ETV Bharat / business

వార్ ఎఫెక్ట్‌ - సెన్సెక్స్‌ 800+ పాయింట్స్ డౌన్‌ - Stock Market Today

Stock Market Today
Stock Market Today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 9:44 AM IST

Updated : Oct 4, 2024, 4:32 PM IST

Stock Market Today October 4, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 354 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు అమాంతం పెరగడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రభావం నేడు కూడా కొనసాగుతోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు నష్టపోయి 82,322 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 64 పాయింట్లు కోల్పోయి 25,186 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టెక్ మహీంద్రా, టైటాన్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : బజాజ్ ఫైనాన్స్‌, ఏసియన్ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, రిలయన్స్

LIVE FEED

4:29 PM, 4 Oct 2024 (IST)

1% వరకు పతనమైన సెన్సెక్స్ & నిఫ్టీ

Stock Market Close : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్‌, నిఫ్టీలు దాదాపు 1 శాతం వరకు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఎనర్జీ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలు మూటగట్టుకున్నాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ సప్లై, ధరలపై అనిశ్చితి నెలకొనడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

దీనితో చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 25,049 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్‌ : ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్
  • నష్టపోయిన స్టాక్స్ : ఎం అండ్ ఎం, బజాజ్‌ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, హాంకాంగ్​ అన్నీ లాభాలతో ముగిశాయి. చైనా మార్కెట్లకు ఇవాళ సెలవు. గురువారం యూఎస్​ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.15,243.27 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గత మూడు రోజులుగా క్యాష్ మార్కెట్ నుంచి దాదాపు రూ.30,614 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌ఐఐలు ఆఫ్‌లోడ్ చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, అక్కడి అధికారులు అనేక ద్రవ్య, ఆర్థిక ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నారు. దీనితో చైనా కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయనే అంచనాలతో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, తమ ఇన్వెస్ట్‌మెంట్లను భారత్‌ నుంచి చైనాకు, హాంకాంగ్‌కు తరలిస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధరలు 0.99 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 78.39 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open October 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ట్రేడింగ్ ఫ్లాట్‌గా ముగిసింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96గా ఉంది.

3:46 PM, 4 Oct 2024 (IST)

సెన్సెక్స్‌ 800+ పాయింట్స్‌ & నిఫ్టీ 200 పాయింట్స్‌ డౌన్‌

Stock Market Close : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడం వల్ల దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఐటీ స్టాక్స్‌ మాత్రం రాణించాయి.

రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు స్టాక్ మార్కెట్లు లోనయ్యాయి. చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 25,049 వద్ద ముగిసింది.

2:52 PM, 4 Oct 2024 (IST)

నిఫ్టీ 250+ పాయింట్స్‌ డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 875 పాయింట్లు నష్టపోయి 81,621 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 256 పాయింట్లు కోల్పోయి 24,993 వద్ద ట్రేడవుతోంది.

2:05 PM, 4 Oct 2024 (IST)

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్‌ 650+ పాయింట్స్ డౌన్

స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 664ట్లు నష్టపోయి 81,829 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 25,049 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌ఎంసీజీ, రియాలిటీ, ఆటో స్టాక్స్ భారీ నష్టాల్లో ఉన్నాయి.

1:04 PM, 4 Oct 2024 (IST)

మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 82,054 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 25,087 వద్ద ట్రేడవుతోంది. ఐటీ షేర్లు రాణిస్తున్నప్పటికీ, రియాలిటీ షేర్లు మాత్రం భారీగా నష్టపోతున్నాయి.

12:08 PM, 4 Oct 2024 (IST)

సెన్సెక్స్‌ 650+ పాయింట్స్ అప్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 670 పాయింట్లు లాభపడి 83,175 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 172 పాయింట్లు వృద్ధిచెంది 25,423 వద్ద ట్రేడవుతోంది.

11:20 AM, 4 Oct 2024 (IST)

యుద్ధ భయాలు ఉన్నప్పటికీ!

యుద్ధ భయాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల నుంచి తేరుకుని లాభాల్లోకి దూసుకువచ్చాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు రాణిస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 333 పాయింట్లు లాభపడి 82,830 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధిచెంది 25,340 వద్ద ట్రేడవుతోంది.

10:55 AM, 4 Oct 2024 (IST)

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని క్రమంగా లాభాల్లోకి దూసుకువచ్చాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 381 పాయింట్లు లాభపడి 82,870 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధిచెంది 25,332 వద్ద ట్రేడవుతోంది.

10:13 AM, 4 Oct 2024 (IST)

వార్ ఎఫెక్ట్‌ - నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Today : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రభావం నేడు కూడా కొనసాగుతోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 85 పాయింట్లు నష్టపోయి 82,373 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 25,218 వద్ద ట్రేడవుతోంది.

ఆసియా మార్కెట్లు
ప్రస్తుతం ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, హాంకాంగ్​ అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లకు ఇవాళ సెలవు. గురువారం యూఎస్​ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.15,243.27 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గత మూడు రోజులుగా తీసుకుంటే క్యాష్ మార్కెట్ నుంచి దాదాపు రూ.30,614 కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌ఐఐలు ఆఫ్‌లోడ్ చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, అక్కడి అధికారులు అనేక ద్రవ్య, ఆర్థిక ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నారు. దీనితో చైనా కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయనే అంచనాలతో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, తమ ఇన్వెస్ట్‌మెంట్లను భారత్‌ నుంచి చైనాకు, హాంకాంగ్‌కు తరలిస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధర 0.06 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 77.57 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open October 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96గా ఉంది.

Last Updated : Oct 4, 2024, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.