Best Environmental Courses Details: బీటెక్ సివిల్ చేసినవాళ్లు చదువుతో సంబంధం లేకుండా సమాజానికీ, పర్యావరణానికీ ఉపయోగపడే కోర్సులు ఎక్కడ చదవొచ్చని ఓ యువకుడి సందేహానికి కెరియర్ కౌన్సెలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ సలహా ఇచ్చారు.
నచ్చిన కోర్సుల్ని చేసేయండిలా! బీటెక్ చేసి, సమాజానికీ, పర్యావరణానికీ ఉపయోగపడే కోర్సులు చదవాలనుకోవడం హర్షణీయమే. ఈ కోర్సులు చదివి సమాజానికి ఎలా ఉపయోగపడాలని భావిస్తున్నారు? వ్యక్తిగతంగా సమాజం, పర్యావరణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ కోర్సులతో ఏదైనా ఉపాధి చేపట్టాలనుకుంటున్నారా? పర్యావరణ రంగంలో సమాజసేవ చేయాలని అభిలాషా? ‘చదువుతో సంబంధం లేకుండా’ అన్నారు కాబట్టి, నచ్చిన కోర్సుల్ని ఆన్‌లైన్‌లో చేయండి.
ఉదాహరణకు ఎన్‌పీటెల్ నుంచి ‘సొసైటీ అండ్ ఎన్విరాన్‌మెంట్’, కోర్స్‌ఎరా నుంచి ‘గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్’, ‘గ్రీనింగ్ ద ఎకానమీ: సస్టెయినబుల్ సిటీస్’, ‘ద ఏజ్ ఆఫ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’ లాంటి కోర్సులు చేయవచ్చు. ఎడెక్స్ నుంచి ‘ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఫర్ సస్టెయినబిలిటీ’, ‘ద సైన్స్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ద జీఎంఓ’, ఫ్యూచర్ లెర్న్ ద్వారా ‘ఎన్విరాన్‌మెంటల్ ఛాలెంజెస్ సిరీస్’, స్వయం నుంచి ‘ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’ లాంటి కోర్సులు చేయవచ్చు.
ఇవే కాకుండా ‘ఎన్విరాన్‌మెంటల్ సోషియాలజీ, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, క్లైమేట్ ఛేంజ్, క్లైమేట్ జస్టిస్, అర్బనైజేషన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్‌మెంటల్ పాలసీస్ అండ్ లాస్, సోషియాలజీ ఆఫ్ సైన్స్, ఇండియన్ సొసైటీ: ఇమేజెస్ అండ్ రియాలిటీస్, సొసైటీ ఇన్ ఇండియా’ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు.
కొత్తగా ఉద్యోగంలో చేరారా - ఒత్తిళ్లను ఇలా ఎదుర్కోండి!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రైల్వేలో 1007 పోస్టులు- దరఖాస్తు చేసుకోండిలా!