ETV Bharat / business

జాగ్రత్త! ఈ పేరుతో ఫోన్ వస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ! - RBI FAKE CALL SCAM

క్రెడిట్ కార్డు లావాదేవీల పేరుతో నయా స్కామ్- కాల్ లిఫ్ట్ చేస్తే అంతే సంగతులు- క్షణాల్లో అకౌంట్ ఖాళీ

rbi fake call scam
rbi fake call scam (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 7:06 PM IST

2 Min Read

RBI Fake Call Scam : ప్రస్తుత కాలంలో సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజల డబ్బును కొల్లగొట్టేందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరిట స్కామర్లు రెచ్చిపోతున్నారు. క్రెడిట్ కార్డుతో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని హెచ్చరించి డబ్బులు లాగేస్తున్నారు. ఒకవేళ వారి ట్రాప్​లో మీరు పడితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు ఖాళీ అయినట్లే! ఈ నేపథ్యంలోనే అసలేంటీ స్కామ్? రోబోటిక్ వాయిస్ కాల్ వస్తే ఏం చేయాలి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం.

స్కామర్లు ఇలా కాల్ చేస్తారు!

ఆటోమేటెడ్ కాల్ : తొలుత మీకు ఆర్బీఐ నుంచి రోబోటిక్ వాయిస్ కాల్ వస్తుంది. మీ క్రెడిట్ కార్డు నుంచి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయని హిందీ లేదా ఇంగ్లిష్​లో చెబుతారు. ఆ తర్వాత కొన్ని గంటల్లో మీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తామని మిమ్మల్ని హెచ్చరించి భయాందోళనకు గురిచేస్తారు. మరిన్ని వివరాల కోసం తమ ఆపరేటర్‌తో మాట్లాడటానికి మీ ఫోన్​లోని తొమ్మిదో నంబర్​ను నొక్కమని చెబుతారు.

నకిలీ అధికారి : మీరు తొమ్మిదో నంబర్‌ను నొక్కిన తర్వాత, ఆర్బీఐ అధికారి లేదా ఏజెంట్‌గా నటిస్తున్న స్కామర్‌తో కనెక్ట్ అవుతారు. అతడు బ్యాంకింగ్ పరిభాషలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా అనిపించడానికి మీ ఆధార్ కార్డ్ నంబర్, క్రెడిట్ కార్డు వివరాలను కూడా చెబుతాడు.

వివరాల సేకరణ : స్కామర్లు ఓటీపీ, సీవీవీ, క్రెడిట్ కార్డ్ నంబర్‌, నెట్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత డేటాను అడుగుతారు. లేదంటే మీ డివైజ్​కు రిమోట్ యాక్సెస్ ఇచ్చే హానికరమైన ఫైల్స్​ను వాట్సాప్​లో, టెక్ట్స్ మెసేజ్​ల రూపంలో పంపుతారు. వాటిని డౌన్‌ లోడ్ చేసుకోవాలని కోరుతారు. ఆ ఫైల్స్​ను డౌన్ లోడ్ చేయగానే మీ ఖాతాను వారు యాక్సెస్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును కొల్లగొట్టేస్తారు.

స్కామర్లు కాల్ చేస్తే ఏం చేయాలి?

మీకు ఆర్బీఐ అధికారుల పేరిట కాల్ వస్తే వెంటనే దాన్ని కట్ చేయండి. ఎందుకంటే ఆర్​బీఐ నుంచి ఎవరికి ఫోన్లు అనేవి రావు. కాల్​లో చెప్పిన విధంగా ఏ నంబర్‌ను నొక్కకండి. ఐడీలు, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ వివరాలను షేర్ చేయవద్దు.

అనుమానాస్పద లావాదేవీలను పర్యవేక్షించమని మీ బ్యాంకుకు తెలియజేయండి. మీ అకౌంట్ నుంచి ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే మీకు తెలియడానికి ఎస్సెమ్మెస్ అలర్ట్​ను యాక్టివేట్ చేయండి.

పాస్‌ వర్డ్స్​ను మార్చండి : మీరు మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏదైనా లాగిన్ సమాచారాన్ని స్కామర్‌తో పంచుకుంటే, వెంటనే మీ పాస్‌ వర్డ్స్​ను మార్చేయండి.

మీరు స్కామ్‌కు గురైతే వీలైనంత త్వరగా https://sancharsaathi.gov.in/sfc/ పోర్టల్​లో ఫిర్యాదు చేయండి. లేదంటే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

UPI పేమెంట్స్​పై కూడా GST?- ఇదిగో క్లారిటీ

విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్​ తగ్గుతుంది​- ఎలాగో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.