Law Internship in CBI : ఘజియాబాద్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అకాడమీ 30 లా ఇంటర్న్స్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, లక్నో, బెంగళూరుల్లో అవకాశం కల్పిస్తారు. ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, కోర్టు అప్లికేషన్లను రూపొందించడం, కొన్ని కేసుల విషయంలో కోర్టు తీర్పులను అధ్యయనం చేయడం, డాక్యుమెంట్లను, సాక్ష్యాలను సేకరించడం, కోర్టులో సాక్షులను విచారించడం, డేటా సేకరించడం, ట్రయల్ వర్క్, ఇలా వివిధ రకాల విధుల విషయంలో లా అధికారులకు ఇంటర్న్స్ సహాయకులుగా పని చేస్తారు. దీంతో కోర్టు కేసుల విషయంలో అవగాహన, పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది కెరియర్‌లో రాణించడానికి, లక్ష్య సాధనకూ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్న్‌షిప్ కాల పరిమితి మూడు నుంచి ఆరు నెలలు.
అర్హతలు :
- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదువుతున్న వారు లేదా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసిన వాళ్లు దరఖాస్తుకు అర్హులు
- ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సు చదువుతున్న వారు లేదా ఎనిమిదో సెమిస్టర్ పూర్తి చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంటర్న్‌షిప్ సమయంలో సీబీఐ ఎలాంటి స్టైపెండ్ చెల్లించదు. వసతి, ప్రయాణ ఖర్చులను ఇంటర్న్స్ సొంతంగా భరించాలి.
- ఎటువంటి వైద్య సదుపాయాలూ ఉండవు. సీబీఐలో ఉద్యోగం సంపాదించడానికి ఈ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించదు.
- ఇంటర్న్‌షిప్‌లో చేరే సమయంలో ‘ఓత్ ఆఫ్ సీక్రెసీ’ పై అభ్యర్థి సంతకం చేయాలి. శిక్షణ సమయంలో, ఆ తర్వాత కేసులకు సంబంధించిన కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచాలనే నియమాన్ని పాటించడం తప్పనిసరి.
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సూపర్ ఛాన్స్ - కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ చూశారా?
ISROలో ఇంటర్న్‌షిప్ చేయాలా? అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇవిగో!