Telangana CPGET 2025 : డిగ్రీ పూర్తి చేసిన విద్యార్తులు ఉన్నత విద్య కోసం పీజీ, తదితర కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అంతవరకే పరిమితం. కానీ రాష్ట్రంలోని 8 వర్సిటీలకు సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలకు అవకాశం కల్పించింది. దీనికి ఒక్కదానికి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఇందులో రెండేళ్లు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు జిల్లాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు డిగ్రీతోనే చదువు ఆపేస్తున్నారు. ఉన్నతంగా ఎదగడానికి, జీవితంలో స్థిరపడటానికి పీజీ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఎంఏలో తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్, మానవ వనరుల శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పరిపాలన శాస్త్రం, పర్యాటక రంగం కోర్సులు ఉన్నాయి.
పీహెచ్‌డీకి అవకాశం : ఎమ్మెస్సీలో గణితం, భౌతిక, రసాయన, జంతు, వృక్ష, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, భూగర్భ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ సైన్స్.. తదితర విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పీహెచ్‌డీ సైతం చేయడానికి అవకాశం ఉంది.
పీజీసెట్ పరీక్షకు ఈనెల 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 17 వరకు ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 24 వరకు రూ.500 ఆలస్య రుసుంతో, 28 వరకు రూ.2000 రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. www.cpget.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Cpget 2022: సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల.. జులై 4 వరకు దరఖాస్తులు స్వీకరణ