ETV Bharat / education-and-career
ఐటీఐ చేసిన వారికి బీహెచ్ఈఎల్లో జాబ్స్ - వేతనం 30వేల నుంచి ప్రారంభం
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) భర్తీ చేయనున్న 515 పోస్టులు - రెండు దశల్లో ఎంపిక విధానం - ఆగస్టు 8 వరకు దరఖాస్తుకు అవకాశం

Published : July 15, 2025 at 3:14 PM IST
BHEL Notification 515 Posts : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) 515 పోస్టులను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీల్లో ఫిట్టర్ - 176, టర్నర్ - 51, మెషినిస్ట్ - 104, ఎలక్ట్రీషియన్ - 65, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 18, ఫౌండ్రీమెన్ - 4 ఉన్నాయి. యూనిట్లు రాణిపేట్, విశాఖపట్నం, వారణాసి, బెంగుళూరు, హైదరాబాద్, జగదీశ్‌పుర్, హరిద్వార్, భోపాల్, ఝాన్సీ, తిరుచిరాపల్లిల్లో ఉన్నాయి.
అర్హతలు: 60 శాతంతో పదో తరగతి ఫిట్టర్/ వెల్డర్/ టర్నర్/ మెషినిస్ట్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఫౌండ్రీమెన్ ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ (ఎన్‌ఏసీ) ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం సరిపోతుంది.
వయసు: 01.07.2025 నాటికి జనరల్/ ఈడబ్ల్యూఎస్‌లకు 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్లు, ఉద్యోగానుభవం ఉన్నవారికి ఏడేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : రూ.1072. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు రూ.472 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే).
జీతం : నెలకు రూ.29,500-65,000. అదనంగా ఇతర అలవెన్సులూ ఉంటాయి. తాత్కాలిక ఉద్యోగులుగా ఏడాదిపాటు కనీస వేతనంతో పనిచేయాలి. ఆ తర్వాత ఆర్టిసన్ గ్రేడ్-4గా శాశ్వతంగా నియమిస్తారు.
ఎంపిక విధానం : ఇది రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్-1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), స్టేజ్-2లో స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి. సీబీఈలో జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ 22.5 కనీసార్హత మార్కులు సాధించాలి. వీరిని 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. సీబీఈ, స్కిల్ టెస్టులను ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాష (తెలుగు, కన్నడ, తమిళం)ల్లో నిర్వహిస్తారు.
రెండో దశలో స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. దీంట్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. సీబీఈ స్కోర్ ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.
అప్లై చేసుకునే విధానం :
- భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ www.careers.bhel.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో 'భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ ఆర్టిసాన్ రిక్రూట్మెంట్' లింక్‌పై క్లిక్ చేయండి
- మీ మొబైల్ నంబర్, పేరు, ఇ మెయిల్ ఐడీ, ఇతర ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి.
- అభ్యర్థుల పరీక్ష కోసం 5 కేంద్రాలను ఎంచుకునే అవకాశం
- వారు సూచించిన ప్రకారం మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే (క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపిఐ లాంటివి) ఉపయోగించి చెల్లింపు చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 16.07.2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.08.2025
కంప్యూటర్ ఆధారిత పరీక్ష :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళంలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుంది.
- అభ్యర్థులు తమ ఎంచుకున్న భాషలో ఆన్‌లైన్ పరీక్ష రాయాలి. (100 మార్కులు)
- స్కోర్ల ఆధారంగా, అభ్యర్థులను స్కిల్ టెస్ట్ కోసం 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ఈ నెల 28 వరకే దరఖాస్తులకు అవకాశం

