ETV Bharat / business

'H-1B' లేకున్నా ఈ వీసాలతో అమెరికాలో ఉద్యోగం - WORK IN AMERICA WITHOUT JOB OFFER

అమెరికాలో జాబ్‌ చేయాలా? కానీ H-1B వీసా లేదా? డోంట్‌ వర్రీ- ఈ స్పెషల్‌ వీసాలతో మీ కల సాకారం కావడం గ్యారెంటీ!

Work In America Without Job Offer
Work In America Without Job Offer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 16, 2025 at 3:15 PM IST

3 Min Read

Work In America Without Job Offer : మీరు అమెరికా వెళ్లి జాబ్‌ చేయాలని కలలు కంటున్నారా? కానీ హెచ్‌1బీ వీసా రావడం లేదా? అయితే ఇది మీ కోసమే. హెచ్‌1బీ వీసా లేకున్నా ఫర్వాలేదు. మరో రెండు మార్గాల్లో మీరు అమెరికా వెళ్లి జాబ్ చేయవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు అమెరికాలో జాబ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో చాలా అభివృద్ధి చెందిన, చెందుతున్న పరిశ్రమలు ఉంటాయి. పైగా అక్కడ జీతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు అమెరికాలో పనిచేసే వాళ్లకు నిబంధనల ప్రకారం, శాశ్వత నివాసం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అమెరికా ఉద్యోగాలంటే అంత మోజు.

హెచ్‌1బీ వీసా అంత ఈజీ కాదు!
అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్‌1బీ వీసా ఉండాలి. ఈ వీసా పొందాలంటే, ముందుగా మీకు యూఎస్‌ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చి ఉండాలి. ఒక వేళ జాబ్ ఆఫర్ వచ్చినా, వార్షిక పరిమితి కలిగిన ఈ వీసాకు చాలా పోటీ ఉంటుంది. అందుకే మంచి నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఈ హెచ్‌1బీ వీసా పొందడం చాలా కష్టమైపోతుంది.

కానీ జాబ్‌ ఆఫర్ లేకుండా కూడా అమెరికాలో పని చేసేందుకు అవకాశం ఉంది. నిర్దేశిత అర్హతలు ఉన్న వ్యక్తులు లేదా నిపుణులు EB-2 నేషనల్ ఇంట్రెస్ట్‌ వైవర్‌ (NIW), O-1 వీసాలు తీసుకుని అమెరికాలో స్వతంత్రంగా పని చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.

1. EB-2 NIW VISA : ఈబీ-2 నేషనల్ ఇంట్రెస్ట్ వైవర్‌ వీసా అనేది ఉపాధి ఆధారిత వీసా. అంటే దీనికి అమెరికా కంపెనీ స్పాన్సర్‌షిప్‌ కానీ, జాబ్ ఆఫర్ కానీ ఉండాల్సిన పనిలేదు. పైగా ఈ వీసా తీసుకునేవాళ్లకు గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది. అంటే అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు, పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఇతర అనేక రకాల ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.

EB-2 NIW వీసా ఎవరికి ఇస్తారు?
అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే రంగాల్లో అధునాతన డిగ్రీలు (మాస్టర్స్‌ లేదా పీహెచ్‌డీ) చేసినవారికి లేదా అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ వీసాను మంజూరు చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే,

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌ (STEM) రంగాలకు చెందిన నిపుణులకు; కళలు, వ్యాపార రంగాల్లోని నిష్ణాతులకు, అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లకు ఈ వీసా ఇస్తారు.

హెచ్‌1బీ వీసాలా కాకుండా, ఈబీ-2 ఎన్‌ఐడబ్ల్యూ వీసా కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీకు ఎలాంటి స్పాన్సరింగ్ కంపెనీ అవసరం ఉండదు.

2. O-1 Visa : అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తులకు ఈ వీసాలను జారీ చేస్తారు. దీనికి ఏ అమెరికా కంపెనీ నుంచి స్పాన్సర్‌షిప్ అవసరం లేదు. ఈ వీసా పొందిన వాళ్లు ఒకేసారి అనేక కంపెనీల కోసం పని చేయవచ్చు. లేదా స్వయం ఉపాధి పొందవచ్చు.

సైన్స్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్, బిజినెస్‌, అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యం కలిన వ్యక్తులకు, అలాగే టీవీ, సినిమా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు కలిగి, అసాధారణ విజయాల రికార్డ్ కలిగిన వ్యక్తులకు ఈ వీసా మంజూరు చేస్తారు.

O-వీసా రకాలు : ఈ ఓ-వీసాలో అనేక రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే?

  • O-1A వీసా : సైన్స్, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, బిజినెస్‌, అథ్లెటిక్స్‌లో అసాధారణ ప్రతిభ ఉన్నవారికి ఈ వీసా ఇస్తారు.
  • O-1B వీసా : టీవీ, సినిమా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొంది, అసాధారణ విజయాల ట్రాక్ రికార్డ్ ఉన్నవారికి ఈ వీసా ఇస్తారు.
  • O-2 వీసా : ఒక నిర్దిష్ట ఈవెంట్‌లో లేదా ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చిన O-1A వీసా కలిగిన కళాకారుడికి లేదా అథ్లెట్‌కు సహాయంగా వచ్చేవారికి ఈ వీసా ఇస్తారు.
  • O-3 వీసా : O-1A, O-2 వీసాలు కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి పిల్లలకు ఈ వీసా జారీ చేస్తారు.

అయితే ప్రతిష్టాత్మక అవార్డ్‌లు గెలుచుకున్నవారు, గణనీయమైన పరిశోధనలు ప్రచురించినవారు, పరిశ్రమలో మంచి పనితీరు కనబరిచిన వారే ఈ O-1 వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఒక్కసారి ఈ వీసా పొందితే, వారు ఒకేసారి బహుళ ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి లేదా అమెరికాలో స్వయంగా, సొంతంగా వ్యాపారాలు స్థాపించడానికి వీలు కలుగుతుంది. దీని వలన వ్యక్తులు బహుళ ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా USలో వారి స్వంత వ్యాపారాలను స్థాపించడానికి వీలు కల్పిస్తుంది.

అమెరికా వెళ్లే విద్యార్థులకు బ్యాడ్​న్యూస్! F-1 వీసాలో 41శాతం అప్లికేషన్లు రిజెక్ట్​

అమెరికా పెళ్లి సంబంధం - ట్రంప్​ ఇంటర్వ్యూ పాసవుతారా మరి? - లేదంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.