ETV Bharat / business

లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి? దీని వల్ల క‌లిగే లాభాలేంటి? - Life Insurance

Life Insurance an Investment Tool : లైఫ్ ఇన్సూరెన్స్ అనే మాట‌ను ఎప్పుడో ఒక‌ప్పుడు వినే ఉంటాం. ఈ కాలంలో త‌ప్ప‌ని స‌రి అయిన వాటిల్లో ఇదొక‌టిగా చెప్పుకోవ‌చ్చు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి? దీని వల్ల క‌లిగే లాభాలేంటి? త‌దిత‌ర వివ‌రాల్ని తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 11:31 AM IST

Life Insurance an Investment Tool
Life Insurance an Investment Tool (Getty Images, ETV Bharat)

Life Insurance an Investment Tool : లైఫ్ ఇన్సూరెన్స్ ఇదొక రక‌మైన పెట్టుబ‌డి! మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది ఈ కాలంలో త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. అనారోగ్యం పాలైన‌ప్పుడు మ‌న చేతిలో డ‌బ్బులు లేక‌పోయినా మ‌న‌ల్ని ఆదుకునే ఆయుధంలా ఇది ప‌నిచేస్తుంది. జీవితానికి ఒక రకంగా భ‌ద్ర‌త‌, స్థిర‌త్వాన్ని క‌ల్పిస్తుంది. అందుకే చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ క‌లిగి ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. చాలా కంపెనీలు, త‌మ ఉద్యోగులకు సైతం జీవిత భీమా సౌక‌ర్యం కల్పిస్తాయి. అందుకే ఇది చాలా అవ‌స‌ర‌మైన వాటిల్లో ఒక‌టి. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలేంటో ఈ ఆర్టిక‌ల్​లో తెలుసుకుందాం.

జీవిత బీమాను చేయించుకునే ముందు అవసరాలను చూసుకోవాలి. అందుకు త‌గ్గట్లుగానే ఏ రకమైన కవరేజీ ఉత్తమంగా సరిపోతుందో తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు ట‌ర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది నిర్ణీత కాలానికి మాత్ర‌మే క‌వ‌రేజీ అందిస్తుంది. సాధార‌ణంగా 10-30 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. మ‌రోవైపు కంప్లీట్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే జీవిత కాలంపాటు క‌వ‌రేజీ అందిస్తుంది. అంతేకాదు కాలం పెరిగే కొద్దీ న‌గ‌దు విలువ కూడా పెంచుతుంది. ప్రొటెక్ష‌న్​తో పాటు పొటెన్షియ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ విలువనూ పెంచుతుంది. స‌రైన పాల‌సీని ఎంచుకోవ‌డానికి ఈ తేడాల్ని అర్థం చేసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ప్రీమియాలు
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేట‌ప్పుడు వాటి ప్రీమియాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం చాలా ముఖ్యం. అయితే వీటి ధ‌ర వ‌య‌స్సు, ఆరోగ్య స్థితి, క‌వ‌రేజీ మొత్తం, పాల‌సీ ర‌కం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డుతుంది. ప్లాన్ ఎంపిక‌లో మీ ఆర్థిక ప‌రిస్థితి, ప‌రిమితుల గురించి సైతం ఆలోచించాలి. త‌క్కువ ఖ‌ర్చుతో, మంచి ప్లాన్​ను ఎంచుకోవాలి.

ప్రయోజనాలు
జీవిత బీమా పాలసీలు అనేక ప్ర‌యోజ‌నాల్ని అందిస్తాయి. అయితే అందులో ప్రాథ‌మికంగా ప్ర‌ధానమైంది మ‌ర‌ణం త‌ర్వాత క‌లిగే ప్ర‌యోజ‌నం. ఇది పాలసీదారుడు మరణించిన తర్వాత లబ్ధిదారులకు ఇన్సూరెన్స్ సొమ్ము అంద‌జేస్తుంది. అది కూడా టాక్స్ లేకుండా. ఫ‌లితంగా మ‌ర‌ణించి పాల‌సీదారుడి కుటుంబానికి ఆర్థిక భ‌రోసా, భ‌ద్ర‌త ఉంటుంది. మీ పాల‌సీలో ఇలాంటి సౌక‌ర్యం ఉందో లేదో చూసుకోవ‌డం ముఖ్యం.

నిపుణుల విశ్లేష‌ణ‌
లైఫ్ ఇన్సూరెన్స్ ప్ర‌పంచం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు అందులోని రిస్క్, ఇన్వెస్ట్​మెంట్ తీరు, ఫైనాన్షియ‌ల్ స్ట్రాట‌జీ లాంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఇందుకు ఆర్థిక నిపుణులు స‌ల‌హా, స‌హాయం అవ‌స‌రం. మీ ఆర్థిక ల‌క్ష్యాలు, రిస్క్​కు అనుగుణంగా పాల‌సీని తీసుకోవాలి. నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు తాజా అంశాల్ని ఫాలో అవుతారు. అందుకే వారి స‌ల‌హాల్ని తీసుకుని మీరు ఉత్త‌మ‌మైన పాలసీని తీసుకునే వీలుంటుంది.

మీ భవిష్యత్ భద్రంగా ఉండాలా? పక్కగా 'రిటైర్​మెంట్ ప్లాన్' చేసుకోండిలా! - Retirement Planning Tips

జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య - తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న యూజర్లు! - Zerodha Technical Glitch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.