How To Fix UPI Issues : నేడు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)తో చాలా వేగంగా, సులభంగా, నచ్చినట్లుగా డిజిటల్ పేమెంట్స్ చేయగలుగుతున్నాం. అందుకే దీనికి అత్యంత ఆదరణ లభిస్తోంది. కానీ కొన్ని సార్లు యూపీఐ యాప్ సరిగ్గా పనిచేయదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి వీలుపడదు. దీని వల్ల అత్యవసరంగా చేయాల్సిన పేమెంట్స్ ఆగిపోతాయి. ఇది మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అందుకే ఇలాంటి యూపీఐ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్యను చాలా సులభంగా ఎలా పరిష్కరించవచ్చు? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
యూపీఐ యాప్ సరిగ్గా పనిచేయకపోవడానికి గల కారణాలు ఇవే!
- ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్ సరిగ్గా లేకపోయినా, స్లోగా ఉన్నా యూపీఐ పేమెంట్స్ చేయడం కష్టమవుతుంది.
- కొన్నిసార్లు యూపీఐ సర్వీస్‌లు, బ్యాంక్ సర్వర్‌లు డౌన్ అవుతుంటాయి. బాగా రద్దీ ఉండే సమయాల్లో, మెయింటెనెన్స్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
- పదేపదే తప్పుడు యూపీఐ పిన్‌ను ఎంటర్ చేస్తూ ఉంటే, మీ యూపీఐ యాక్సెస్‌ను డిజేబుల్ చేస్తారు. కొన్నిసార్లు పూర్తిగా మీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు కూడా.
- వాస్తవానికి యూపీఐ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుంటే బగ్స్ ఉండడం వల్ల యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. లేదా మీరు బాగా పాత ఫోన్ వాడుతుంటే, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చేసినప్పుడు కంపాటిబిలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు. దీని వల్ల కూడా యూపీఐ పేమెంట్స్ చేయలేకపోవచ్చు.
- బ్యాంకులు, యూపీఐ యాప్ లావాదేవీలకు రోజువారీ పరిమితి ఉంటుంది. ఇది కనుక అయిపోతే, మరుసటి రోజు వరకు మీరు ఎలాంటి యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు.
యూపీఐ సమస్యలను పరిష్కరించుకోండిలా!
- యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు మీ ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్ సరిగ్గా ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, తరువాత ఆఫ్ చేయాలి. దీని వల్ల నెట్‌వర్క్ మొత్తం రీఫ్రెస్ అవుతుంది. ఇంటర్నెట్ బాగా పనిచేస్తుంది.
- గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ లాంటి అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యూపీఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. దీని వల్ల యూపీఐ పేమెంట్స్ సజావుగా జరిగిపోతాయి.
- ఎంత ప్రయత్నించినా యూపీఐ పేమెంట్స్ జరగకపోతే, అప్పుడు మీ ఫోన్‌ను ఓసారి రీస్టార్ట్ చేయండి. దీని వల్ల యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లోని కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ తొలగిపోతాయి. ఫలితంగా చాలా సులువుగా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలు ఏర్పడుతుంది.
- యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ యూపీఐకు బ్యాంక్ అకౌంట్‌ను సరిగ్గా లింక్ చేశారో, లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీ యూపీఐ ఐడీని వెరిఫై కూడా చేసుకోవాలి.
- కొన్నిసార్లు బ్యాంక్, యూపీఐ సర్వర్‌లు డౌన్ అవుతుంటాయి. ఇలాంటి సమయంలో మనం యూపీఐ పేమెంట్లు చేయలేము. కనుక ఇలాంటి సమయంలో కొంత సమయం వెయిట్ చేసి, తరువాత పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది.
కేవలం UPIతో క్యాష్‌ను అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు - ATM కార్డు, బ్యాంకుతో పనేలేదు!
UPIలోని ఈ 6 ఫీచర్స్ తెలుసా? ఇన్‌స్టాంట్‌గా లోన్, ఫారిన్ నుంచి ఈజీగా పేమెంట్, మరెన్నో!