IIT Delhi Summer Boot Camp 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - దిల్లీ (ఐఐటీ దిల్లీ) దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం వేసవి బూట్‌క్యాంప్ ప్రారంభించనుంది. మూడు వారాల పాటు సాగే ఈ క్యాంప్ జూన్ 9 నుంచి 27 మధ్య జరగనుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘సస్టెయినబిలిటీ అండ్ ఇన్నోవేషన్’ అనే అంశం కోసం పని చేస్తారు.
ఛేెంజ్ మేకర్స్ 2025: వాతావరణపరంగా ఎదుర్కొనే వివిధ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఇది ఉండబోతోంది. చదువుతున్న సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఎవరైనా దీనిలో పాల్గొనవచ్చు. ఐఐటీ దిల్లీ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. అక్కడి అధ్యాపకుల నుంచి తగిన గైడెన్స్ లభిస్తుంది. దీన్ని ‘చేంజ్ మేకర్స్ 2025’ పేరుతో నిర్వహిస్తున్నారు. మూడు వారాల ప్రోగ్రామ్‌లో మొదటి రెండు వారాలూ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. చివరి వారం మాత్రం ఐఐటీ దిల్లీ క్యాంపస్‌లో ఉంటుంది. దరఖాస్తులు ఏప్రిల్ చివరిలోగా పంపాలి.
ప్రత్యేకతలు: ఈ కార్యక్రమంలో పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు, ఇంజనీరింగ్, డిజైన్, మానవ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, నిర్వహణ, విధానం లేదా అంతర్ విభాగ స్వభావం కలిగిన ఏవైనా డొమైన్‌లలో విద్యార్ధులు పాల్గొనవచ్చు. స్థిరత్వంతో కూడిన ఆవిష్కరణలతో వినూత్నమైన ప్రభావవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పర్యావరణాన్ని పరిరక్షణపై యువతతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి ఈ కార్యక్రమంలో ఉంటాయి. మరిన్ని వివరాలకు: https://home.iitd.ac.in/
IIT అడ్మిషన్ న్యూ రూల్స్ - ఇకపై SC, STలకు అడ్మిషన్ ఫీజులో రాయితీ - కటాఫ్ మార్కుల్లో రిలాక్సేషన్