Habits That Will Kill Your Career : మనిషి ఎదగాలన్నా, అందరితో కలిసి సంతోషంగా బతకాలన్నా మంచి అలవాట్లు ఉండటం ఎంత ముఖ్యమో, చెడు అలవాట్లు లేకపోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులు ఓ 10 చెడు అలవాట్లు వదిలిపెట్టాలి. అప్పుడే కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- సమయపాలన పాటించకపోవడం : జీవితంలో టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. కొందరికి ఏదైనా పనిని అప్పగిస్తే సమయానికి చేయరు. చాలా ఆలస్యంగా పని పూర్తి చేస్తారు. ఇది బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది. ఇది మీ కెరీర్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
- ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడం : ఏ రంగంలోనైనా ఇతరుల ఫీడ్ బ్యాక్ తీసుకోవడం అవసరం. ఫీడ్ బ్యాక్‌ను విస్మరించినా, పట్టించుకోకపోయినా మీరు మెరుగుపడలేరు. అలాగే ఇతరుల నుంచి ఏమీ నేర్చుకోలేరు కూడా.
- గాసిప్స్ మాట్లాడడం : సహోద్యోగుల గురించి, ఆఫీసులో వారు లేనప్పుడు చాలా మంది మాట్లాడుకుంటారు. ఇలా మీరు వారి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని తెలిస్తే మీపై నమ్మకం పోతుంది. దీంతో మీపై టీమ్ మెంబర్స్‌కి, సంస్థ యజమాన్యానికి ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది.
- చొరవ తీసుకోకపోవడం : మీ ఆఫీసులో ఏదైనా పనిని అప్పగిస్తే సొంతంగా చేసేందుకు ప్రయత్నించండి. ఏదైనా వర్క్ అప్పగిస్తే నేను చేస్తానని చెప్పండి. అప్పుడు మీకు పనిపట్ల ఆసక్తి, ఆశయం ఉన్నట్లు అర్థమవుతుంది.
- సరైన కమ్యునికేషన్ స్కిల్స్ లేకపోవడం : ఆఫీసులో మీ ఐడియాలను తెలియజేయండి. చర్చల్లో పాల్గొనండి. వాటికి దూరంగా ఉండడం వల్ల మీరు అవకాశాలను కోల్పోవచ్చు.
- స్కిల్స్ పెంచుకోకపోవడం : ఏ ఉద్యోగం చేసినా కాలానికి అనుగుణంగా స్కిల్స్‌ను అప్డేట్ చేసుకోండి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. లేదంటే ఉద్యోగ జీవితంలో ఇతరుల కంటే మీరు వెనుకబడిపోవచ్చు.
- నెగిటివ్‌గా ఆలోచించడం : ఆఫీసులో ఎల్లప్పుడూ ఇతరులపై ఫిర్యాదు చేయడం, వారిదే తప్పు అని ఎత్తిచూపడం తగ్గించుకోండి. లేదంటే టీమ్ స్పిరిట్ దెబ్బతింటుంది. అలాగే ఇతరులు మిమ్మల్ని ప్రతికూల ఆలోచనలతో చూసే ప్రమాదం ఉంటుంది.
- అతిగా మల్టీటాస్కింగ్ చేయడం : ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించడం వల్ల మీ వర్క్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంలో మీ కెరీర్‌పై ప్రభావం చూపుతుంది.
- చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం : మీ సమస్యలన్నింటికీ ఇతరులను నిందించవద్దు. మీరు తప్పు చేసినప్పుడు అంగీకరించకపోవడం మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. తప్పును ఒప్పుకోండి. అప్పుడు మీపై నమ్మకం పెరుగుతుంది.
- నెట్‌వర్క్ పెంచుకోకపోవడం : ఆఫీసులో అందరితో కలివిడిగా ఉండడం మంచిది. ఒంటరిగా ఉండడం, మీ పని మీరు చూసుకోవడం కాదు. సింగిల్‌గా ఉండడం వల్ల కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్ల గురించి తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కెరీర్‌లో ఉన్నత స్థానానికి వెళ్లాలా? ఈ వారెన్ బఫెట్ టిప్స్ పాటిస్తే- సూపర్ సక్సెస్ గ్యారెంటీ!
కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ టాప్-10 ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే!