ETV Bharat / education-and-career

ఇంటర్మీడియట్​ అర్హతతో ఇండియన్​ నేవీలో ఉద్యోగాలు - మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు! - INDIAN NAVY AGNIVEER

అగ్నివీర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు - ఇంటర్​ అర్హతతో ఉద్యోగాలు - మహిళలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు

Indian Navy Agniveer Recruitment
Indian Navy Agniveer Recruitment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 1, 2025 at 8:18 PM IST

3 Min Read

Indian Navy Agniveer Recruitment : భద్రతా దళాల్లో చేరేందుకు యువతకు ఓ మంచి అవకాశం. ఎంతో మంది యువత ఆర్మీ, నేవీ, ఎయిర్​పోర్స్​ ఉద్యోగాల్లో చేరాలని కలలు కంటుంటారు. ఇండియన్​ నేవీ అగ్నివీర్​ సీనియర్​ సెకెండరీ రిక్రూట్​(SSR) ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్​ విద్యార్హతతో పోటీ పడవచ్చు. మహిళలూ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిఏటా రెండుసార్లు ఇండియన్​ నేవీ అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తారు. ఇవి శాశ్వత ఉద్యోగాలు కానప్పటికీ అగ్నివీర్​గా ఎంపికైతే ప్రతి నలుగురులో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది. ఆ తర్వాత ఫిజికల్​, మెడికల్​ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇలా అవకాశం వచ్చిన వారు నాలుగేళ్లు సేవ చేయాలి. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వేతనం, సేవానిధి :

  • మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.30,000..రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏట రూ.40,000 వేతనం ఇస్తారు.
  • ప్రతినెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్​ ఫండ్​కి జమ చేస్తారు.
  • మొత్తం నాలుగేళ్లు వ్యవధికి గానూ సేవానిధికి రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి వెళ్తుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వడ్డీతో కలిసి సుమారు రూ.11.71 లక్షలు వస్తుంది. దీనిపై పన్ను ఉండదు.
  • ఒకవేళ అగ్నివీరులు నాలుగేళ్లలోపే వైదొలిగితే వారి వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి ఇస్తారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.
  • వీరికి పింఛను, గ్రాట్యుటీ, డీఏ, మిలటరీ సర్వీస్​ పే, పీఎఫ్​ వంటివి వర్తించవు. ఎక్స్​ సర్వీస్​ మెన్​గా కూడా పరిగణించరు.

వారినే శాశ్వత విధుల్లోకి :

  • నాలుగేళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్​ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని నేవీలో సెయిలర్​ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు.
  • ఇందుకోసం ఆ వ్యవధిలో ప్రతిభ, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా అవకాశం పొందినవారు లెవెల్​-3 వేతనంతో కెరియర్​ ప్రారంభిస్తారు.
  • అన్ని ప్రోత్సాహాలూ వర్తిస్తాయి. పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. అనంతరం పింఛనూ ఇస్తారు.

వయసు : సెప్టెంబరు 1, 2004 - డిసెంబరు 31, 2008 మధ్య జన్మించిన అవివాహితులు అర్హులు.

ఎస్‌ఎస్‌ఆర్‌ అర్హత :

  • ఈ పోస్టులకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇంటర్​/ప్లస్​2లో మ్యాథ్స్​, ఫిజిక్స్​ తప్పనిసరి సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలు అర్హులు.
  • లేదంటే మెకానిక్​/ ఎలక్ట్రికల్‌/ ఆటోమొబైల్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు.
  • ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేజ్‌-1 (ఐనెట్‌) ఇలా :

  • ఆన్​లైన్​లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి.
  • ఈ ప్రశ్నలన్నీ ఇంగ్లీష్​, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు.అవి ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌.
  • ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి.
  • సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
  • ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. నెగిటివ్​ మార్కులు ఉంటాయి.

ఫిజికల్‌ టెస్టులు : స్టేజ్​-1లో అర్హులకు ఫిజికల్​ టెస్టులు నిర్వహిస్తారు.

  • మహిళలు, పురుషులు కనీసం 157 సెం.మీ. ఎత్తు.
  • 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 6.30 నిమిషాలు, మహిళలు 8 నిమిషాల్లో పూర్తి చేయాలి.
  • పురుషులు 20 గుంజీలు, మహిళలు 15 గుంజీలు తీయాలి.
  • పుష్‌ అప్స్‌ పురుషులు 15, మహిళలు 10
  • బెంట్‌ నీ సిట్‌ అప్స్‌ పురుషులు 15, మహిళలు 10 తీస్తే అర్హత సాధిస్తారు.

స్టేజ్‌-2 పరీక్ష :

  • ఫిజికల్​ స్టాండర్ట్​ టెస్టుల్లో అర్హులకు దీన్ని నిర్వహిస్తారు.
  • ఇది కూడా స్టేజ్‌-1 మాదిరిగానే వంద మార్కులకు ఉంటుంది.
  • ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో వీటిని అడుగుతారు.

  • నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
  • ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. నెగెటివ్​ మార్కులు ఉంటాయి.
  • స్టేజ్‌-2లో అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఇందులో విజయవంతమైనవారిని స్టేజ్‌-2 పరీక్షలో పొందిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తారు.
  • వీరికి ఐఎన్‌ఎస్ చిలక సరస్సులో శిక్షణ ఇస్తారు. అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.

ఆన్​లైన్​ దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్​ 10 సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ఫీజు : జీఎస్​టీతో కలిపి రూ.649

స్టేజ్​-1 ఐనెట్​ : మే నెలలో

ఈ వెబ్‌సైట్​లో దరఖాస్తు చేసుకొండి: https://www.joinindiannavy.gov.in/

వీరి దేశభక్తికి సెల్యూట్​ చెప్పాల్సిందే -​ 'అగ్నివీర్'​కు ఒకేసారి ఎంపికైన ఇద్దరు కవలలు

'అగ్నివీర్'​ నోటిఫికేషన్ వచ్చేసింది - వారికి బోనస్​ మార్కులు - చివరి తేదీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.