ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌- రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ! - RRB ALP RECRUITMENT 2025

ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లు అందరికీ గుడ్ న్యూస్‌- రైల్వేలో 9,970 ఏఎల్‌పీ పోస్టుల భర్తీ!

RRB ALP Recruitment
RRB ALP Recruitment (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2025 at 10:51 AM IST

2 Min Read

RRB ALP Recruitment 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్‌. దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పది, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందరూ దీనికి అర్హులే. ఏప్రిల్‌ 12 నుంచి మే 11 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : సికింద్రాబాద్‌, చెన్నై, తిరువనంతపురం, భువనేశ్వర్, బెంగళూరు, భోపాల్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, గోరఖ్‌పూర్, అహ్మదాబాద్, అజ్‌మేర్.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు :

  1. సికింద్రాబాద్- 1,500
  2. చెన్నై- 362
  3. ముంబయి- 740
  4. భువనేశ్వర్- 928
  5. రాంచీ- 1,213
  6. కోల్‌కతా- 720
  7. తిరువనంతపురం- 148
  8. అహ్మదాబాద్- 497
  9. అజ్‌మేర్- 820
  10. ప్రయాగ్‌రాజ్‌- 588
  11. భోపాల్‌- 664
  12. బిలాస్‌పూర్- 568
  13. చండీఘడ్‌- 433
  14. గువాహటి- 30
  15. జమ్ము అండ్‌ శ్రీనగర్- 08
  16. మాల్దా- 432
  17. ముజఫర్‌పూర్- 89
  18. పట్నా- 33
  19. ప్రయాగ్‌రాజ్- 286
  20. సిలిగురి- 95
  21. గోరఖ్‌పూర్- 100
  22. మొత్తం ఖాళీల సంఖ్య: 9,970

విద్యార్హతలు : అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసుండాలి.

వయోపరిమితి : 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. మాజీ సైనికోద్యోగులు, ఈబీసీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ : ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతం : అసిస్టెంట్ లోకో పైలెట్‌లకు నెలకు రూ.19,900 శాలరీ ఇస్తారు.

ప్రశ్నపత్రం వివరాలు :

సీబీటీ-1 పరీక్షకు 60 నిమిషాల సమయం ఉంటుంది. 75 ప్రశ్నలకు 75 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. మ్యాథ్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలు ఇస్తారు.

సీబీటీ-2 పరీక్షలో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి ఇస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి; పార్ట్‌-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి ఇస్తారు. 75 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పార్ట్‌-ఏలో మ్యాథ్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఉంటాయి; ఇక పార్ట్‌-బిలో సంబంధిత ట్రేడ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2025 ఏప్రిల్ 12
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 11
  • దరఖాస్తుల సవరణ తేదీలు: 2025 మే 14 నుంచి 23 వరకు

కొత్తగా ఉద్యోగంలో చేరారా? - ఈ టిప్స్​ పాటిస్తే ప్రమోషన్​ పక్కా!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌- రైల్వేలో 1007 పోస్టులు- దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.