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ (ఎ.సి.)గా మారుస్తారు. మనం గృహావసరాలు, వాణిజ్య అవసరాలకు ఎ.సి కరెంట్‌నే ఎక్కువగా వాడుతాం.
ఈ సాంకేతికత తెలుసుకోవడానికి సూక్ష్మంగా ఉన్నప్పటికీ వాణిజ్య అవసరాలకు భారీస్థాయిలో ఉత్పత్తి చేసేటప్పుడు వివిధ దశల్లో సిబ్బంది అవసరమవుతారు. ప్రభుత్వ విధానాలు పరిశ్రమకు అనుకూలంగా ఉండటంటో ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా సోలార్ ప్యానల్స్ నెలకొల్పడం, నిర్వహణలో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు కల్పిస్తున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా సోలార్ పి.వి. ప్యానెల్స్ నెలకొల్పిన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. సౌర విద్యుదుత్పత్తి రీత్యా గత తొమ్మిదేళ్లకాలంలో 26 రెట్లు పెరిగింది.
- అత్యధిక సౌరశక్తి, విద్యుదుత్పత్తిలో టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ దేశంలో అగ్రస్థానంలో ఉంది.
- విస్తారమైన ఎడారి, మైదాన ప్రాంతం ఉన్న రాజస్థాన్ ఏడాదికి 17.8 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తితో మిగిలిన రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో మధ్య ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి.
- కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది. సౌర విద్యుత్తుపై ప్రభుత్వ విధానాల అమలు పర్యవేక్షణ, పునరుత్పాదక ప్రాజెక్టుల పని తీరును పరిశీలించడం ఈ సంస్థ బాధ్యత.
చౌకగా నాణ్యమైన విద్యుత్తునిచ్చే సౌరశక్తి రంగంలో 2030 నాటికి ఇదే వేగంతో వృద్ధి కొనసాగితే కోటీ 60 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ రంగంలో రెండు రకాల ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
చైతన్యమే ఉద్యోగ సాధనకు తొలి మెట్టు. విస్తార అవకాశాలున్న ఇలాంటి రంగాలను గుర్తించి రాబోయే అవకాశాల కోసం ముందుగానే ప్రిపేర్ కావాలి. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
ప్రత్యక్షంగా: సోలార్ ప్యానల్స్ ఫ్యాబ్రికేషన్, ఇన్‌స్టలేషన్, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల నిర్వహణలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
పరోక్షంగా: సోలార్ ప్యానల్స్ సరఫరా వ్యవస్థ, కన్సల్టెన్సీలు, పెట్టుబడి అవకాశాలతో పరోక్షంగా ఉపాధి ఏర్పడుతుంది.
కాసులు కురిపించే కాస్మొటాలజీ కోర్సులు - చదివితే వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే లేదు!
విద్యార్థులకు బంపరాఫర్ - డిగ్రీ చేస్తూనే డబ్బులు సంపాదించుకోండిలా!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్